RK Roja: మంత్రి పదవి వస్తుందని రోజాకి ముందే తెలుసు... అందుకే ఈ జబర్దస్త్ ప్లానింగ్!

Published : Apr 11, 2022, 12:01 AM ISTUpdated : Apr 11, 2022, 04:55 AM IST

నటి, ఎమ్మెల్యే, జబర్దస్త్ జడ్జి ఆర్కే రోజా (RK Roja)కు మంత్రి పదవి ఖాయమైంది. నేడు దీనిపై అధికారిక ప్రకటన కూడా జరిగిపోయింది. ఫుల్ కాంపిటీషన్ మధ్య రోజా మంత్రి పదవి దక్కించుకుంది. రెడ్డి సామాజిక వర్గం నుండి అనేక మంది ఆశావహులు ఉండగా.. మంత్రి పదవి రోజాను వరించింది.

PREV
15
RK Roja: మంత్రి పదవి వస్తుందని రోజాకి ముందే తెలుసు... అందుకే ఈ జబర్దస్త్ ప్లానింగ్!


గత వారం రోజుల నుండి ఏపీకి కొత్త మంత్రులు (AP Cabinet) ఎవరనే విషయంపై పెద్ద చర్చే నడిచింది. పూర్తిగా కొత్త కొత్తవారితో మంత్రి వర్గం ఉంటుందా లేక పాత కొత్త వారితో కలిపి సరికొత్త మిశ్రమం ఉంటుందా? ఒక వేళ పాత వారిని కూడా పరిగణలోకి తీసుకుంటే వారెవరు? ఇలా అనేక మిలియన్ డాలర్ ప్రశ్నలు అందరిలో మదిలో మెదిలాయి. 

25

సీఎం జగన్ (CM Jagan)కొత్తగా మంత్రి పదవులు ఎవరికీ ఇస్తారనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. కారణం ఈ మంత్రి వర్గ విస్తరణ పూర్తిగా సామాజిక వర్గాల ప్రాధాన్యత ప్రకారం ఉంది. ఈసారి సీఎం జగన్ బీసీలు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఎటువంటి సిఫార్స్లు పట్టించుకోకుండా మంత్రి పడవలు ఇచ్చారు. 

35

ఇంత పకడ్బందీగా సాగిన మంత్రి పదవుల కేటాయింపులో రోజాకు ముందే కొన్ని విషయాలు తెలుసని బుల్లితెర షోల కారణంగా కొందరు నిర్ధారిస్తున్నారు. దీనికి రుజువుగా కొన్ని విషయాలు వాళ్ళు విశదీకరిస్తున్నారు. లేటెస్ట్ జబర్దస్త్ ఎపిసోడ్స్ పరిశీలిస్తే... రోజా తన పార్ట్ తగ్గించుకుంటూ వస్తుంది. 

45

జడ్జెస్ గా చాలా మంది వెటరన్ హీరోయిన్స్ రంగంలోకి దిగారు. లైలా, ఆమనీ, ఇంద్రజ వంటి ఒకప్పటి హీరోయిన్స్ జబర్దస్త్ షోలో ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు తమ శక్తి మేర ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రోజా గతంలో వలె యాక్టివ్ గా లేరు. ఇక నేడు మంత్రి పదవి కన్ఫర్మ్ కావడంతో ఆమె జబర్దస్త్ షోలో కనిపించే అవకాశం లేదు.

55


కారణం.. మంత్రి పదవిలో ఉన్న ప్రజా ప్రతినిధులు ఆదాయం సమకూర్చే ఇతర రంగాల్లో ఉండకూడదనే ఒక నియమం ఉంది. దాని ప్రకారం జబర్దస్త్ నుండి రోజా తప్పుకోవడం ఖాయమే. రోజా నిష్క్రమణతో జబర్దస్త్ కి పెద్ద వెలితి ఏర్పడినట్లే. 

click me!

Recommended Stories