Bichagadu2 Review: 'బిచ్చగాడు 2' ప్రీమియర్ టాక్.. కథలో అసలు మ్యాటర్ అదే, విజయ్ ఆంటోనికి హిట్ పడ్డట్లేనా ?

Published : May 19, 2023, 08:12 AM IST

బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోని చాలా వైవిధ్యమైన చిత్రాల్లో నటించాడు. కానీ ఆస్థాయి విజయం దక్కలేదు. దాదాపు 6 ఏళ్ల తర్వాత బిచ్చగాడు చిత్రానికి సీక్వెల్ తో విజయ్ ఆంటోని ముందుకు వస్తున్నాడు.

PREV
17
Bichagadu2 Review: 'బిచ్చగాడు 2' ప్రీమియర్ టాక్.. కథలో అసలు మ్యాటర్ అదే, విజయ్ ఆంటోనికి హిట్ పడ్డట్లేనా ?

సైలెంట్ గా వచ్చిన బిచ్చగాడు చిత్రం తెలుగు తమిళ భాషల్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో మల్టి ట్యాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనికి మంచి క్రేజ్ వచ్చింది. అంతకు ముందు విజయ్ కొన్ని చిత్రాల్లో నటించాడు. కానీ విజయ్ ఆంటోని అంటే ఎవరో చాలా మందికి తెలియదు. బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోని ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. 

27

బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోని చాలా వైవిధ్యమైన చిత్రాల్లో నటించాడు. కానీ ఆస్థాయి విజయం దక్కలేదు. దాదాపు 6 ఏళ్ల తర్వాత బిచ్చగాడు చిత్రానికి సీక్వెల్ తో విజయ్ ఆంటోని ముందుకు వస్తున్నాడు. నేడు బిచ్చగాడు 2 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. బిచ్చగాడు మొదటి భాగాన్ని మించేలా రెండవ భాగం ఉంటుందా అనే ఆసక్తి అందరిలో ఉంది. మరి బిచ్చగాడు 2 అంచనాలని అందుకుందా ? మొదటి భాగాన్ని మించేలా థ్రిల్ చేసిందా అనే అంశాలు యూఎస్ ప్రీమియర్ షో రెస్పాన్స్ ని బట్టి తెలుసుకుందాం. 

37

బిచ్చగాడు 2లో విజయ్ ఆంటోనికి జోడిగా కావ్య థాపర్ నటించింది. కథలో విజయ్ ఆంటోని ఇండియాలో అత్యంత ధనవంతులలో వ స్థానంలో ఉంటాడు. అయితే అతడి సన్నిహితులే అతడిపై కుట్ర పన్నే సన్నివేశాలు ఎంగేజింగ్ గా ఉంటాయి. ఫస్ట్ 20 నిమిషాలు కథ అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది. పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ చిత్రానికి కావలసిన సస్పెన్స్, ఇంటరెస్టింగ్ స్టోరీతో ఫస్ట్ హాఫ్ ముందుకు వెళుతుంది. 

47

అయితే తొలి 20 నిమిషాల తర్వాత విజయ్ ఆంటోని ఎక్కువగా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. ఆ సీన్స్ కి కాస్త రిసీవ్ చేసుకోగలిగితే ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. కథలో బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ సీన్స్ ఉత్కంఠగా ఉంటాయి. మంచి సస్పెన్స్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ముగుస్తుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే కథలో ఇన్వాల్వ్ అయిపోయే విధంగా అద్భుతంగా ఉందనే చెప్పాలి. 

57

ఇక సెకండ్ హాఫ్ లో కథ కాస్త ట్రాక్ తప్పింది. విజయ్ ఆంటోని ఎలివేషన్ సీన్స్ కి ప్రాధాన్యత ఇచ్చారు. అయితే అవి అతిగా అనిపిస్తాయి. ఆస్తులు అమ్మేసి పేదలకు సహాయ పడాలనుకోవడం చాలా సినిమాల్లో చూసేశాం. 

67

ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఎక్కడా రాజీ పడని విధంగా ఉంటాయి. అయితే విఎఫెక్స్ విషయంలో మాత్రం కాస్త నిరాశ తప్పదు. బిచ్చగాడు మొదటి భాగంలో తల్లి సెంటిమెంట్ కనిపిస్తుంది. రెండవ భాగంలో చెల్లి సెంటిమెంట్ తో అలరించారు. అలాగే బ్రెయిన్ పై జరిపే పరిశోధనలు ఈ చిత్రానికి ఆయువు పట్టులా ఉంటాయి. సైన్సు, సెంటిమెంట్ ని మిళితం చేసి ఆడియన్స్ ని విజయ్ ఆంటోని ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశారు. 

77

ఓవరాల్ గా బిచ్చగాడు 2 మూవీ డీసెంట్ గా ఉందంటూ యుఎస్ ప్రీమియర్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఒకసారి చూడదగ్గ చిత్రంగా చెబుతున్నారు. అయితే బిచ్చగాడు మొదటి భాగాన్ని మించేలా మ్యాజిక్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. 

click me!

Recommended Stories