విజయ్ ఆంటోనీ వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ విజయాలు అందుకుంటున్నారు. విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ భద్రకాళి. ఈ చిత్రానికి సంబంధించిన 4 నిమిషాల స్నీక్ పీక్ రిలీజ్ చేశారు.
విజయ్ ఆంటోని తెలుగు తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బిచ్చగాడు, నకిలీ, మార్గన్ లాంటి చిత్రాలతో విజయ్ ఆంటోనీ విజయాలు అందుకున్నారు. విజయ్ ఆంటోని మల్టీ ట్యాలెంటెడ్ హీరో. నటుడిగా, గాయకుడైగా, ఎడిటర్ గా, నిర్మాతగా రాణిస్తున్నారు. చివరగా విజయ్ ఆంటోని నటించిన మార్గన్ చిత్రం వైవిధ్యమైన థ్రిల్లర్ కథాంశంతో వచ్చి విజయం సాధించింది.
25
విజయ్ ఆంటోనీ లేటెస్ట్ మూవీ భద్రకాళి
విజయ్ ఆంటోనీ వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ విజయాలు అందుకుంటున్నారు. విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ భద్రకాళి. తన సొంత నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 19న ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అవుతోంది. ప్రమోషన్స్ లో కూడా విజయ్ ఆంటోనీ ప్రత్యేకమైన శైలి ఫాలో అవుతున్నాడు.
35
4 నిమిషాల స్నీక్ పీక్ రిలీజ్
తాను నటించిన పలు చిత్రాల తొలి 4 నిమిషాల వీడియో ముందే రిలీజ్ చేసేస్తున్నాడు. భద్రకాళి చిత్రానికి సంబంధించిన 4 నిమిషాల స్నీక్ పీక్ రిలీజ్ చేశారు. 1989 నేపథ్యంలో కథ మొదలవుతుంది. ఒక ట్రైబల్ మహిళ హత్యకి గురవుతుంది. దానిని సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ని పోలీసులు ప్రారంభిస్తారు. ఈ క్రమంలో వారిపై బడా పారిశ్రామిక వేత్త ప్రభావం పడుతుంది.
పారిశ్రామిక వేత్త ప్రలోభాల కారణంగా కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో ఆ మహిళ బిడ్డని ఒక చెత్త కుప్పలో పడేస్తారు. ఆ తర్వాత హీరో ఎంట్రీ ఉంటుంది. ఆ పసిబిడ్డే హీరో అయ్యాడా ? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏమైంది అనే విషయాలు సినిమా చూసే తెలుసుకోవాలి.
55
విజయ్ ఆంటోనీ మరో హిట్టు కొట్టేసినట్లే ?
అరుణ్ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. చూస్తుంటే ఈ చిత్రం పొలిటికల్, కార్పొరేట్ వ్యవస్థపై సంధించిన అస్త్రంలా అనిపిస్తోంది. ఈ మూవీతో విజయ్ ఆంటోని ఎలాంటి మ్యాజిక్ చేశారో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. స్నీక్ పీక్ చూస్తున్న ఫ్యాన్స్ విజయ్ ఆంటోనీ మరో హిట్టు కొట్టేసినట్లే అని కామెంట్స్ చేస్తున్నారు.