నాకు బిగ్ బాస్ ట్రోఫీ అవసరం లేదు, ఆ పని చేస్తే చాలు అని స్టార్ హీరోని బ్రతిమాలిన కౌశల్.. కానీ

Published : Sep 18, 2025, 08:11 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ నేచురల్ స్టార్ నానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకి బిగ్ బోస్ ట్రోఫీ అవసరం లేదని ఓ సాయం కావాలని బ్రతిమాలుకున్నట్లు కౌశల్ తెలిపారు. 

PREV
15
బిగ్ బాస్ తెలుగు 2 విజేత కౌశల్ మందా

తెలుగులో బిగ్ బాస్ షోకి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం తొమ్మిదవ సీజన్ జరుగుతోంది. గత ఎనిమిది సీజన్లలో బాగా వివాదం అయిన సీజన్లలో బిగ్ బాస్ తెలుగు 2 ఒకటి. ఈ సీజన్లో కౌశల్ మందా విజేతగా నిలిచారు. సింగర్ గీతా మాధురి రన్నరప్ గా నిలిచారు. నెటిజన్లు కౌశల్ ఆర్మీ లాగా మారి అతడికి మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఇతర కంటెస్టెంట్స్ పై విపరీతంగా ట్రోలింగ్ చేయడం వివాదం గా మారింది. చివరికి బిగ్ బాస్ తెలుగు 2 హోస్ట్ నానిపై కూడా ట్రోలింగ్ జరిపారు. 

25
బిగ్ బాస్ 2 తర్వాత జాతకం మారిపోతుందనుకున్నా 

అయితే కౌశల్ ఆర్మీ పేరుతో జరిగిన ట్రోలింగ్ కి తనకి ఎలాంటి సంబంధం లేదని కౌశల్ ఆ తర్వాత పేర్కొన్నారు. బిగ్ బాస్ 2 విజేతగా నిలవడంతో ఇకపై కౌశల్ మందాకి టాలీవుడ్ లో నటుడిగా అవకాశాలు వెల్లువెత్తుతాయని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఎప్పుడో ఒక అవకాశం తప్ప.. అతడికి గుర్తింపు లభించే పాత్రలు దక్కలేదు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో కౌశల్ మందా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ గెలిచిన తర్వాత నాని గారిని అడిగాను. 

35
నానిని బ్రతిమాలిన కౌశల్ 

నాని గారు నాకు మీకు బిగ్ బాస్ ట్రోఫీ ఇచ్చారు. దీని వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. దాని బదులు మీ సినిమాల్లో అవకాశం ఇస్తే అదే నాకు పెద్ద సక్సెస్ అవుతుంది అని రిక్వస్ట్ చేశా. నాని గారు రియాక్ట్ అవుతూ.. లేదు కౌశల్ నువ్వు బయటకి వెళ్లి చూడు.. నీకు అవకాశం ఇవ్వడానికి చాలా మంది ఎదురుచూస్తున్నారు అని చెప్పారు. నేను కూడా అలాగే అనుకున్నా. బిగ్ బాస్ విన్నర్ ని కదా.. బయటకి వెళ్ళాక నా లైఫ్ మారిపోతుంది. సినిమాల్లో అవకాశాలు వస్తాయి. ఇక నా కష్టాలన్నీ తీరిపోయినట్లే అని అనుకున్నా. 

45
డైరెక్టర్లని పర్సనల్ గా రిక్వస్ట్ చేశా 

బిగ్ బాస్ తర్వాత ఇండస్ట్రీ ప్రముఖులు, ఇతర సెలెబ్రిటీలతో తరచుగా మాట్లాడుతూ ఉండేవాడిని. నన్ను గెలిపించిన ఫ్యాన్స్ తో కూడా ఇంటరాక్ట్ అయ్యేవాడిని. కానీ ఇండస్ట్రీ నుంచి నాకు పెద్దగా ఆఫర్స్ రాలేదు. బయటకి వచ్చాక పూరి జగన్నాధ్, సుకుమార్, అనిల్ రావిపూడి లాంటి దర్శకులని వ్యక్తిగతంగా కలిశాను. వారి సినిమాల్లో ఆఫర్స్ ఇవ్వమని రిక్వస్ట్ చేశాను. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇస్తామని చెప్పారు. కొందరైతే నువ్వంటే మాకు చాలా ఇష్టం కౌశల్. నీకు ఇస్తే అలాంటి ఇలాంటి క్యారెక్టర్ ఇవ్వకూడదు.. అద్భుతమైన పాత్ర ఇవ్వాలి. 

55
ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదు

అలాంటి క్యారెక్టర్ ఉన్నప్పుడు తప్పకుండా చెబుతాం అని అన్నారు. కానీ ఎందుకనో నాకు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదు. బిగ్ బాస్ తో వచ్చిన ఫేమ్ వల్ల మంచి క్యారెక్టర్ పడి ఉంటే ఇండస్ట్రీలో సెట్ అయిపోయేవాడిని అని కౌశల్ అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories