తెలుగు సినిమాకు ఆస్కార్ తెచ్చిన రైటర్ గా చంద్రబోస్ సరికొత్త రికార్డు ను సాధించారు. అయితే ఆయన అంతకు ముందే అంతకంటే గొప్ప ఘనతను సాధించారు. ఆయన రాసిన ఓ పాట వల్ల ఓ కంపెనీకి 150 కోట్ల బిజినెస్ జరిగింది. ఇంతకీ ఏంటా పాట?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, గాయకులతో పాటు లిరిక్ రైటర్స్ కూడా తమకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాధించుకున్నారు. కొన్ని సినమాలు హీరోలు, యాక్షన్ సీన్స్ వల్ల హిట్ అయితే, మరికొన్ని సినిమాలు పాటలు, మ్యూజిక్ వల్ల హిట్ అవుతుంటాయి. కాని తెరవెనుక ఉన్నరైటర్స్ మాత్రం సినిమా సక్సెస్ లో పెద్దగా క్రెడిట్ పొందలేరు. తెలుగు పరిశ్రమకు ఒక పాట వల్ల మొదటి ఆస్కార్ లభించిన సంగతి తెలిసిందే. అలాంటి అద్భుతమైన పాటను అందించిన లిరిక్ రైటర్ చంద్రబోస్.
25
కెరీర్ బిగినింగ్ లో ఎన్నో అవమానాలు
కింద స్థాయి నుంచి ఆస్కార్ రేంకు ఎదిగిన చంద్రబోస్.. తన జీవితంలో పడిన కష్టాలు, ఎదురుకొన్న అవమానాలు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అంతే కాదు తను రాసిన ఓ పాట వల్ల ఓ కంపెనీకి 150 కోట్లు లాభం ఎలా వచ్చిందో వివరించారు చంద్రబోస్. కెరీర్ బిగినింగ్ లో తాను రాసిన పాటలతో స్టూడియోల చుట్టు తిరిగానని చంద్రబోస్ చెప్పుకొచ్చారు. ఓ కవర్ లో పాటల పేపర్లు పట్టుకుని వెళ్తే... వద్దు అవసరం లేదు అని ఎంతో అవమానించేవారు అని చంద్రబోస్ వివరించారు. ఆతరువాత ఆయన రేంజ్ ఎక్కడికి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
35
150 కోట్ల బిజినెస్ చేసిన చంద్రబోస్ పాట
ఇక సినిమా ఇండస్ట్రీ లో ప్రోడ్యూసర్లు, డిస్ట్రీబ్యూటర్స్ అనే కాకుండా సినిమా ఇండస్ట్రీ ద్వారా మరికొంతమంది కూడా కొన్ని బిజినెస్ లను చేస్తూ ఉంటారు. అలా లిరిక్ రైటర్ చంద్రబోస్ వల్ల ఓ కంపెనీకి 150 కోట్ల బిజినెస్ పెరిగిందని మీకు తెలుసా? ఇంతకీ చంద్రబోస్ పాడిన ఆ పాట ఏంటి? ఎలా అంత బిజినెస్ ఆ పాట ఎలా చేయగలిగిందో తెలిస్తే షాక్ అవుతారు.చంద్రబోస్ లాంటి లిరిక్ రైటర్ ఎన్నో అద్భుతమైన సాంగ్స్ రాశాడు. అయితే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఒక ప్రోగ్రాంకి చంద్రబోస్ గారిని ఇన్వైట్ చేసినప్పుడు ఆయన ఆ ప్రోగ్రాం లో మాట్లాడుతూ ‘ బడ్జెట్ పద్మనాభం’ సినిమాలో ఆయన రాసిన ‘ఎవరేమి అనుకున్న నువ్వు వెళ్లే రాజ్యానా రాజు నువ్వే బంటు నువ్వే’ అంటూ వచ్చే పాట పాడాడు. ఈ పాట ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి 150 కోట్లు లాభం తీసుకువచ్చిందని వెల్లడించారు.
ఈ సాంగ్‌ను చంద్రబోస్ ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్‌లో పాడారు. ఆ ప్రోగ్రాంకి ఆహ్వానించిన ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన అధికారులు ఈ పాట వినిపించిన తర్వాత, ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.దీంతో ఆ కంపెనీకి గతంలోకన్నా ఎక్కువగా కస్టమర్లు వచ్చారు. వార్షిక ఆదాయాన్ని మించి, అదనంగా 150 కోట్ల లాభం వచ్చిందని, ఇది అంతా చంద్రబోస్ పాట వల్లే సాధ్యమైందని సంస్థే అధికారికంగా ఆయనకు తెలియజేసిందని ఆయన వెల్లడించారు.
55
రెండు వేలకు పైగా పాటలు
చంద్రబోస్ ప్రస్తుతం పుష్ప 2లో రాసిన పాటలతో మళ్లీ యువతను, మాస్ ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆయన రాసిన సాంగ్స్ వినిపించడమే కాకుండా, మరికొన్ని పెద్ద చిత్రాల కోసం కూడా పాటలు సిద్ధం చేస్తున్నారు.ఇప్పటివరకు 2000కు పైగా పాటలు రాసిన చంద్రబోస్, సినిమా సినిమాకు తన ప్రత్యేకతను చూపిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను బిల్డ్ చేసుకున్నారు. తను రాసిన పాట కేవలం వినోదం మాత్రమే కాకుండా, వ్యాపార అభివృద్ధికి దోహదపడినందకు ఎంతో గర్వపడ్డానంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారాయన.