చేతిలో చిల్లి గవ్వలేని టైమ్ లో.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ పెళ్లి చేసిన యాంకర్, నటి ఎవరో తెలుసా..?

Published : Jun 24, 2022, 07:53 AM ISTUpdated : Jun 24, 2022, 07:54 AM IST

ఎప్పుడో జరగిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పెళ్లి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ర్యాంపులు, వ్యాంపులు అంటూ బండ్ల చేసిన కామెంట్స్ తో పాటు.. పూరీ చేతిలో చిల్లి గవ్వ లేని టైమ్ లో పెళ్లి చేసుకున్నాడన్న న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈ స్టార్ డైరెక్టర్ పెళ్లి తమ ఖర్చులతోచేశారట ఓ యాంకర్, ఓ నటి. ఇంతకీ వాళ్ళు ఎవరు...?  

PREV
18
చేతిలో చిల్లి గవ్వలేని టైమ్ లో.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ పెళ్లి చేసిన  యాంకర్, నటి ఎవరో తెలుసా..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న వార్త పూరి జగన్నాథ్ పెళ్ళి. ఎప్పుడో జరిగిన పూరీ పెళ్ళి.. ఇప్పుడు వార్తల్లో నిలిచేలా చేశాడు యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్. ఆకాశ్ పూరి చోర్ బజార్ మూవీ ఈవెంట్ లో పూరీ  పెళ్ళి గురించి, ఆయన భార్య గురించి గొప్పగా చెప్పాడు బండ్ల. 
 

28

స్టార్ డైరెక్టర్ అని పూరిని ఆయన భార్య పెళ్లి చేసుకోలేదు. చేతిలో చిల్లి గవ్వ లేని టైమ్ లో.. ఆయన వెంట వచ్చింది. గుళ్లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత పూరీ స్టా్ర డైరెక్టర్ అయ్యారు. అది ఆయన భార్య గొప్పతనం అంటూ బడ్ల స్పీచ్ ఇరగదీశాడు. అంతే కాదు ఇండస్ట్రీ అంతా ఉలిక్కి పడేలా.. ర్యాంపులు, వ్యాంపులు వస్తుంటాయి.. పోతుంటాయి.. అంటూ ఇన్ డైరెక్ట్ గా పూరీకి హితవు పలికే ప్రయత్నం చేశాడు బండ్ల. 
 

38

దాంతో ఇప్పుడు ఇండస్ట్రీ అంతా... ర్యాంపు.. వ్యాంపు తో పాటు.. పూరీ జగన్ పెళ్లి గురించి కూడా  చర్చించుకుంటున్నారు. అప్పట్లో పూరీ జగన్నాథ్.. సామాన్యుడిగా ఉండి.. డైరెక్టర్ గా ప్రయత్నాలు చేస్తున్న టైమ్ లో.. ఆయన పెళ్లి జరిగింది. తాను ప్రేమించిన లావణ్య ను గుళ్లో పెళ్ళి చేసుకున్నారు పూరీ. 
 

48

రవితేజ, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు ఇలా చాలా మంది హీరోలకి సూపర్ హిట్స్ ని ఇస్తూ... వచ్చారు పూరీ. ఈ దర్శకుడు డైరెక్షన్ లో ఏ హీరోకైనా  స్పెషల్ ఇమేజ్ వస్తుంది. తర్వాత నిజంగా పెద్ద స్టార్లు కూడా అయిపోతుంటారు. చాలా మంది స్టార్ హీరోలకి అద్భుతమైన హిట్స్ ని ఇచ్చి వాళ్ళ ఇమేజ్ ని పూరి జగన్నాధ్ రెట్టింపు చేసారు. 
 

58

అయితే ఒ సారి ఇంటర్వ్యూలో కొన్ని పర్సనల్ విషయాలతో పాటు.. తన  పెళ్లి గురించి మాట్లాడుతూ పూరి జగన్నాథ్ ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. పూరి జగన్నాథ్ తన భార్య లావణ్య ని వివాహం చేసుకునే సమయంలో అతని దగ్గర చిల్లి గవ్వ కూడా  లేవు.   అప్పుడే పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం చూస్తున్నారట. 

68

అయితే పూరీ జగన్నాథ్ లావణ్యని ప్రేమించారు. వీళ్లది ప్రేమ వివాహం అవడంతో ఎవరికీ చెప్పకుండా రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకున్నారు.మూడు ముళ్ళు వేయడానికి తాళిబొట్టు కావాలి... అది కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి పూరి జగన్నాథ్ ది. అప్పుడు యాంకర్ ఝాన్సీ తాళిబొట్టు కొని ఇచ్చారట. పెళ్లి బట్టలు  ప్రముఖ నటి హేమ కొనిపెట్టారు. అదే విధంగా కొంత మంది ఫ్రెండ్స్ కూల్ డ్రింక్స్ వంటివి కొని సహాయం చేశారట.

78

ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చిన తర్వాత నెమ్మది నెమ్మదిగా సంపాదించడం మొదలు పెట్టారు పూరి జగన్నాథ్. అయితే సంపాదించినా సరే కొంత మంది స్నేహితులని గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోవాల్సి వచ్చింది. దీంతో చాలా సంపాదన పోగొట్టుకున్నారు. 

88

అయితే ఆయన పెళ్లికి సహాయం చేసిన ఝాన్సీ, హేమ మరియు మిగిలిన స్నేహితులని ఎప్పటికీ మర్చిపోలేను అని చాలా సందర్భాల్లో  పూరి జగన్నాథ్  చెప్పారు. ప్రస్తుతం సెకండ్ ఇండిగ్స్ లో జోష్ పెంచిన పూరీ. విజయ్ దేవరకొండతో లైగర్ మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమా అగస్ట్ లో రాబోతుంది. తరువాత కూడా విజయ్ తోనే జనగనమణ చేయబోతున్నాడు స్టార్ డైరెక్టర్. 
 

click me!

Recommended Stories