అత్తగారికి విఘ్నేష్ శివన్ విషెష్, తల్లితో నయనతార బ్యూటీఫుల్ మూమెంట్ ను పంచుకున్న దర్శకుడు

Published : Sep 15, 2023, 11:16 AM IST

నయనతారకు సర్ ప్రైజ్ ఇచ్చాడు ఆమె భర్త.. కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్. నిన్న(సెప్టెంబర్ 14) నయన్ తల్లి, విఘ్నేష్ శివన్ అత్తగారి పుట్టిన రోజు సందర్భంగా ఆయన స్పెషల్ పోస్ట్ పెట్టాడు.   

PREV
17
అత్తగారికి విఘ్నేష్ శివన్ విషెష్, తల్లితో నయనతార బ్యూటీఫుల్ మూమెంట్ ను పంచుకున్న దర్శకుడు
Vignesh Shivan and Nayanthara

కోలీవుడ్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ కపుల్స్ లో చాలా స్పెషల్ అనిపించుకున్నారు విఘ్నేష్ శివన్ మరియు నయనతార. వీరిద్దరు  తరచుగా తమ రొమాంటిక్ పిక్స్ తో పాటు.. తమకు సబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు  సోషల్ మీడియాలో పంచుకుంటారు తమిళ స్టార్లు. ఇక ఈ ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు  ట్రెండ్ అవుతుంటాయి. 

27

అంతే కాదు విష్నేష్ కాని.. నయన్ కాని.. తమ బ్యూటిఫుల్ మూమెంట్స్ ను తమ ఫ్యాన్స్ తో పంచుకోవడానికి ఏమాత్రం ఆలస్యం చేయరు.. ఇక తన కుటుంబంలో పుట్టిన రోజులు కాని.. ఇతర సంతోషకరమైన విషయాలు శేర్ చేసుకోవడం కోసం ఎప్పుడు రెడీగా ఉంటాడు. తాజాగా అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను శేర్ చేసుకున్నాడు తమిళదర్శకుడు.  

37
Nayanthara

ఇక తాజాగా సెప్టెంబర్ 14 న విఘ్నేష్.. తన అత్తగారు.. నయనతార తల్లిగారి పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఫోటోలను శేర్ చేసుకున్నాడు. అత్తగారితో తనకు ఉన్న అనుబంధంతో పాటు.. నయనతారతో తన తల్లి బ్యూటిఫుల్ మూమెంట్స్ ను శేర్ చేసుకున్నాడు విఘ్నేష్. 

47
Nayanthara Mother

నయనతార తన తల్లితో ఉన్న బంధం ఈ  ఫోటోలలో అద్భుతంగా కనిపిస్తోంది. బ్యూటీపుల్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విఘ్నేష్ తన అత్తగారి పుట్టినరోజును జరుపుకోవడానికి స్వయంగా వారి ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇక అక్కడ కొన్ని అందమైన ఫోటోలను తన  ఇన్‌స్టాగ్రామ్‌లో శేర్ చేశాడు విఘ్నేష్. 

57
Nayanthara Mother Kurian

నయనతార తన తల్లితో కలిసి ఉన్న ఫోటోలను పంచుకున్న విఘ్నేష్.. పోస్ట్ లో ఇలా రాశాడు.. ఓమ్నాకురియన్! నా అత్త.. అమ్మా! నీకు జన్మదిన శుభాకాంక్షలు.. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను.. నువ్వే మా అతిపెద్ద బలం. మీ ప్రార్థనలు మరియు మీ ఆశీర్వాదాలు మా జీవితాన్ని చాలా అందంగా చేస్తాయి! మీరు కలకాలం జీవించండి. నా నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నారు. 
 

67
Nayanthara Vignesh Shivan

2015లో  నానుమ్ రౌడీ ధాన్ షూటింగ్ సమయంలో విఘ్నేష్ శివన్ మరియు నయనతార మొదటి సారి కలుసుకున్నారు. ఈ సినిమా  షూటింగ్ టైమ్ లో వీరి బధం స్నేహంగా... ఆతరువాత ప్రేమగా మారింది. షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ వీరు దాదాపు ఐదేళ్లు  ప్రేమించుకుని తమ బంధాన్ని బలపరుచుకున్నారు. 
 

77

ఇక వీరిద్దరు చాలా కలం సహజీవనం చేశారు. కలిసి ఫారెన్ టూర్లు తిగిగారు.. ఒకరికి మరొకరు అర్ధం చేసుకున్న తరువాత  జూలై 2022లో మహాబలిపురంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ జంట అక్టోబర్ 2022లో సరోగసీ ద్వారా కవల పిల్లలను స్వాగతించారు. వారు తమ కుమారులకు ఉయిర్ రుద్రోనీల్ ఎన్ శివన్ మరియు ఉలాగ్ దైవిక్ ఎన్ శివన్ అని పేర్లు పెట్టారు.
 

click me!

Recommended Stories