Pattudala Collections: 100 కోట్ల క్లబ్‌లోకి `పట్టుదల`, అజిత్‌ సినిమాకి బాక్సాఫీసు స్ట్రగుల్‌

Published : Feb 10, 2025, 04:19 PM IST

Pattudala Collections: అజిత్ నటించిన 'విడాముయార్చి' సినిమా మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, కేవలం నాలుగు రోజుల్లోనే కొత్త వసూళ్ల రికార్డు సృష్టించింది.

PREV
16
Pattudala Collections:  100 కోట్ల క్లబ్‌లోకి `పట్టుదల`, అజిత్‌ సినిమాకి  బాక్సాఫీసు స్ట్రగుల్‌
ajith kumar

Pattudala Collections: నయనతార భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ అజిత్ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశాన్ని కోల్పోయారు. ఆ స్థానంలో `విడాముయర్చి` (పట్టుదల) సినిమాని చేశారు అజిల్‌. 

26
ajith kumar

అజిత్ సినిమాల్లో మాస్ సన్నివేశాలతో పాటు ఒక మంచి సందేశం ఉండాలని కోరుకుంటారు. ఆయన లేటెస్ట్ గా నటించిన `విడాముయర్చి` చిత్రంలోనూ అలాంటి ఎలిమెంట్లని జోడించారు. ఆర్గాన్స్ అక్రమ రవాణా చూపించారు.

36
డిసెంబర్‌లో షూటింగ్ పూర్తి

అజిత్‌కి జోడీగా త్రిష నటించిన `పట్టుదల` సినిమా గతేడాది డిసెంబర్‌లోనే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్‌, సరైన డేట్‌ కోసం వాయిదా వేశారు.  

46
విడుదల తేదీ మార్పు

సంక్రాంతికే రావాల్సి ఉండగా, కానీ బిజినెస్‌ కారణాలతో వాయిదా పడినట్టు సమాచారం. మొత్తం 'విడాముయార్చి' ఈ నెల 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 

56
విడాముయార్చి వసూళ్లు

'విడాముయార్చి' వసూళ్ల వివరాలు చూస్తే గురువారం విడుదలైన ఈ చిత్రానికి ప్రారంభం నుంచే నెగటివ్‌ టాక్‌ వచ్చింది. సినిమాలో లవ్‌ ట్రాక్‌ బాగున్నా, ఆ తర్వాత సన్నివేశాలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. మన ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా లేవు. దీనికితోడు స్లోగానూ రన్‌ కావడం మరింత మైనస్‌గా నిలిచింది. 

66
4 రోజుల్లో 100 కోట్లు

దీంతో సినిమా బాక్సాఫీసు వద్ద డీలా పడిపోయింది. డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. అయినా కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది. నెగటివ్‌ టాక్‌తోనూ వంద కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. అయితే సోమవారం నుంచి కలెక్షన్లు దారుణంగా పడిపోయినట్టు సమాచారం. 

read more: Anasuya Ari Movie: అనసూయ సినిమాని ముందే చూసే ఛాన్స్.. అయితే ఈ పని చేయండి

also read: Ramya Krishnan: రమ్యకృష్ణ నెల సంపాదన ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌, స్టార్‌ హీరోలు కూడా జుజూబీనే

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!