దాడి జరిగిన వెంటనే తన వీపులో విపరీతమైన నొప్పి కలిగిందన్న సైఫ్.. అప్పుడు గమనిస్తే కత్తితో దాడి చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇదంతా చూసిన కరీనా ఒక్కసారిగా కంగారు పడి అందరికీ ఫోన్‌లు చేస్తుందని, అయితే ఒక్కరూ కూడా ఫోన్ తీయలేదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఒకరినొకరు చూసుకుని తాను బాగానే ఉన్నానని, ఏం కాదని కరీనానాకు ధైర్యం చెప్పారంటా. అయితే అదే సమయంలో ఆయన కుమారుడు తైమూరు సైఫ్ వద్దకు వచ్చి ‘నాన్నా.. నువ్వు చనిపోతావా?’ అని అడిగాడంటా.. దీనికి బదులిస్తూ అలా ఏం జరగదని సైఫ్ చెప్పుకొచ్చారు.