కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, బాలయ్య ఇలా స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఆమె నటించిన చిత్రాల్లో సగానికిపైగా హిట్లు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి రికార్డ్ మరో హీరోయిన్ కి లేదు.