వెంకటేష్ తో పెట్టుకుని చావు దెబ్బ తిన్న మహేష్ బాబు సినిమా.. నమ్రతకి అస్సలు ఇష్టం లేని మూవీ కూడా అదే

Published : Nov 19, 2025, 04:18 PM IST

విక్టరీ వెంకటేష్ సినిమాతో పోటీపడడంతో మహేష్ బాబు సినిమా ఒకటి బాక్సాఫీస్ వద్ద చావుదెబ్బ తినింది. మహేష్ భార్య నమ్రతకి కూడా ఆ చిత్రం అంటే అసలు ఇష్టం లేదట. 

PREV
15
ఆ చిత్రంతోనే మాస్ హీరోగా మారిన మహేష్ 

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రంతో వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇటీవల విడుదలైన వారణాసి టైటిల్, టీజర్ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా రాజకుమారుడు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్కడు సినిమా పడేవరకు మహేష్ కి మాస్ హీరోగా గుర్తింపు రాలేదు. ఈ మధ్యలో వంశీ, టక్కరి దొంగ లాంటి ఫ్లాపులు ఎదురయ్యాయి. 

25
నమ్రతకి నచ్చని మహేష్ మూవీ 

మహేష్ బాబు, నమ్రత ల మధ్య ప్రేమ చిగురించడానికి కారణమైనది వంశీ చిత్రమే. కానీ ఆ సినిమా తనకి ఏ మాత్రం ఇష్టం లేదని నమ్రత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వంశీ కథలోనే లోపం ఉందని డైరెక్టర్ బి గోపాల్ కూడా తెలిపారు. అలాంటి సినిమా రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలతో పోటీ పడడం కూడా కొంప ముంచింది. అందులో ఒకటి విక్టరీ వెంకటేష్ జయం మనదేరా. 

35
చావుదెబ్బ తిన్న వంశీ మూవీ 

వంశీ సినిమా రిలీజైన రెండు మూడురోజుల గ్యాప్ లోనే వెంకటేష్ జయం మనదేరా రిలీజ్ అయింది. ఈ మూవీలో వెంకీ డ్యూల్ రోల్ లో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఫలితంగా ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. అప్పటికే నెగిటివ్ టాక్ తో ఇబ్బంది పడుతున్న వంశీ చిత్రం.. జయం మనదేరా రిలీజ్ కావడంతో కోలుకోలేకపోయింది. జయం మనదేరా చిత్రం అప్పట్లోనే 12 కోట్ల షేర్ రాబట్టింది. 

45
కోలుకోలేని దెబ్బ కొట్టిన మరో చిత్రం 

మరి కొన్ని రోజుల వ్యవధిలో వంశీ చిత్రానికి పోటీగా తరుణ్ నువ్వే కావాలి చిత్రం రిలీజ్ అయింది. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో దూసుకుపోవడంతో వంశీ మూవీ పూర్తిగా కనిపించకుండా పోయింది. ఈ మూవీలో మహేష్ బాబు, నమ్రత జంటగా నటించగా.. కృష్ణ కీలక పాత్రలో నటించారు. 

55
మహేష్ కెరీర్ లో మరిచిపోదగ్గ చిత్రం 

 ఆ మూవీ షూటింగ్ పట్టించుకోకుండా మీ ప్రేమ ప్రపంచంలో మీరు ఉన్నారా అని యాంకర్ ప్రశ్నించగా.. నమ్రత నిజమే అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. ఏది ఏమైనా మహేష్ బాబు కెరీర్ లో అది మంచి చిత్రం కాదు అని నమ్రత తేల్చేశారు. 

Read more Photos on
click me!

Recommended Stories