బాలకృష్ణ, చిరంజీవి సినిమాల మధ్య పోటీ ఒకప్పుడు చాలా వాడీ వేడిగా ఉండేది. అది ఫ్యాన్ వార్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే బాలకృష్ణ సమరసింహారెడ్డి సినిమా వల్ల ప్లాప్ గా మిగిలిన చిరంజీవి సినిమా ఏదో తెలుసా?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ మధ్య ఎన్నో సార్లు బాక్సాఫీస్ వార్ జరిగింది. అందులో ఒక్కొసారి ఒక్కొక్కళ్లు గెలిచారు. ఫ్యాన్స్ మధ్య మాత్రం వార్ వాతావరణం ఉండేది. అయితే ఓ సందర్భంలో మాత్రం చిరంజీవి సినిమా రిలీజ్ అయిన 10 రోజులు తరువాత థియేటర్లలోకి వచ్చి.. మెగాస్టార్ సినిమానే చావుదెబ్బ కొట్టింది బాలకృష్ణ సమరసింహారెడ్డి మూవీ. ఇంతకీ ఆ సినిమా ఏది? ఎందుకు ప్లాప్ అయ్యింది. కారణం ఏంటో తెలుసా?
24
స్నేహం కోసం వర్సెస్ సమరసింహారెడ్డి
1999 టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు తలపడ్డాయి. జనవరి 1న మెగాస్టార్ నటించిన స్నేహం కోసం సినిమా రిలీజ్ అయ్యింది. ఈసినిమా డీసెంట్ కలెక్షన్స్ తో కొనసాగుతునన టైమ్ లో.. పది రోజులు తరువాత బాలకృష్ణ హీరోగా నటించిన ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ మాస్ సినిమా సమరసింహారెడ్డి రిలీజ్ అయ్యింది. ఈసినిమా జనవరి 13న ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఎప్పుడైతే సమరసింహం థియేట్లోకి అడుగుపెట్టిందో.. అప్పుడే స్నేహం కోసం కలెక్షన్లు చతికలపడ్డాయి. అసలే ఈసినిమా మెగా ఫ్యాన్స్ కు పెద్దగా నచ్చలేదు.. అటువంటి టైమ్ లో బాలయ్య సినిమా వచ్చే వరకూ.. బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
34
రికార్డులు బ్రేక్ చేసిన సమరసింహారెడ్డి సినిమా
మాస్ ఇమేజ్ ఉన్న బాలయ్య.. ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ తో టాలీవుడ్ బాక్సాఫీస్ ను ఊపేసిన సినిమా సమరసింహారెడ్డి. ఈసినిమా క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. 6 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈమూవీ.. 20 కోట్ల వరకూ డిస్ట్రిబ్యూటర్ షేర్‌ను సంపాదించి భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని ప్రాంతాలలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది. బీ గోపాల్ డైరెక్ట్ చేసిన ఈసినిమా నుంచే.. టాలీవుడ్లో ఫ్యాక్షన్ సినిమాలా ట్రెండ్ మొదలైంది .32 కేంద్రాల్లో 175 రోజులు పూర్తి చేసి.. బాలీవుడ్ లో ‘హమ్ ఆప్కే హై కౌన్’ పేరుతో ఉన్న ఇండియా రికార్డును సమరసింహం బ్రేక్ చేసింది. 4 ఆటలతో 73 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసిన ఫస్ట్ సౌత్ మూవీ కూడా ఇదే. ఇక ఒక థియేటర్‌లో ఏకంగా 365 రోజుల ఆడింది సమరసింహారెడ్డి సినిమా. అప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఈసినిమా కలెక్షన్లు.. ఇప్పటి డబ్బుతో పోలిస్తే.. దాదాపు 350 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్టు లెక్క.
ఇక స్నేహం కోసం సినిమా జనవరి 1న రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించింది. అయితే ఈసినిమాలో చిరంజీవి పనివాడి పాత్రలో నటించడం ఫ్యాన్స్ కు నచ్చలేదు. మెగాస్టార్ ఇందులో చేసిన రెండు పాత్రలు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్ మందు చేతులు కట్టుకుని, చెప్పులు మోయడం లాంటి సీన్లతో కనిపించడం, అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక చిరంజీవి కూడా ఈసినిమాను డౌట్ గానే చేశారట. చిరంజీవr చేతులు కట్టుకుంటే ఫ్యాన్స్ ఒప్పుకోరని ఆయన చెపితే.. డైరెక్టర్, రైటర్ బాగుంటుంది అని కన్విన్స్ చేశారట. దాంతో చిరంజీవి కూడా కొత్తగా ఉంటుంది అని.. ఇష్టంగానే ఈసినిమా చేశారు. కానీ మూవీ అనుకున్నంత హిట్ అవ్వలేదు. మెగా ఫ్యాన్స్ మాత్రం పెదవి విరిచినా.. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాను బాగా ఆదరించారు. ఈలోపు సమరసింహారెడ్డి సినిమా ప్రవాహంలో.. స్నేహం కోసం కనిపించబకుండా పోయింది. స్నేహం కోసం సినిమాపై తనకు డౌట్ ఉందని మెగాస్టార్ కూడా ఓ ఇంట్వ్యూలో వెల్లడించారు.