11వ వారం బిగ్ బాస్ తెలుగు లో తారుమారైన ఓటింగ్, డేంజర్ జోన్ లో ఉన్న టాప్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

Published : Nov 19, 2025, 03:34 PM IST

Bigg BossTelugu 9 Week 11 Voting : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. వారాలు గడిచే కొద్ది మరింత ఉత్కంఠగా తయారవుతోంది. నామినేషన్లు, ఎలిమినేషన్ల విషయంలో.. కంటెస్టెంట్స్ కు అసలైన అగ్నిపరీక్ష ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇక ఈ వారం  ఓటింగ్ షాకిస్తోంది?  

PREV
16
బిగ్ బాస్ లో వేగంగా మారుతున్న పరిస్థితులు..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. వారాలు గడిచేకొద్ది ఎలిమినేషన్‌ చాలా టైట్ గా మారుతోంది. ఉన్నవారిలో ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని ఎలిమినేట్ చేయాలి అనే విషయం.. కంటెస్టెంట్స్ కు పెద్ద అగ్నిపరీక్షగా మారిపోయింది. అంతే కాదు ఓటింగ్ ట్రెండ్‌ కూడా వేగంగా మారుతూ ఉండడంతో సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం నామినేషన్స్‌లో పవన్ కళ్యాణ్, భరణి, డిమోన్ కళ్యాణ్, ఇమ్మానుయేల్, సంజన, దివ్య నిఖిత ఉన్నారు. వీరిలో ఎవరు బయటకు వెళ్లే అవకాశముంది అనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఎవరికి ఓటు వేయాలో కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొంది అభిమానుల్లో.

26
ఓటింగ్ లో దూసుకుపోతున్నది ఎవరు?

ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఇప్పటి వరకూ ఉన్న ఓటింగ్ ప్రకారం చూస్తే.. పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నాడు. అతని ఎవ్వరూ చేరుకోలేనంతగా ఓటింగ్ సాధిస్తున్నాడు. గత కొంతకాలంగా అతను గేమ్‌లో చూపిస్తున్న స్ట్రాంగ్ ప్రెజెన్స్‌తో పాటు, తనతో మంచి రిలేషన్ ను మెయింటేన్ చేస్తోన్న టాప్ కంటెస్టెంట్స్ ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ కు ప్లస్ అవుతున్నాయి. అందులో తనూజ ఫ్యాన్స్ కూడా అతనికి భారీగా ఓట్లు వేస్తుండటం వల్ల అతను నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. మరో వైపు తనూజ ఈ వారం కెప్టెన్‌గా ఉండటం వల్ల నామినేషన్స్‌ నుంచి తప్పించుకుంది. అయితే ఇటీవల ఇద్దరి మధ్య పెరిగిన బాండింగ్ కారణంగా తనూజ అభిమానులు ఓట్లు అన్నీ కంప్లీట్ గా పవన్ కళ్యాణ్‌ కు పడుతున్నట్టు తెలుస్తోంది.

36
ఇమ్మానుయేల్‌కు ఊహించని ఓటింగ్

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది అంచనాలు వేయలేని విధంగా ఉంది. ఇప్పటి వరకూ నామినేషన్స్ లో పెద్దగా కనిపించని ఇమ్మానుయేల్.. ఈసారి నామినేట్ అయ్యాడు. 11వ వారం ఇమ్మాన్యూయల్ నామినేషన్స్‌లోకి వచ్చాడు. సాధారణంగా ఇన్ని వారాలు నామినేషన్స్‌కు దూరంగా ఉన్న కంటెస్టెంట్.. ఒక్కసారిగా నామినేట్ అయితే.. ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇమ్మానుయేల్ విషయంలో మాత్రం ఈ పరిస్తితి లేదు. ఎందుకంటే అతనికి భారీగా ఓట్లు పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ తరువాత ఇమ్మాన్యూయల్ ఓటింగ్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

46
డేంజర్ జోన్ లో సంజన..

అయితే మొదటి నుంచి బిగ్ బాస్ లో చాలా స్పెషల్ గా ఉన్న కంటెస్టెంట్ సంజన. ఆమెను హౌస్ అంతా వ్యతిరేకించినా..భారీగా ఓట్లు పడటంతో ప్రతీ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటూ వస్తోంది. అయితే సంజనాకు పడే ఓట్లలో కొంత వరకూ ఇమ్మానుయేల్‌ ఫ్యాన్స్ ఓటింగ్ కూడా ఉంది. అతను నామినేషన్స్ లో లేకపోవడంతో.. ఆ ఓట్లు సంజనాకు పడుతూ వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈసారి ఇమ్మానుయేల్‌ నేరుగా నామినేషన్స్‌లో ఉండడం వల్ల ఆ ఓట్లు తిరిగి అతనికే చేరాయి. దీంతో అతను రెండవ స్థానం సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. దాంతో ఇప్పటి వరకూ టాప్ కంటెస్టెంట్ గా ఉన్న సంజన.. ఈసారి డేంజర్ జోన్ లో పడ్డట్టు తెలుస్తోంది. ఓటింగ్ లో సంజన చివరి స్థానంలో ఉన్నట్టు సమాచారం.

56
భరణికి భారీ సపోర్ట్

రీసెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటుడు భరణి.. తన ఆటతీరు మార్చుకున్నాడు. సేఫ్ గేమ్ అన్న రిమార్క్ ను పోగోట్టుకుని.. ఆటలో దూసుకుపోతున్నాడు. భరణి గేమ్ ఇంప్రూవ్‌మెంట్, నామినేషన్స్‌లో స్పష్టంగా తన అభిప్రాయాలు చెప్పడం వల్ల.. అతనికి మంచి ఓటింగ్‌ను తీసుకొచ్చాయి. అదనంగా తనూజ అభిమానులు కూడా అతనికి ఓట్లు వేస్తుండటం వల్ల ఆయన ప్రస్తుతం మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. రీ ఎంట్రీ తర్వాత తనూజ–భరణి మధ్య బాండింగ్ అంతగా కనిపించకపోయినప్పటికీ, అభిమానులు మాత్రం ఈ ఇద్దరి స్నేహాన్ని ఇప్పటికీ నమ్ముతున్నారు.

66
11 వారం పడిపోయిన టాప్ కంటెస్టెంట్స్ వీళ్లే..

గత కొన్ని వారాలలో టాప్ కంటెస్టెంట్స్ గా ఉన్న డీమోన్ పవన్, దివ్య , సంజన.. ఈ వారం ఓటింగ్ లో పడిపోయారు. ఇప్పటి వరకూ ఉన్న ఓటింట్ ప్రకారం. డిమోన్ పవన్ గేమ్ నెగిటివ్‌గా భావించబడటంతో అతని ఓటింగ్ పడిపోయి నాల్గవ స్థానం‌లో ఉన్నాడు. చివరి రెండు స్థానాల్లో సంజన , దివ్య నిఖిత ఉన్నారు. ఇద్దరి మధ్య ఓటింగ్ తేడా చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ వారం ఎలిమినేషన్ ఈ ఇద్దరిలో ఎవరికైనా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. లాస్ట్ వీక్ లో దివ్య కొద్దిలో ఎలిమినేషన్ ను తప్పించుకుంది. ఈసారి కూడా బార్డర్ లో ఉంటే.. ఆమె కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. మరి ఓటింగ్ పూర్తిగా వచ్చిన తరువాత పరిస్థితులు మారిపోయే అవకాశం లేకపోలేదు. అప్పుడు లీస్ట్ లో ఎవరు ఉంటారో, 11వ వారం హౌస్ ను వీడేది ఎవరో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories