Venkatesh Movies: వెంకటేష్ చివరి 5 సినిమాల రిజల్ట్స్.. కొంప ముంచినవి ఈ రెండే

Published : Nov 14, 2026, 10:19 AM IST

Venkatesh Last 5 Movies: దృశ్యం 2 నుంచి ఆదర్శ కుటుంబం వరకు వెంకటేష్ నటించిన చివరి 5 సినిమాలు ఏంటి ? వాటి రిజల్ట్స్ ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
16
Venkatesh

విక్టరీ వెంకటేష్ మంచి ఫ్యామిలీ కథతో వస్తే బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల కలెక్షన్స్ సాధ్యం అని సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నిరూపించింది. వెంకటేష్ నటించిన చివరి 5 సినిమాలో ఏ జోనర్ లో తెరకెక్కాయి ? ఎలాంటి విజయం సాధిచాయి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

26
దృశ్యం 2

బ్లాక్ బస్టర్ మూవీ దృశ్యంకి సీక్వెల్ గా దృశ్యం 2 తెరకెక్కింది. కానీ దృశ్యం 2 థియేటర్స్ లో రిలీజ్ కాలేదు. అప్పటి కరోనా పరిస్థితిలు కారణంగా థియేటర్స్ పై ఆంక్షలు ఉండడంతో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఓటీటీలో రిలీజ్ చేసినప్పటికీ ఈ మూవీ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాలోని ట్విస్ట్ లు ఆడియన్స్ కి పిచ్చెక్కించాయి.

36
ఎఫ్ 3

ఇది కూడా సీక్వెల్ చిత్రమే. సూపర్ హిట్ అయిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్ గా రూపొందించారు. అయితే ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. కానీ కలెక్షన్స్ బాగానే వచ్చాయి. దీనితో ఈ మూవీ కమర్షియల్ హిట్ గా నిలిచింది.

46
సైంధవ్

ఇది వెంకటేష్ 75వ చిత్రంగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కింది. శైలేష్ కొలను దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలయింది. వెంకటేష్ కెరీర్ లో మైలురాయి సినిమా అవుతుంది అని భావించారు. కానీ రిలీజ్ అయ్యాక పరిస్థితి తలకిందులు అయింది. సైంధవ్ చిత్రం ఊహించని డిజాస్టర్ గా మారింది.

56
సంక్రాంతికి వస్తున్నాం

వెంకటేష్ మంచి ఫన్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో సినిమా చేస్తే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం గ్యారెంటీ అని నిరూపించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2025 సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్లు రాబట్టింది.

66
ఆదర్శ కుటుంబం

త్రివిక్రమ్ రచయితగా 20 ఏళ్ళ క్రితం నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి లాంటి చిత్రాల్లో వెంకీ నటించారు. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించలేదు. తొలిసారి మాటల మాంత్రికుడి దర్శకత్వంలో వెంకీ నటించిన మూవీ ఆదర్శ కుటుంబం. అక్టోబర్ 30న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దీనితో కమర్షియల్ గా ఈ మూవీ హిట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories