టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా ప్రమోషన్ల టైమ్ లో నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో.. షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన, సరదా సంఘటనను వీరిద్దరూ అభిమానులతో పంచుకున్నారు. సెట్స్‌లో మహేష్ బాబును చూసి తిట్టాల్సిన ఒక సన్నివేశంలో కీర్తి సురేష్ ఎంతగా ఇబ్బంది పడ్డారో, ఆ సీన్ ఎలా పూర్తయిందో తెలుసా?
మహేష్ బాబు చెప్పిన ఆసక్తికర విషయం
సినిమాలో ఒక కీలక సన్నివేశం గురించి మహేష్ బాబు వివరిస్తూ, ఆ సీన్లో కీర్తి సురేష్ తన ముఖం చూసి గట్టిగా తిట్టాల్సి ఉంటుందని అన్నారు. అయితే ఆ సన్నివేశం చిత్రీకరించే సమయంలో కీర్తి సురేష్ చాలా ఆలోచించారని ఆయన గుర్తు చేసుకున్నారు. "నువ్వు నన్ను తిట్టాలి, ఏం పర్లేదు చేసేయమ్మా" అని తాను ప్రోత్సహించినప్పటికీ ... కీర్తి మాత్రం "కాదు సార్, మీ మొహం చూసి నేను ఎలా తిట్టగలను? నేను మిమ్మల్ని తిట్టలేను సార్" అంటూ మొహమాటపడ్డారని మహేష్ బాబు నవ్వుతూ చెప్పారు. ఆ అనుభవం ఎలా ఉందో ఆమెనే అడగాలంటూ మైక్ కీర్తి సురేష్ వైపు తిప్పారు.