3 ఏళ్ళు సినిమాలకు దూరంగా మహేష్ బాబు, భరించలేని కష్టంలో కూడా భర్తకి అండగా నిలిచిన నమ్రత

First Published | Dec 22, 2024, 7:26 AM IST

ప్రతి నటుడి కెరీర్ లో ఒక డల్ ఫేజ్ ఉంటుంది. అలాంటి పరిస్థితి మహేష్ బాబుకి కూడా ఎదురైంది. ఎవరికైనా ఫ్లాపుల వల్ల ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కానీ మహేష్ బాబుకి పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చాలా సమస్యలు మొదలయ్యాయట.

ప్రతి నటుడి కెరీర్ లో ఒక డల్ ఫేజ్ ఉంటుంది. అలాంటి పరిస్థితి మహేష్ బాబుకి కూడా ఎదురైంది. ఎవరికైనా ఫ్లాపుల వల్ల ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కానీ మహేష్ బాబుకి పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చాలా సమస్యలు మొదలయ్యాయట. ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా చెప్పారు. పోకిరి తర్వాత మహేష్ బాబుకి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఎదురయ్యాయి. 

సైనికుడు, అతిథి చిత్రాలని మహేష్ గ్యాప్ లేకుండా చేశారు. పోకిరి 2006లో రిలీజ్ అయింది. అదే ఏడాది సైనికుడు వచ్చింది. మరుసటి ఏడాది అతిథి రిలీజ్ అయింది. ఆ టైంలోనే మహేష్ బాబు ఫ్యామిలిలో కూడా విషాదాలు చోటు చేసుకున్నాయి. నన్ను పెంచి పెద్ద చేసిన మా గ్రాండ్ మదర్ ఆ సమయంలో మరణించారు. అది నాకు ఎంతో ఎమోషనల్ ఫేజ్. ఆ వెంటనే నమ్రత తల్లిదండ్రులు కూడా మరణించారు. 


దీనితో ఒక్కసారిగా అంతా బ్లాంక్ అన్నట్లుగా అనిపించింది. ఆ టైంలోనే నా తనయుడు గౌతమ్ పుట్టాడు. ఈ విషాదాలు జరిగే టైంకి గౌతమ్ 6 నెలల బేబీ. దీనితో కొన్ని నెలలు ఎలాంటి షూటింగ్స్ లేకుండగా వాడితో గడపాలని 6 నెలలు బ్రేక్ తీసుకున్నా. 6 నెలలు కాస్తా 3 సంవత్సరాలు అయింది. సినిమాల విషయంలో కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నా. పోకిరి బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన సైనికుడు, అతిథి ఆడియన్స్ కి నచ్చలేదు. పోకిరి రేంజ్ ని మ్యాచ్ చేయాలంటే ఎలాంటి సినిమా చేయాలి అనే డైలమా నెలకొంది. 

ఆ టైంలో నానా భార్య నమ్రత నాకు అండగా నిలిచింది. ఆమె ఇచ్చిన స్ట్రెంత్ తోనే బలంగా నిలబడ్డాను. తన తల్లిదండ్రులు మరణించిన విషాదంలో ఉన్నప్పటికీ ఫ్యామిలీ కోసం, నా కోసం ఎంతో కష్టపడింది. ఆ టైంలోనే ఎక్కువ ఎండార్స్మెంట్స్ కి సైన్ చేశాను. యాడ్ షూట్స్ తో వచ్చిన డబ్బుతోనే కొత్త ఇల్లు కట్టుకున్నట్లు మహేష్ బాబు తెలిపారు. 

మూడేళ్ళ గ్యాప్ తర్వాత మహేష్ బాబు చేసిన ఖలేజా చిత్రం కూడా నిరాశపరిచింది. ఆ తర్వాత మహేష్ బాబు శ్రీనువైట్ల దర్శకత్వంలో దూకుడు చిత్రం చేశారు. దూకుడు మూవీ సూపర్ హిట్ అయింది. 

Latest Videos

click me!