ఫ్యాన్స్ ఉన్నారని ఆ మూవీస్ చేయను..భారీ బడ్జెట్ అయితే నెగిటివ్ రోల్స్ కి రెడీ, అప్పుడే హింట్ ఇచ్చిన బన్నీ

First Published | Dec 22, 2024, 9:07 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ ఇప్పుడు ఎంత పెద్ద వివాదం సాగుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం తో వ్యవహారం మరింతగా వేడెక్కింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ ఇప్పుడు ఎంత పెద్ద వివాదం సాగుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ పోలీసు కేసులు ఎదుర్కొంటున్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం తో వ్యవహారం మరింతగా వేడెక్కింది. పనిలో పనిగా రేవంత్ రెడ్డి చిత్ర పరిశ్రమని కూడా దుమ్మెత్తి పోశారు. 

దీనితో అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించి తనపై చేసిన ఆరోపణల్ని ఖండించారు. ఈ వివాదం నేపథ్యంలో అల్లు అర్జున్ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ వివాదానికి కేంద్ర బిందువు అయిన పుష్ప 2 చిత్రం గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. పుష్ప చిత్రాన్ని సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. ఒకరకంగా చెప్పాలంటే నెగిటివ్ పాత్రని హైలైట్ చేయడం అన్నమాట. 


హీరోలు నెగిటివ్ షేడ్స్ లో నటించడం, గ్రే తరహా పత్రాలు చేయడం కొత్తేమీ కాదు. బాలీవుడ్ లో ధూమ్ లాంటి చిత్రాలు ఇదే ఫార్ములాతో వర్కౌట్ అయ్యాయి. కేజీఎఫ్ కూడా పాన్ ఇండియా సక్సెస్ అయింది. పుష్ప 2 అయితే ఇండియా బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతోంది. గతంలో అల్లు అర్జున్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలకి చేశారు. పుష్పకి ముందు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో అనే చిత్రంలో నటించారు. ఈ చిత్ర సమయంలో బన్నీ నెగిటివ్ రోల్స్ గురించి హింట్ ఇచ్చారు. 

ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మీకు ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా.. సందేశాత్మక చిత్రాలు చేసే ఆలోచన ఉందా అని అడిగారు. బన్నీ సమాధానం ఇస్తూ ఫాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మెసేజ్ సినిమాలు చేయాలని ఎప్పుడూ అనుకోలేదు అని తెలిపారు. అలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు. అదే విధంగా అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ చిత్రాలు నాకు సూట్ కావు అని అల్లు అర్జున్ తెలిపారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మాత్రం నటిస్తాను.. కానీ అలాంటి సినిమాలు భారీ బడ్జెట్ లో ఉండాలి అని తెలిపారు. 

Allu Arjun

పుష్ప చిత్రం భారీ బడ్జెట్ లో తెరకెక్కిన మూవీనే. అంటే ఆ సమయంలోనే అల్లు అర్జున్ పుష్ప చిత్రం గురించి హింట్ ఇచ్చారు. అలా వైకుంఠపురంలో సక్సెస్ తర్వాత సుకుమార్ తో చర్చలు మొదలయ్యాయి. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో, స్మగ్లర్ గా అల్లు అర్జున్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అందుకే పుష్ప చిత్రానికి బన్నీ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. పుష్ప 2 మొదటి భాగాన్ని మించేలా సునామీ సృష్టిస్తున్నప్పటికీ అల్లు అర్జున్ వివాదాల్లో చిక్కుకోవడం సంచలనంగా మారింది. 

Latest Videos

click me!