కోడి కూర కోసం కొట్లాడుకున్న విక్టరీ వెంకటేష్ -‌సురేష్ బాబు, మధ్యలో రానా ఏం చేశాడంటే..?

First Published | Sep 8, 2024, 8:49 PM IST

సెలక్టీవ్ గా సినిమాలు చేస్తూ.. పద్దతిగా నెట్టుకొస్తున్నాడు విక్టరీ వెంకటేష్. ఇక ఆయన  పర్సనల్ విషయాలు చాలా తక్కువ మందికి తెలుసు. అయితే వెంకటేష్ తనకిష్టమైన కూర కోసం అన్నతొ కొట్లాడేవారని తెలుసా..? 
 

Venkatesh Daggubati

90స్ లో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిని స్టార్ హీరోలలో వెంకటేష్ ఒకరు.  చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునతో పాటు.. వెంకటేష్ కూడా కలిసి నాలుగు స్థంబాల్లా ఇండస్ట్రీని కాపాడుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడిప్పుడు 60 ఏళ్ళు దాటిన తరువాత కాస్త సినిమాలు తగ్గించి అడపా దడపా సినిమాలు చేస్తున్నారు వెంకీ. 

ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడితో ఓ మూవీ చేస్తున్నారు వెంకీ. అనిల్ తో వెంకటేష్ కు ఇది హ్యాట్రీక్ మూవీ. ఈసినిమా హిట్ అయితే ఇద్దరి కాంబోలో హ్యాట్రిక్ హిట్ గా నిలుస్తుంది. కాగా వెంబ్ సిరీస్ లకు కూడా వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. 

మోక్షజ్ఞపై దారుణమైన ట్రోల్స్.. Jr NTR ను మించిపోతాడా..?
 

రీమేక్ సినిమాల రారాజుగా వెంకటేష్ కు పేరుంది. ఎక్కవ రీమేక్ సినిమాలతో హిట్ కొట్టిన హీరోగా కూడా ఆయనకు రికార్డ్ ఉంది. కాగా  వెంకటేష్ చాలా రిజర్వ్ గా ఉంటారు. ఎక్కువగా ఎవరితో మాట్లాడరు. తన పనేదో తాను చేసుకుంటారు. 

హంగు ఆర్భాటాలు.. లేని పోని డైలాగ్ లు, పార్టీలు పబ్బులు ఇలా ఏవీ పట్టించుకోరు వెంకటేష్. షూటింగ్ లేకపోతే ఫ్యామిలీతో టైమ్ గడుపుతారు. హ్యాపీగా ఇంట్లో కూర్చోని టైమ్ పాస్ చేస్తారు. అవరసరం అయితేనే సినిమా ఈవెంట్లకు వెళ్తుంటారు వెంకీ. 

సౌందర్య మరణం అతనికి ముందే తెలుసా..? ఎవరా వ్యక్తి, నిజమెంత..?


ఇక తన కూతర్ల పెళ్ళిళ్ళు ఆమధ్య కాలంలో జరగడం వల్లే... ఆయన ఫ్యామిలీ గురించి కాస్త బయటకు తెలిసింది. అతి పెద్ద సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చినా.. వెంకటేష్ తన ఫ్యామిలీతో పెద్దగా బయటక కనిపించింది లేదు. చాలా తక్కువనే చెప్పాలి.

సర్వేపల్లి రాధాకృష్ణన్ తో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా..? 

అయితే వెంకటేష్ కు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. వెంకీకి బాగా ఇష్టమైన కూర గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. అయితే తనకు  మాత్రమే కాదు.. తన ప్యామిలీ మొత్తానికి బాగా ఇష్టమైన కూర కోసం డైనింగ్ టేబుల్ దగ్గర జరిగే గొడవ గురించి ఆయన ఓ సందర్భంలో చెప్పారు. 
 

బాలకృష్ణ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఎవరు..?

చిరంజీవి హోస్ట్ గా మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ప్రోగ్రామ్ జరిగినప్పుడు వెంకీ గెస్ట్ గా వచ్చారు. అప్పుడు ఫుడ్ గురించి  టాపిక్ రాగా.. ఆయన తనకే కాదు తన కుటుంబానికి కూడా కోడి కూర అంటే చాలా ఇష్టమని చెప్పారు.

అంతే కాదు తన తండ్రి రామానాయుడు ఉన్నప్పుడు అంతా కలిసి భోజనం చేసేవారమని అన్నారు. కోడి కూర అంటే చాలా ఇష్టం ఇంట్లో ఆ కూర చేసేప్పుడు రెండు కోళ్ళను కోసేవారు. కాని అది సరిపోయేది కాదు.

డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు నాన్నగారు కూర్చోగానే అందరం కూర్చుని తినేవాళ్లం.. కాని ఆ ముక్క నాది.. అది అయిపోతుందేమో.. అని టేబుల్ కింద కాళ్లు తన్నుకునేవాళ్లు.. 

చిరంజీవి కెరీర్ లో 30 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ఏదో తెలుసా..?

అరే ఆ ముక్క నాది.. అని సైగలు చేసుకుంటూ ప్లేట్ లో వేసుకునేవారం.. గతంలో నాకు... అన్నయ్య సురేష్ కు ఈ వార్ జరిగేది. ఆతరువాత డైనింగ్ టేబుల్ మీదకు రానా కూడా వచ్చి చేరాడు..ఇక పోటీ ఇంకా పెరిగిపోయింది అన్నారు వెంకటేష్. ఇలా తనకు ఇష్టమైన కూర కోడి కూర అని చెప్పారు వెంకీ. 

Latest Videos

click me!