మోక్షజ్ఞపై దారుణమైన ట్రోల్స్.. Jr NTR ను మించిపోతాడా..?

First Published | Sep 8, 2024, 7:04 PM IST

బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీకి అంతా సిద్ధం అయ్యింది. బర్త్ డే సందర్భంగా న్యూ లుక్ కూడా వచ్చింది. కాని  సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రం దారుణంగా జరుగుతోంది. ఇంతకీ ఏమంటున్నారంటే..? 

Nandamuri Mokshagna debut epic film announcement

నందమూరి హీరోల ఇమేజ్ అంతా ఇంతా కాదు.. ఎన్టీఆర్, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ కుతెలుగు రాష్ట్రాల్లో ఎంత ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారంటే పడిచచ్చిపోతుంటారు ఫ్యాన్స్.

అయితే బాలయ్య, ఎన్టీఆర్ సరే.. మరి బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ పైనే చాలా ఉత్కంఠ కొనసాగింది. మోక్షూ ఎంట్రీపై ఫ్యాన్స్ వెయ్యికళ్ళతో ఎదురుచూశారు.

కొంత మంది మాత్రం గట్టిగా ట్రోల్స్ చేశారు. మొన్నటి వరకూ మోక్షజ్ఞ పర్సనాలిటీ.. వెయిట్.. చూసి.. ఇతనేం హీరో అవుతాడు అంటూ ఎగతాళి చేసిన వారు ఉన్నారు. ఇక బాలయ్య వారసుడు సినిమాల్లోకి రావడం కష్టమే అని అన్నవారు కూడా ఉన్నారు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాని ఒక్క విషయం వారు మర్చిపోయారు. నందమూరి హీరోలంటేనే కాస్త బబ్లీ గా ఉంటారు. బాలయ్య, యంగ్ టైగర్ వీళ్లంతా కాస్త బరువు తో కనిపించే హీరోలే. ఇప్పుడంటే ఎన్టీఆర్ స్లిమ్ గా ఉన్నాడు కాని.. కంత్రీ సినిమాకు ముందు తారక్ ఎలా ఉండేవాడో అందరికి తెలుసు.

తారక్ మొదటి సినిమా తరువాత వరుసగా సినిమాలు చేస్తూ.. రాను రాను స్లిమ్ అవ్వకుండా, అశోక్ సినిమా టైమ్ కు చాలా బరువు పెరిగి అభిమానులను టెన్షన్ పెట్టాడు. ఇక బాలకృష్ణ వారసుడు గా ఎంట్రీ ఇస్తాడు అనుకున్న మోక్షజ్ఞ కూడా బొద్దుగా, బరువు గా కనిపించినప్పుడల్లా నందమూరి అభిమానులు ఆందోళన పడిపోయేవారు.

సౌందర్య మరణం అతనికి ముందే తెలుసా..?


Mokshagna

బాలయ్య తనయుడు ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని నందమూరి అభిమానులు ఎదురు చూడని రోజు లేదు. కాని అతను లావుగ కనిపించేసరికి ఫ్యాన్స్ బాగా టెన్షన్ పడ్డారు. వారి భయాలు పటాపంచలు చేస్తూ.. నందమూరి వారసుడు స్లిమ్ గా ఫిట్ గా అయ్యి చూపించాడు. హీరో గా ఎంట్రీ ఇచ్చే సమయానికి పూర్తి ఫిట్ నెస్ తో మతిపోయే మేకోవర్ తో షాక్ ఇచ్చాడు మోక్షజ్ఞ.

సర్వేపల్లి రాధాకృష్ణన్ తో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా..? ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..

ఎట్టకేలకు బాలయ్య ఫ్యాన్స్ ఆశలు తీరబోతున్నాయి. మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్దం అయ్యింది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మోక్షజ్ఞ. తాజాగా ఆయన బర్త్ డే సంరద్భంగా ఫస్ట్  లుక్ తోనే ట్రోలర్స్ కు మోక్షజ్ఞ  గట్టిగా సమాధానం చెప్పాడు.  

మోక్షజ్ఞ లుక్ చూడగానే  ఫ్యాన్స్ కళ్లల్లో వెయ్యి వెలుగులు కనిపిస్తున్నాయి. చక్కటి ఫిట్ నెస్ తో, కూల్ లుక్స్ తో క్లాసీగా గా మోక్షజ్ఞ కనిపించాడు. మరి కేవలం అనౌన్సమెంట్ కే మోక్షు పై అంతగా అంచనాలు ఏర్పడితే సినిమా సెట్స్ మీదకెళితే ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ అవుతాయో అని ప్యాన్స్ వెయిటింగ్. 

చిరంజీవి కెరీర్ లో 30 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ఏదో తెలుసా..?

దానికి తోడు అటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కూడా తన తమ్ముడికి ప్రేమతో విషెష్ చెప్పారు. తారక్ సపోర్ట్ కూడా తమ్ముడికి లభిచడంతో ఇండస్ట్రీలో  మోక్షజ్ఞ కు తిరుగు ఉండదనే చెప్పాలి. 

బాలకృష్ణ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఎవరు..?

అయితే ఇక్కడే మరో విషయం చెప్పుకోవాలి. ట్రోలర్స కు గట్టిగా సమాధానం అయితే చెప్పాడు కాని.. మోక్షజ్ఞ పై నెటిజన్లు మాత్రం ట్రోలింగ్ ఆపడంలేదు. అప్పుడు లావుగా ఉన్నాడని ట్రోల్ చేస్తే.. ఇప్పుడు మరో విధంగా ట్రోల్ చేస్తున్నారు.

మోక్షజ్ఞ ఎంట్రీపై ఫ్యాన్స్ రకరకాల పోస్ట్ లు పెడుతున్నారు. చిన్న లయన్ వచ్చింది.. అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. అయితే ఈ పోస్ట్ లలో సింహాల ఫోటోలతో మోక్షజ్ఞ పిక్స్ ను ఎడిట్ చేసి పెడుతున్నారు. దానికి కామెంట్ చేస్తూ.. యాంటీ ఫ్యాన్స్ కొంత మంది.

మీ ఇంట్లో అన్ని జంతువులేనా.. మనుషులు ఉండరా.. అంటూ కొంత మంది.. తాత , తండ్రి వస్తే మీరు కూడా రావాలా.. వేరే వారిని బ్రతకనివ్వరా.. అంటూ మరికొంత మంది తిడుతున్నారు. 

బాయ్ ఫ్రెండ్ కి బిగ్ షాక్ ఇచ్చిన తమన్నా..

మీరెన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్టీఆర్ అంత వారు కాలేరంటూ కొందరు అంటుంటే..మరికొంత మంది మాత్రం ఇలాంటి ట్రోల్స్ ను పట్టించుకోవద్దని.. మోక్షజ్ఞ ముందుకు దూసుకుపోవాలని రిటన్ కౌంటర్లు వేస్తున్నారు. అంతే కాదు తండ్రి వారసత్వంతో వస్తే తప్పేంటి.. నచ్చితే టికెట్ కొని చూడండి.. లేకుంటే లేదు అని గట్టిగా కౌంటర్లు వేస్తున్నారు. 

Latest Videos

click me!