బిగ్ బాస్ షోకి వెళ్లాలని చాలా మంది కోరుకుంటారు. కొందరి అవకాశం వచ్చినా ఎక్కువ రోజులు మనలేరు. మొదటి వారమే ఎలిమినేట్ కావడం దురదృష్టం అని చెప్పొచ్చు. ఇంటి పరిస్థితి అర్థం చేసుకుని, గేమ్ ఏమిటో తెలిసే లోపే బయటకు రావాల్సి వస్తుంది. ఇక సీజన్ 8లో ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు.
శేఖర్ బాషా, బెజవాడ బేబక్క, పృథ్విరాజ్, నాగ మణికంఠ, విష్ణుప్రియ, సోనియా ఆకుల నామినేట్ అయ్యారు. వీరిలో అత్యల్పంగా ఓట్లు పొందిన బేబక్క ఎలిమినేట్ అవుతున్నట్లు సమాచారం. సోషల్ మీడియా స్టార్ గా బెజవాడ బేబక్కకు బిగ్ బాస్ హౌస్లో ఛాన్స్ దక్కింది. సీజన్ 8కి గానూ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఆమెనే అంటున్నారు. గత ఏడు సీజన్స్ లో ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం.. 2017లో సీజన్ 1 మొదలైంది. చిత్ర పరిశ్రమకు చెందిన టాప్ సెలెబ్స్ కంటెస్ట్ చేశారు. ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న సీజన్ 1లో నటి జ్యోతి ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది.