త్వరలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంటాం.. కత్రినాతో రూమర్స్ పై విక్కీ కౌశల్‌ స్టేట్‌మెంట్‌ వైరల్‌..

Published : Oct 19, 2021, 07:05 PM IST

బాలీవుడ్‌లో యంగ్‌ హీరో విక్కీ కౌశల్, స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ ప్రేమలో ఉన్నారని, ఇప్పటికే వీరికి ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని, త్వరలో మ్యారేజ్‌ కూడా జరగబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై విక్కీ కౌశల్‌ స్పందించారు. కొత్త ట్విస్ట్ ఇచ్చాడు.

PREV
16
త్వరలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంటాం.. కత్రినాతో రూమర్స్ పై విక్కీ కౌశల్‌ స్టేట్‌మెంట్‌ వైరల్‌..

కత్రినా కైఫ్‌ ఇప్పటికే చాలా మందితో ఎఫైర్స్ నడిపించింది. సల్మాన్‌ ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌లతో ఘాటు రొమాన్స్ లో మునిగి తేలింది. సల్మాన్‌, రణ్‌బీర్‌లతో పెళ్లికి సిద్దమవుతుందని అన్నారు. కానీ ఉన్నట్టుండి వారికి బ్రేకప్‌ చెప్పి షాకిచ్చింది. కొన్నాళ్లపాటు ఒంటరిగానే ఉన్న కత్రినా ఇటీవల  యంగ్‌ హీరో విక్కీ కౌశల్‌తో డేటింగ్‌ ఉందని, వీరిద్దరు ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్నారనే వార్తలొస్తున్నాయి. 

 

26

బాలీవుడ్‌లో కత్రినా, విక్కీల లవ్‌ స్టోరీ హాట్‌ టాపిక్‌గా మారుతుంది. బీ టౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఓ ఫోటో వైరల్‌ అయ్యింది. వీరిద్దరికి రోకా ఫంక్షన్‌ కూడా జరిగిందనేది ఆ ఫోటో సారాంశం. అయినా దీనిపై వీరిద్దరూ స్పందించలేదు. తాజాగా విక్కీ కౌశల్‌ స్పందించారు. రూమర్స్ ని మరింత హీటెక్కించాడు. విక్కీ కౌశల్‌ `సర్దార్‌ ఉద్ధం` చిత్రంలో నటించారు. హిస్టారికల్‌ కథతో రూపొందిన ఈ  సినిమా ఓటీటీ విడుదలై, పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విక్కీ కౌశల్‌ దీనిపై స్పందించారు. 

36

క్యాట్‌తో ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని రూమర్స్ ఆ రోజు ఉదయం వచ్చాయి. అప్పుడు షూట్‌ మధ్యలో ఉన్నా. మళ్లీ సాయంత్రానికి చూస్తే అవన్నీ పుకార్లేనని మీడియాలో వార్తలొచ్చాయి. నిజనిజాలేంటో తెలిసిపోవడంతో స్పందించలేదు` అని తెలిపారు. ఇలాంటి రూమర్స్ విన్నప్పుడు నవ్వొస్తుందని, కాసేపు నవ్వుకుని పనిలో పడిపోతానని తెలిపారు.

46
Vicky Kaushal

మరో ప్రశ్నకి స్పందిస్తూ `త్వరలోనే ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంటాను` అని సెటైరికల్‌గా స్పందించారు విక్కీ. అయితే అమ్మాయి ఎవరనేది మెన్షన్‌ చేయలేదు. విక్కీ కౌశల్‌ సరదాగా అన్నాడా? లేక అందులో నిజం ఉందా ? అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి విక్కీ చేసిన ఈ వ్యాఖ్యలు సరికొత్త చర్చకి తెరలేపుతున్నాయి. 

56

ఇదిలా ఉంటే విక్కీ నటించిన `సర్దార్‌ ఉద్ధం` చిత్ర ప్రీమియర్‌లో కత్రినా కైఫ్‌ పాల్గొనడం ఓ విశేషమైతే, ఈ సందర్భంగా వీరిద్దరు టైట్‌ హగ్‌ చేసుకోవడం, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడం విశేషం. ప్రస్తుతం విక్కీ ఈ సినిమాతోపాటు `సామ్‌ బహదుర్‌`, `ది గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ`, `మిస్టర్‌ లేలే` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. 

66
Katrina Kaif

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోల నుంచి యంగ్‌ స్టర్స్ వరకు అందరికి బెస్ట్ ఆప్షన్‌గా మారిన కత్రినా కైఫ్‌ ఇప్పుడు అక్షయ్‌ కుమార్‌తో నటించిన చిత్రం `సూర్యవంశీ` విడుదల కావాల్సి ఉంది. మరోవైపు `ఫోన్‌ భూత్‌`, `టైగర్‌ 3` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories