రజనీ మార్కెట్ ఏమైంది? ‘వేట్ట‌య‌న్‌’ క్లోజింగ్ కలెక్షన్స్ అంత తక్కువా?

First Published | Oct 30, 2024, 7:23 AM IST

రజనీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘వేట్ట‌య‌న్‌’ఈ రిజల్ట్ ని ఎవరూ ఊహించలేదు. సక్సెస్ ఫుల్ చిత్రం ‘జైల‌ర్‌’ త‌ర్వాత ఆయ‌న్నుంచి వ‌చ్చిన పూర్తిస్థాయి సినిమా ఇదే కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. 

Vettaiyan,rajanikanth, Indian 2


 ప్రతీ పెద్ద సౌత్ సినిమా కూడా హిందీలో రిలీజ్ అవుతోంది. అదే సమయంలో నార్త్ ఫిల్మ్ లు సైతం సౌత్ లో భారీ గా రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి 2 తో ప్రారంభమైన ప్యాన్ ఇండియన్ రిలీజ్  కాన్సెప్టుని ప్రతీ సౌతిండన్ ఫిల్మ్ ఎడాప్ట్ చేసుకుని ముందుకు వెళ్తోంది.అయితే రిజల్ట్ మాత్రం అంతంత మాత్రంగా ఉంటోంది.  

సౌత్ నుంచి వెళ్లిన కాంతారా, కల్కి, దేవర అంటూ అప్పుడప్పుడూ మాత్రమే వర్కవుట్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న భారీగా రిలీజ్ చేసిన భారతీయుడు 2 హిందీలోనే కాకుండా అంతటా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు రజనీ ‘వేట్ట‌య‌న్‌’ వంతు వచ్చింది. ఈ సినిమాలో అమితాబ్ ని అటు  ఫహాద్ ఫాజిల్ ని తీసుకుని తెలుగు నుంచి రావు రమేష్ వంటి ఆర్టిస్ట్ లను తీసుకుని ప్యాన్ ఇండియా స్దాయిలో రిలీజ్ చేసారు. అయితే ఫలితం మాత్రం దారుణం. ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే ఆ విషయం క్లారిటి వస్తుంది.

Actor Rajinikanth Vettaiyan collection report out


ఈ సినిమా దసరా ఎడ్వాంటేజ్ తో బాగానే ఓపినింగ్స్ తెచ్చుకోగలిగింది. అయితే ఆ మూవ్ మెంట్ ని క్యాష్ చేసుకోవటంలో విఫలమైంది.  ఫస్ట్ వీకెండ్ లోనే సినిమా పూర్తిగా గ్రిప్ కోల్పోయింది. డిస్ట్రిబ్యూటర్స్ కు అప్పటికే అర్దమైపోయింది. ఇది భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాదు అని. సినిమా ఫుల్ రన్ పూర్తయ్యేసరికి ప్లాఫ్ స్టేటస్ ని అందుకుంది. 


Rajinikanth, Vettaiyan


రజనీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘వేట్ట‌య‌న్‌’ఈ రిజల్ట్ ని ఎవరూ ఊహించలేదు. సక్సెస్ ఫుల్ చిత్రం ‘జైల‌ర్‌’ త‌ర్వాత ఆయ‌న్నుంచి వ‌చ్చిన పూర్తిస్థాయి సినిమా ఇదే కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ‘జై భీమ్’ ఫేమ్ జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం.

.. ర‌జ‌నీకి తోడుగా అమితాబ్ బ‌చ్చ‌న్‌, రానా ద‌గ్గుబాటి త‌దిత‌ర తారాగ‌ణం న‌టించ‌డంతో‘వేట్ట‌య‌న్‌’పై మ‌రిన్ని ఎక్సపెక్టేషన్స్  పెరిగాయి. మంచి ఓపినింగ్స్ తో ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన  ఈ చిత్రం రిలీజ్ తర్వాత ఓ కొత్త చర్చకు తావిచ్చింది.  అయితే అది గాలి తీసేసిన బెలూన్ లా మారిపోయింది.

Actor Rajinikanth Vettaiyan collection report out


‘వేట్ట‌య‌న్‌’  ప్రాంతాలవారీగా కలెక్షన్స్ చూస్తే... 

తమిళనాడు : 100 crores
కర్ణాటక : 22 crores
ఆంద్రా/తెలంగాణా : 21 crores
కేరళ : 17 crores
రెస్టాఫ్ ఇండియా : 7 crores
ఓవర్ సీస్ : 80 crores
వరల్డ్ వైడ్: 247 crores

Actor Rajinikanth Vettaiyan film


ఈ సినిమా  ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా 325 కోట్లు జరిగింది. అయితే  76% మాత్రమే ప్రీ బజ్ వాల్యూలో రికవరీ అయ్యింది.  దాంతో ఈ సినిమా భాక్సాఫీస్ దగ్గర ఫ్లాఫ్ గా నమోదు అయ్యింది .  అలాగే ‘వేట్ట‌య‌న్‌’ హిందీ ఆడియన్స్ ని ఈ సినిమా కూడా ఇంప్రెస్ చేయలేకపోయింది.

సమస్య తమిళనాడుకు సంభందించినట్లు ఉండటం మైనస్ గా మారింది. నార్త్ లో కేవలం ‘వేట్ట‌య‌న్‌’చిత్రం  0.70 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. అసలు అక్కడ బజ్ క్రియేట్ చేయలేకపోయింది. అమితాబ్ ఉండటం కూడా సినిమాకు కలిసి రాలేదు. అలాగే మహారాష్ట్రలో రజనీకాంత్ బాగా పాపులర్ ఫేస్. అయినా ఎవరూ పట్టించుకోలేదు. మారిన జనరేషన్ రజనీకాంత్ కు ఓటు వేయలేదు.
 

Rajinikanth, Vettaiyan


 ‘వేట్ట‌య‌న్‌’చిత్రం తెలుగులోనూ బాగా నిరాశపరిచింది. ఓపినింగ్స్ తెప్పించుకోలేదు. దసరా శెలవులను క్యాష్ చేసుకోలేని సిట్యువేషన్.  రజనీ మార్క్ డైలాగ్స్ తో .. ఫైట్లతో అదిరిపోతుందేమో అనుకున్నవారికే నిరాశ ఎదురైంది.  ‘జై భీమ్’ త‌ర‌హాలోనే మ‌రోసారి డైరక్టర్ న్యాయం, విద్య స‌మానంగా అందాలనే ఓ బ‌ల‌మైన అంశాల్ని ఎంచుకుని ఈ చిత్రాన్ని మ‌లిచారు.

క‌థ చెప్పిన ఉద్దేశం, దాన్ని ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ఎన్‌కౌంట‌ర్స్‌తో ముడిపెట్టి చెప్పిన విధానం బాగుంది కానీ కొంతదూరం వెళ్లాక మరీ మెసేజ్ ఓరియెంటెడ్ గా మారిపోయింది.   ర‌జ‌నీకాంత్ ఇమేజ్‌కి త‌గ్గ కమర్షియల్ ఎలమెంట్స్  కానీ,  ఇంట్రస్టింగ్ ట్విస్ట్ లు  కానీ లేక‌పోవ‌డంతో సినిమా ఒక ద‌శ దాటిన త‌ర్వాత సోషల్ కామెడ్ తో  కూడిన ఓ డాక్యుమెంట‌రీలా అనిపిస్తుంది.  దాంతో తెలుగులో ఈ సినిమా జస్ట్ ఓకే సినిమా అనిపించుకుంది. ఫస్టాఫ్ అదిరిపోయింది కానీ సెకండాఫ్ సోసో గా ఉందని తేల్చేసారు. 

Latest Videos

click me!