నాతో ఏంటీ మీకు ప్రాబ్లెమ్‌, నేను ఎదగకూడదా? ట్రోల్స్ పై ఊగిపోయిన కిరణ్‌ అబ్బవరం.. అమ్మ కష్టం చెబుతూ ఎమోషనల్‌

First Published | Oct 30, 2024, 12:51 AM IST

కిరణ్‌ అబ్బవరం ఒక్కసారిగా బరస్ట్ అయ్యాడు. `క` సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ట్రోలర్స్ పై రెచ్చిపోయాడు. ఒక రేంజ్‌లో వాళ్లకి చుక్కలు చూపించినంత పనిచేశాడు. 
 

కిరణ్‌ అబ్బవరం.. యంగ్‌ హీరోలల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో. ఒక్కో సినిమాతో హీరోగా ఎదుగుతూ వస్తున్నాడు. `రాజా వారు రాణిగారు` చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమై అందరి దృష్టిని ఆకర్షించాడు. `ఎస్‌ ఆర్‌ కళ్యాణమండపం`తో హిట్‌ కొట్టి ఇండస్ట్రీలో నిలబడ్డాడు. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తానేంటో నిరూపించుకుంటున్నాడు. ఈ క్రమంలో కొన్ని పరాజయాలు, మరికొన్ని డీసెంట్‌ హిట్లని అందుకున్నాడు. ఇప్పుడు రూట్‌ మార్చి థ్రిల్లర్‌ కథతో వస్తున్నాడు. `క` అనే సినిమా చేశాడు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

ఈ సినిమా దీపావళి సందర్భంగా ఈ నెల 31న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. దీనికి నాగచైతన్య గెస్ట్ గా రావడం విశేషం. ఈ ఈవెంట్‌లో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ, అమ్మ స్టోరీ చెబుతూ ఎమోషనల్‌ అయ్యాడు. అలాగే తనపై చేస్తున్న ట్రోల్స్ పై పైర్‌ అయ్యాడు. ఎప్పుడూ లేని విధంగా స్టేజ్‌పై ఊగిపోయాడు. తనని విమర్శించేవారికి, ముఖ్యంగా తనని తొక్కేసేందుకు కుట్ర చేస్తున్న వారిని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. తనతో ప్రాబ్లెమ్‌ ఏంటంటూ మండిపడ్డాడు. 


తాము, తమ ఫ్యామిలీ బాగుండాలని అమ్మ ఎంతో కష్టపడిందని, కూలిపని చేసి తమని చదివించిందని, ఊర్లో రెస్పెక్ట్ లేదని, బంధువుల్లో గౌరవం లేదని వేరే దేశాలకు వెళ్లి డబ్బు సంపాదించి  మంచి ఎడ్యూకేషన్‌ అందించిందని, తమని మంచి స్థాయి తీసుకొచ్చిందని, కానీ ఆమెకి ఎప్పుడూ ఏదో లోటు ఉంటుందని, మీరు ఇంకా ఏదైనా సాధిస్తే బాగుంటుందని చెప్పేదని అందుకోసం జాబ్‌లు వదిలేసి సినిమాల్లోకి వచ్చినట్టు తెలిపారు కిరణ్‌ అబ్బవరం. సినిమాల్లో తానేంటో నిరూపించుకుని అమ్మని హ్యాపీ చేయాలని హీరోగా మారినట్టు తెలిపారు. 
 

`రాజావారు రాణిగారు`తో హీరోగా పరిచయమై `ఎస్‌ఆర్ కళ్యాణమండపం`తో లాక్‌ డౌన్‌లో హిట్‌ కొట్టినట్టు తెలిపారు. అయితే ఆ రోజు నుంచి తనని కొందరు టార్గెట్‌ చేస్తున్నారని, కానీ ఈ ఏడాది కాలంతో ఎంతో చూశానని, బాగా విమర్శిస్తున్నారని, తన లుక్‌పై, సినిమాలపై ట్రోల్‌ చేస్తున్నారని వాపోయారు. అంతేకాదు ఓ సినిమాలో తనపై ట్రోల్‌ చేశారని, అది తనని బాగా బాధపెట్టిందన్నారు. కిరణ్‌ అబ్బవరంతో సమస్య ఏంటి? నేను ఎదగకూడదా? అని ప్రశ్నించారు.

సినిమాలు హిట్‌ ఫ్లాప్‌ కామన్‌, ప్రతి హీరో కెరీర్‌లో ఉంటాయి. అందులో భాగంగానే నేను కొన్ని తప్పులు చేశాను, కొన్ని సినిమాలు ఆడలేదు. కానీ కష్టపడే విషయంలో ఎప్పుడూ తగ్గలేదు, కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు నిద్ర పట్టేది కాదు, ఎలాంటి సినిమాలు చేస్తున్నామని బాధపడేవాడిని, ఆ సమయంలో నిద్ర లేక స్క్రీన్‌పై సరిగా కనిపించేవాడిని కాదు, దీంతో ఆ విషయంలోనూ ట్రోల్స్ చేస్తున్నారని వాపోయాడు కిరణ్‌. 
 

`ఎస్‌ఆర్‌కళ్యాణ మండపం` సమయంలో ఎంతో మంది తనని అభిమానించారు, సపోర్ట్ చేశారు. సోషల్‌ మీడియాలో సపోర్ట్ చేశారు, కావాలంటే అవన్నీ చూడండి అంటూ ఫైర్‌ అయ్యారు. తనని ట్రోల్‌ చేస్తున్న కొందరు ఇండస్ట్రీ ప్రముఖులకు పరోక్షంగా గట్టిగా ఇచ్చిపడేశాడు కిరణ్‌ అబ్బవరం. కూలిపని చేసుకునే స్థాయి నుంచి ఇక్కడి వరకు వచ్చాం, మీకేంటి ప్రాబ్లమ్‌,

కిరణ్‌ అబ్బవరం ఎదగకూడదా? నేను సినిమాలు చేయకూడదా? నాలాంటి వాడికి సినిమా తీసి థియేటర్లలో రిలీజ్‌ చేయడమే సక్సెస్‌. అలాంటిది నేను చేసిన ఎనిమిది సినిమాల్లో నాలుగు డీసెంట్‌ హిట్లు పడ్డాయి. ఇది అందరి లైఫ్‌లో కామన్‌ అని తెలిపారు. అయితే చెక్‌ పోస్ట్ వద్ద ఓ కంపెనీ ఉంటుందని, ఆ సినిమాలో తనపై ట్రోల్స్ చేశారని, అది తన ఫ్యాన్స్ చెప్పి, ఏంటీ బ్రో మీ మీద మరీ ఇలా చేస్తున్నారని చెప్పారని, అది ఎంతో బాధ కలిగించిందన్నారు కిరణ్‌.

నన్నేందుకు టార్గెట్‌ చేస్తున్నారంటూ ఒక రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. ట్రోలర్స్ కి, తనని విమర్శించేవారికి గట్టిగా ఇచ్చిపడేశాడు కిరణ్‌ అబ్బవరం. సందీప్‌, సుజీత్‌ దర్శకత్వం వహించిన `క` సినిమాలో కిరణ్‌కి జోడీగా తన్య రామ్, నయన్‌ సారిక హీరోయిన్లుగా నటించారు. 

Read more: సావిత్రి చివరి రోజుల్లో ఎందులో నివసించిందో తెలుసా? అంతకంటే దారుణ స్థితి మరోటి లేదు!
 

Latest Videos

click me!