సూపర్ స్టార్ తో మ‌ల్టీస్టార‌ర్‌ కి ‘నో’ చెప్పిన ప్ర‌భాస్‌?

First Published Oct 30, 2024, 6:48 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ప్రభాస్, షారుఖ్ కాంబినేషన్లో సినిమా ప్లాన్ చేసినప్పటికీ, ప్రభాస్ మాత్రం మల్టీస్టారర్ కథకు నో చెప్పాడు.

prabhas, shahruk khan, bollywood


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా వచ్చిన కల్కి హిట్ మేనియాలో అభిమానులు ఉన్నారు. ఒకేసారి రెండు సినిమాలు ప్రభాస్ చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో  ఆయన నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్ర షూటింగ్‌ను శరవేగంగా జరుగుతోంది.  

మరో  ప్రక్క  డైరెక్టర్ హను రాఘవపూడితో కూడా ప్రభాస్ ఓ సినిమా చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయ్యింది.  ప్రభాస్ లేని సీన్స్ తీస్తున్నారు. ఇంత బిజిగా ఉన్నా రోజూ ఆయనతో ప్రాజెక్టులు చేయటానికి దర్శకులు, నిర్మాతలు ప్రదిక్షణాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి నిర్మాతలు ఇక్కడ క్యూలు కడుతున్నారు.

prabhas, shahruk khan, bollywood


ఈ క్రమంలో రీసెంట్ గా ప్రభాస్ దగ్గరకు  ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం ప్రపోజల్ వచ్చినట్లు సమాచారం. అయితే ఆ  ప్రాజెక్టుకి ప్రభాస్ మొహమాటం లేకుండా నో చెప్పినట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అటువైపు ఉన్నది మరో సూపర్ స్టార్. అయినా సరే ప్రభాస్ వద్దని క్లియర్ గా చెప్పేసారట.

తను చాలా బిజీ షెడ్యూల్స్ లో ఉన్నానని, ఇప్పుడు సోలోగా అంటే తను ఫ్రీ అయ్యినప్పుడు చేసుకుంటానని, అదే మరో స్టార్ ఉన్నప్పుడు అంటే వాళ్లని ఇబ్బంది పెట్టినట్లు అవుతుందని అర్దమొచ్చేలా చెప్పి పంపారట. ఇంతకీ ఆ సూపర్ స్టార్ ఎవరు...

Latest Videos



బాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు... డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్రభాస్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేయనున్నారు. అయితే, ఈ సినిమాలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మెయిన్ హీరోగా, సెకండ్ లీడ్ హీరోగా ప్రభాస్ నటిస్తాడని దర్శకుడు తెలపడంతో..

ప్రభాస్ ఈ సినిమాకు నో చెప్పాడని అంటున్నారు. సోలో హీరో సినిమాల‌కంటే మ‌ల్టీస్టార‌ర్‌ల‌కే క్రేజ్ ఎక్కువ ఉందని,  పైగా మ‌ల్టీస్టార‌ర్ల వ‌ల్ల మార్కెట్ పెరుగుతోంది అని ఒప్పించటానికి ప్రయత్నించారట. అయితే ప్ర‌భాస్ మాత్రం ఆ  మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌కు నో చెప్పిన‌ట్టు స‌మాచారం.


 బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సిద్దార్థ్ ఆనంద్ తో గతంలోనే ప్ర‌భాస్ ఓ సినిమా చేయాలి. ఎప్ప‌టి నుంచో ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది కానీ ముందుకు వెళ్లటం లేదు.ఈ గ్యాప్ లో  షారుఖ్‌తో ‘ప‌ఠాన్‌’ సినిమా తీసి సూప‌ర్ హిట్టు కొట్టాడు సిద్దార్థ్. ఈ సినిమాతో షారుఖ్ కెరీర్‌కు రీఎంట్రి వచ్చినంత ఉషారు వ‌చ్చింది. బాలీవుడ్ కూడా ఈ హిట్ తో ఒడ్డునపడినట్లు ఫీలైంది. ‘ప‌ఠాన్’ త‌ర‌వాత సిద్దార్థ్ తో క‌లిసి సినిమా చేయ‌డానికి చాలామంది హీరోలు ముందుకు వ‌చ్చారు. కానీ సిద్దార్థ్ మాత్రం త‌న‌కు ప్ర‌భాస్ కావాల‌నే తిరుగుతున్నారు. 

Hanu Raghavapudi,Fauji , Prabhas, Mythri Movie Makers


అయితే ప్ర‌భాస్ కూడా సిద్దార్థ్ తో సినిమా చేయ‌డానికి రెడీగానే ఉన్నాడు. అయితే సరైన కథతో రావాలని, తన డేట్స్ కు అనుగుణంగా చూసుకోవాలని, బల్క్ డేట్స్ ఇవ్వటం కష్టమని చెప్తున్నారు. ఆ క్రమంలోనే ప్రభాస్ కాస్త తక్కువ సీన్స్ ఉండేలా  ఈసారి సిద్దార్థ్ ఓ మ‌ల్టీస్టార‌ర్ క‌థ రాసుకొచ్చాడు.  

అందులో ఓ హీరోగా షారుఖ్ ని సౌత్ నుంచి మ‌రో హీరో   ప్ర‌భాస్ తోనూ చేయాలనేది  సిద్దార్థ్ ప్లాన్.  అయితే ప్ర‌భాస్ మాత్రం క్లియర్ గా త‌నకు మ‌ల్టీస్టార‌ర్లు చేయ‌డం ఇష్టం లేద‌ని, సోలో హీరోగా క‌థ చెబితే చేస్తాన‌ని చెప్పి పంపించేశాడ‌ని వినపడుతోంది.

click me!