ఆ తర్వాత వాణిశ్రీ పదేళ్లపాటు ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా రాణించింది.. బియన్ రెడ్డి మాటలే నిజమయ్యాయి అని చంద్రమోహన్ అన్నారు. తన కెరీర్ లో బెస్ట్ మూవీ అంటే రంగులరాట్నం చిత్రమే అని చంద్రమోహన్ అన్నారు. ఆ తర్వాత కూడా చాలా అద్భుతమైన చిత్రాలు చేశాను. కానీ రంగులరాట్నం చిత్రంలో నటించినప్పుడు చాలామంది నన్ను ప్రశంసించారు. కొత్త కుర్రాడిలా నటించలేదు.. అనుభవం ఉన్న నటుడిగా నటించావని ప్రశంసించినట్లు చంద్రమోహన్ తెలిపారు.
తన కెరీర్ లో రంగులరాట్నం తర్వాత సిరి సిరి మువ్వ, రాధా కళ్యాణం, పదహారేళ్ళ వయసు, సీతామాలక్ష్మి, శుభోదయం చిత్రాలు బెస్ట్ మూవీస్ అని చంద్రమోహన్ అన్నారు. పదహారేళ్ళ వయసు చిత్రానికి ఉత్తమ నటుడిగా చంద్రమోహన్ కి ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది.
చంద్రమోహన్ 50 ఏళ్ళకి పైగా ఇండస్ట్రీలో నటుడిగా రాణించారు. చంద్రమోహన్ చివరగా దువ్వాడ జగన్నాథమ్, గౌతమ్ నందా, ఆక్సిజన్ లాంటి చిత్రాల్లో నటించారు. 2023లో అనారోగ్య కారణాలతో ఆయన మరణించిన సంగతి తెలిసిందే.