జయంతిని ఆటపట్టించిన ఎన్టీఆర్‌.. కమలకుమారి జయంతిగా ఎలా మారిందంటే?

First Published Jul 26, 2021, 10:21 AM IST

సీనియర్‌ నటి జయంతి మరణంతో తెలుగుతోపాటు సౌత్‌ చిత్ర పరిశ్రమలు శోక సంద్రంలో మునిగిపోయాయి. ఆమె మరణం సినిమాకే పెద్ద నష్టంగా ప్రముఖులు చెబుతూ విచారం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో జయంతి లైఫ్‌ని ఓ సారి చూస్తే..
 

తెలుగు సీనియర్‌ నటి జయంతి(76) గత రెండేళ్లుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బెంగుళూరులోని బనశంకరిలో గల తన స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె హఠాన్మరణంతో టాలీవుడ్‌ లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
undefined
ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ,హిందీ చిత్రాల్లో దాదాపు ఐదు వందలకుపైగా చిత్రాల్లో నటించింది. ఓ ఇంగ్లీష్‌ చిత్రంలోనూ నటించారు. అన్ని భాషల్లో సీనియర్‌ నటులతో కలిసి నటించి మెప్పించారు జయంతి. ఆ తర్వాత మదర్‌ రోల్స్, బామ్మ రోల్స్ తో ఆకట్టుకున్నారు. దాదాపు అరు దశాబ్దాలుగా సినిమా రంగంలో నటిగా సేవలందించారు. విలక్షణ పాత్రలతో ఆడియెన్స్ ని అలరించారు. ఎక్కువగా కన్నడ నటిగా ఆమె పాపులర్‌ అయ్యారు.
undefined
1963లో కన్నడ చిత్రం `జెనుగోడు` చిత్రంతో ఆమె నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. నటి జయంతి 1945, జనవరి 6న జన్మించారు. అసలు పేరు కమలకుమారి. తండ్రి బాలసుబ్రహ్మణ్యం. బెంగుళూరులోని సెయింట్‌ జోసెఫ్‌ కాలేజ్‌లో ఇంగ్లీష్‌ ప్రొఫేసర్‌గా పనిచేశారు. తల్లి సంతానలక్ష్మి. వీరి ముగ్గురి సంతానంలో జయంతి పెద్ద కుమార్తె. తనకు ఇద్దరు తమ్ముళ్ళు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు వేరుకావడం వలన జయంతిని తీసుకొని తల్లి మద్రాసు చేరింది.
undefined
సంతానలక్ష్మికి తన కూతుర్ని నాట్యకళాకారినిగా చేయాలనే కోరిక ఉండేది. మద్రాసులో బడికి వెళ్తూ కమలకుమారి నాటి ప్రముఖ నర్తకి, నాట్య విదుషీమణి చంద్రకళ వద్ద నాట్యం నేర్చుకోసాగింది. ఒకనాడు తోటి విద్యార్థినులతో కలిసి ఒక కన్నడ సినిమా షూటింగ్ చూడడానికి వెళ్ళింది. ప్రముఖ కన్నడ చిత్ర దర్శకుడు వై.ఆర్.స్వామి.. కమలకుమారి రూపురేఖల్ని చూసి `జేనుగోడు` అనే సినిమా కోసం ముగ్గురు నాయికల్లో ఒకరిగా ఎంపిక చేశారు. కమలకుమారి పేరు లోగడ చాలామందికి అచ్చిరాలేదనే ఉద్దేశంతో ఆమె పేరును జయంతిగా మార్చారు.
undefined
చిన్నచిన్నవేషాలు వేస్తున్న రోజుల్లో కొంతమంది నిరుత్సాహపరిచినా పట్టుదలతో కష్టపడి పైకొచ్చారు. కన్నడ చిత్రసీమలో జయంతి స్థానం ఉన్నతమైనది. కన్నడ మెగా హీరో రాజ్ కుమార్తో అందరు హీరోయిన్లకన్నా ఎక్కువగా 30 సినిమాలలో జయంతి నటించారు. ఆమె మాతృభాష తెలుగైనా కన్నడం చాలా చక్కగా మాట్లాడతారు. అమె అసలైన కన్నడ నటి అని కన్నడ ప్రేక్షకులు భావిస్తారు.
undefined
బడి పిల్లలతో కలిసి మద్రాసుకు విహారయాత్ర వెళ్ళినప్పుడు అప్పటి ఎన్టీఆర్‌ తో ముచ్చటించిన తర్వాత బొద్దుగా, ముద్దుగా కనిపిస్తున్న కమలకుమారిని దగ్గరకు తీసుకుని `నాతో సినిమాలలో హీరోయిగ్ గా వేస్తావా` సరదాగా అన్నారట ఎన్టీఆర్‌. పన్నెండేళ్ళ కమలకుమారి బుగ్గలు ఎరుపెక్కాయి. ఆ అమ్మాయి సిగ్గుతో ముఖం కప్పుకొంది. తర్వాత కాలంలో ఆనాటి కమలకుమారి `జగదేకవీరుని కథ`, `కులగౌరవం`, `కొండవీటి సింహం`, `జస్టిస్ చౌదరి` చిత్రాలలో ఎన్టీఆర్ సరసన నాయికగా నటించారు.
undefined
ఎన్.టి.రామారావుతో నటించిన జగదేకవీరుని కథ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. `బాలనాగమ్మ`, `స్వర్ణమంజరి`,` కొండవీటి సింహం` లాంటి హిట్‌ సినిమాల్లో నటించారు. దర్శకులు కె.వి. రెడ్డి, కె.విశ్వనాథ్‌, కె.బాలచందర్లు ఈమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మంచి వేషాలు ఇప్పించారు. కన్నడ, తెలుగు, మళయాళం భాషల్లో నటించినా సొంతంగానే డైలాగులు చెప్పడం ఈమె ప్రత్యేకత. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.
undefined
తెలుగులో `స్వాతికిరణం`, `రాజా విక్రమార్క`, `కొదమ సింహం`, `దొంగమొగుడు`, `శాంతి నివాసం`, `శ్రీదత్త దర్శనం`, `జస్టిస్‌ చౌదరి`, `కొండవీటి సింహం`, `అల్లూరి సీతారామరాజు`, `శ్రీరామాంజనేయ యుద్ధం`, `శారద`, `దేవదాసు`, `బొబ్బిలి యుద్ధం`, `పెదరాయుడు` వంటి అనేక చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు.
undefined
ఎంజీఆర్‌, రజనీకాంత్‌, రాజ్‌కుమార్‌, ఎన్టీఆర్‌,ఏఎన్నార్‌, శోభన్‌బాబు, కృష్ణ, చిరంజీవి, వెంకటేష్‌, మోహన్‌బాబు వంటి దాదాపు అందరు టాప్‌ స్టార్‌ సినిమాల్లో నటించి మెప్పించారు. హీరోయిన్‌గా అద్బుతమైన నటనతో ప్రదర్శించడంతోపాటు పాజిటివ్‌, నెగటివ్‌ రోల్స్ తో మెప్పించారు.
undefined
జయంతి నటనకు అనేక అవార్డులు వరించాయి. 1965లో `మిస్‌ లీలావతి` అనే కన్నడ సినిమాలో స్విమ్మింగ్‌ డ్రెస్‌లో నటించారు. ఈ పాత్రకిగానూ ఆమెకి ఉత్తమ నటికి జాతీయ అవార్డు అందించింది. ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకుంది.
undefined
సినిమా రంగంలోనే కాదు, రాజకీయాల్లోనూ రాణించారు. 1998 లోక్‌సభ ఎన్నికలలో లోకశక్తి పార్టీ తరపున చిక్ బళ్ళాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వత 1999లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కోరటగీరె నియోజకవర్గం నుండి పోటీచేసి ఓటమి పాలయ్యారు.
undefined
click me!