మెగా ఫ్యామిలీలో 4 పెళ్లిళ్లు ... వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు, ఆ ఇద్దరిది ఒకటే జాతకమట

First Published | Jul 19, 2022, 11:47 AM IST

మెగా ఫ్యామిలీ లో పెళ్లిళ్లపై సంచనల వ్యాఖ్యాలు చేశారు ప్రముఖ జ్యోతీష్య నిపుణుడు వేణు స్వామి. సినిమా వాళ్ల పెళ్లిళ్లు, పెటాకులు గురించి అంచనాలు వేసి చెప్పే  ఈ పండితులు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శ్రీజాల  గురించి జాతకం చెప్పారు. 

వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా వాళ్ల పెళ్లిల్ల గురించి, వారి విడాకులు గురించి చెపుతూ.. సంచలనాలు సృష్టించాడు వేణు స్వామి.  ఇండస్ట్రీలో ఏ స్టార్స్ పెళ్ళి జరిగినా.. సోషల్ మీడియా మొత్తం వేణు వైపూ చూస్తుంది. ఎందుకంటే వారి పెళ్ళి ఉంటుందా.. పెటాకులు అవుతుందా అని  చెప్పేది ఆయనే కాబట్టి.  ముఖ్యంగా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వేణు స్వామి పాపులారిటీ సంపాదించుకున్నారు. 
 

సమంత నాగ చైతన్య పెళ్లి తరువాత వారు  విడిపోతారని వేణు స్వామి ముందే జోష్యం చెప్పి సంచలనంగా మారారు. వేణుస్వామి చెప్పినట్టుగానే సమంత చైతూ విడిపోవడంతో ఆయన జ్యోతిష్యాన్ని నమ్మే వారి సంఖ్య కూడా పెరిగింది. అందులోనూ.. సినిమా వాళ్లు  ఎక్కువగా  ఆయన చుట్టు తిరుగుతున్నారు. స్టార్ హీరోయిన్  రష్మిక సైతం వేణు స్వామిని ఇంటికి పిలిపించుకుని మరీ పూజలు జరిపించారు.


ఇక మెగా ఫ్యామిలీపై వేణు స్వామి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు అచ్చిరావని కూడా వేణు స్వామి అప్పట్లో కామెంట్స్ చేశారు. ఇక ఇప్పుడు మరోసారి వేణు స్వామి మెగా ఫ్యామిలీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మెగా ఫ్యామిలీలో నాలుగు పెళ్ళిళ్ల గురించి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 

మెగాస్టార్  చిన్న కూతురు శ్రీజ తన రెండవ భర్త యంగ్ హీరో  కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కళ్యాణ్ దేవ్ శ్రీజలు వేరువేరుగా ఉంటున్నారని త్వరలోనే విడాకులను అనౌన్స్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ విషయంలో  వేణు స్వామి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. 
 

శ్రీజ త్వరలో మూడో పెళ్లి చేసుకోబోతుందని తన స్నేహితుడిని శ్రీజ పెళ్లి చేసుకుంటుందని వేణు స్వామి జోష్యం చెప్పారు. అంతేకాకుండా శ్రీజ జాతకంలో కుజుడు నీచంలో ఉన్నాడని కాబట్టి శ్రీజ మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉందని కామెంట్ చేశారు.
 

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పెళ్ళి గురించి కూడా ఆయన మరో బాంబ్ పేల్చారు.  శ్రీజల జాతకం, పవన్ జాతకం  ఒకే విధంగా ఉందని చెప్పారు. పవన్ కళ్యాణ్ జాతకంలో కూడా కుజుడు నీచం లో ఉన్నాడని కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా నాలుగో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని వేణు స్వామి చెప్పారు.  ఇక  వేణు స్వామి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయంలో రకరకాల స్పందనలు వినిపిస్తున్నాయి. 

Latest Videos

click me!