తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ (Thalapathy Vijay) తొలిసారిగా డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘వారసుడు’ అనే టైటిల్ తో తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రానికి రైటర్, దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.