ఇండియా- పాకిస్తాన్ యుద్దంపై వేణు స్వామి సంచలన జోస్యం, ఇంతకీ ఏమన్నారంటే?

Published : May 10, 2025, 08:26 PM IST

ఎప్పుడూ సినిమా వాళ్లపై జాతకాలు చెపుతూ సంచలనంగా  మారిన ప్రముఖ జ్యోతీష్యుడు వేణు స్వామి..ఈ మధ్య వివాదాలతో పెద్దగా కనిపించలేదు. కాని తాజాగా ఆయన మరోసారి సంచలనంగా మారాడు. అయితే ఈసారి సినిమావాళ్లను వదిలేసి భారత్ పాక్ యుద్దాన్ని పట్టుకుని సంచలనానికి తెరలేపాడు. ఇంతకీ ఈ యుద్దం గురించి ఆయన ఏమంటున్నాడంటే? 

PREV
15
ఇండియా- పాకిస్తాన్ యుద్దంపై వేణు స్వామి సంచలన జోస్యం, ఇంతకీ ఏమన్నారంటే?
India Pakistan War Tension

మన దేశంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ను ముచ్చెమటలు పెట్టించింది భారత ఆర్మి.  ఆపరేషన్ సింధూర్ పేరుతో మనవాళ్లు చేపట్టిన చర్యకలకు దిగివచ్చింది పాకిస్తాన్. కాపాడండి బాబోయ్ అంటూ గగ్గోలు పెట్టింది. ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాను  వేలుపెట్టి చూపించడంతో ఒంటరిదైపోయిన  పాకిస్తాన్  దెబ్బకు దారికి వచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు పాకిస్తాన్ లోపలికి కూడా చొచ్చకునిపోయి.. భారత ఆర్మి  ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.  దాంతో  వందల సంఖ్యలో ఉగ్రవాదు మరణించారు. 

25

ఇక ఈ క్రమంలో ఇండియా పాకిస్తాన్ యుద్దం గురించి రకరకాల కామెంట్లు, ఎవరి వర్షన్ ను వారు వెల్లడిస్తూ వస్తున్నారు. ఈక్రమంలో... భారత్- పాక్ మధ్య యుద్ధ పరిస్థితులపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి స్పందించారు. ఆయన అన్న మాటలకు నెటిజన్లు నోటిమీద వేలు వేసుకుంటున్నారు.  భారత్ – పాక్ యుద్ధం జరుగుతుందని తానకు ముందే తెలుసన్నాడు వేణు స్వామి. అందుకు సాక్ష్యంగా ఓ వీడియోను కూడా శేర్ చేశాడు వేణు స్వామి. యుద్దం తరువాత జరిగే పర్యావసానం గురించి ఆయన వెల్లడించారు. 

35

ఇండియా పాకిస్తాను యుద్దం జరుగుతందని నేను ముందు చెప్పాను. ఉగాదికి 10 రోజులు ముందు  ఈ వీడియోను చేశాను అని ఆయన అన్నారు. మహాభారత యుద్దం 5 గ్రామాల కోసం జరిగింది. ఇప్పుడు భారత్ పాక్ యుద్దం కూడా భూమికోసమే జరుగుతుంది. భారత్- పాక్ దేశాల మధ్య యుద్ధం పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసమే జరుగుతోంది. చిన్న గాలివానగా మొదలై.. తుపానుగా మారుతుంది.  ఈ యుద్దంతో పాకిస్తాను దాదాపు మొత్తం నాశనం అవుతుంది అని ఆయన అన్నారు. దాదాపు 80 శాతం పాకిస్తాన్ పాడైపోతుందని వేణు స్వామి జోస్యం చెప్పారు. 

45
India Pakistan War Tension

షష్ఠ గ్రహ కూటమి వల్ల ఈ యుద్దం ప్రపంచాన్ని ఇబ్బందుల్లో నెడుతుంది అన్నారువేణు స్వామి. ఈ యుద్దం ప్రపంచం అంతటికి  వ్యాపిస్తుందని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ సంచలనాలు నమోదు అవుతాయని ఆయన అన్నారు.   మీన రాశిలో శని, శుక్రుల కలయిక అనేది చాలా డేంజర్. ఈ విపత్తు వల్ల పెద్ద పెద్ద నాయకులు, ప్రముఖులు మరణిస్తారు. ఆర్ధిక మాంద్యం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది’ అని వేణు స్వామి అన్నారు. 
 

55

ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక నెటిజన్లు ఇది చూసి రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే వేణు స్వామి మత్రం కామెంట్లను చూడలేకపోతున్నారో ఏమో.. తన పోస్ట్ లకు కామెంట్ సెక్షన్ ను ఆఫ్ చేస్తున్నారు. ఈ వీడియోకు కూడా ఆయన అదే పని చేశారు. 

Read more Photos on
click me!

Recommended Stories