నాగ చైతన్య, శోభిత జాతకం..మళ్ళీ ఇరుక్కుపోయిన వేణు స్వామి, మ్యాటర్ చాలా దూరం వెళుతోందే !

First Published | Oct 28, 2024, 4:41 PM IST

కాంట్రవర్సీలతో పాపులర్ అయిన జ్యోతిష్యుడు వేణు స్వామి. సెలెబ్రిటీల జాతకం పేరుతో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ హంగామా చేయడం వేణు స్వామి శైలి. దీనివల్ల వేణు స్వామి తీవ్రమైన నెగిటివిటి ఎదుర్కొంటూ వచ్చారు.

కాంట్రవర్సీలతో పాపులర్ అయిన జ్యోతిష్యుడు వేణు స్వామి. సెలెబ్రిటీల జాతకం పేరుతో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ హంగామా చేయడం వేణు స్వామి శైలి. దీనివల్ల వేణు స్వామి తీవ్రమైన నెగిటివిటి ఎదుర్కొంటూ వచ్చారు. తనపై ఎంత ట్రోలింగ్ జరిగినా తాను చెప్పేది వంద శాతం జరుగుతోంది అంటూ తనని తానూ డిఫెండ్ చేసుకున్నారు. 

కానీ ఇటీవల వేణు స్వామి చెప్పిన జాతకాలన్నీ రాంగ్ అయ్యాయి. గత ఎన్నికల ఫలితాలు, కల్కి చిత్ర రిజల్ట్ ఇలా చాలా అంశాల్లో వేణు స్వామి చెప్పిన జాతకం జరగలేదు. ఎన్నికల తర్వాత వేణు స్వామి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. ఇకపై తాను సెలబ్రిటీల జాతకాలు చెప్పనని అన్నారు. కానీ శోభిత, నాగ చైతన్య నిశ్చితార్థం జరిగినప్పుడు బోర్డుపై మరోసారి లెక్కలతో సిద్ధం అయ్యారు. 


నాగ చైతన్య, శోభిత జాతకాలు కలవడం లేదని.. జాతకం ప్రకారం వీళ్లిద్దరికీ బాగాలేదని తెలిపారు. 2027లో నాగ చైతన్య, శోభిత విడిపోతారు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. జాతకాల పేరుతో కొందరిని హింసించే హక్కు ఎక్కడిది అంటూ మహిళా సంఘాలు వేణు స్వామిపై మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశాయి. 

Venu swamy

సెలెబ్రిటీలు అడగకపోయినా వారి జాతకాలు చెబుతూ, నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వారిని హింసకి గురి చేస్తున్నారు అంటూ ఫిర్యాదు వెళ్ళింది. దీనితో వెనుస్వామి ముందు జాగ్రత్తగా హైకోర్టుకి వెళ్లి తనని ఆదేశించే హక్కు మహిళా కమిషన్ కి లేదు అంటూ స్టే పొందారు. తాజాగా హై కోర్టు వేణు స్వామికి ఇచ్చిన స్టేని ఎత్తివేసింది. 

వేణు స్వామిని ప్రశ్నించే, అదే విధంగా చర్యలు తీసుకునే అధికారం మహిళా కమిషన్ కి ఉందని తీర్పు చెప్పింది. వారంరోజుల్లోగా వేణు స్వామి చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ చర్యలు తీసుకోవచ్చని కోర్టు తెలిపింది. దీనితో చైతన్య, శోభిత గురించి వేణు స్వామి చెప్పిన జాతకం ఇప్పుడు అతడి మెడకే చుట్టుకునట్లు అయింది. 

Latest Videos

click me!