రాజీవ్‌ గాంధీని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో గొడవ చేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? పేరెంట్స్ పెద్ద షాక్‌

First Published | Oct 28, 2024, 4:30 PM IST

రాజీవ్‌ గాంధీ.. ఇందిరా గాంధీ వరసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె హత్యకు గురైన అనంతరం ప్రధాని బాధ్యతలు తీసుకున్నారు. ఆయన్ని ఓ స్టార్‌ హీరోయిన్‌ పెళ్లి చేసుకుంటానని గొడవ చేయడం విశేషం. 
 

మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ అప్పట్లో చాలా హ్యాండ్సమ్‌గా ఉండేవారు. ఎంతో మంది అమ్మాయిలకు డ్రీమ్ బాయ్‌లా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇందిరా గాంధీ తనయుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తల్లి మరణం తర్వాత ప్రధాని అయ్యారు. ఐదేళ్లపాటు ప్రధానిగా కొనసాగారు. అనంతరం ఆయన హత్యకు గురయ్యారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

అయితే 40ఏళ్లలోనే ప్రధాని అయ్యారు రాజీవ్‌ గాంధీ. యంగ్‌ పీఎంగా చరిత్ర సృష్టించారు. అప్పట్లో ఆయన చాలా హ్యాండ్సమ్‌గా ఉండేవారు. అందుకే అమ్మాయిల ఫాలోయింగ్‌ చాలా ఉండేది. అయితే ఓ హీరోయిన్‌ కూడా ఆయన్ని ఇష్టపడింది. ఆయన్ని ఎంతగానో ఆరాధించింది. జస్ట్ ఫోటో చూసి ఫిదా అయిపోయింది. పెళ్లి చేసుకుంటే ఆయన్నే చేసుకుంటానని గొడవ చేసిందట. ఇంట్లో పెద్ద రచ్చ అయ్యిందట. రాజీవ్‌ గాంధీ కోసం ఆ హీరోయిన్‌ ఇంత హంగామా చేయడం విశేషం. మరి ఇంతకి ఆమె ఎవరు అనేది చూస్తే. 
 


Raasi

ఆ హీరోయిన్‌ ఎవరో కాదు, రాశీ. టీనేజ్‌లో ఆమె రాజీవ్‌గాంధీని పెళ్లి చేసుకోవాలనుకుందట. పేపర్‌లో రాజీవ్‌గాంధీ ఫోటోని చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నాడో అని చేసుకుంటే ఆయన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట. అయితే ఆయన ప్రధాని అని కూడా ఆమెకి తెలియదట. అంతటి అమాయకత్వం తనదని, రాజీవ్‌ గాంధీని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో గొడవ చేసిందట. పేరెంట్స్ తోనూ ఈ విషయం చెప్పిందట. వాళ్లతో ఎంతో వాదించిందట. అయితే కొన్ని రోజుల తర్వాత ఆమె రియాలిటీలోకి వచ్చిందట. తన అమాయకత్వానికి తానే నవ్వుకుందట. రాజీవ్‌ గాంధీ మాజీ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ భర్త అనే విషయం తెలిసిందే.  

ఒకప్పుడు అందాల రాశీగా వెలిగింది రాశీ. రమ్యకృష్ణ, మీనా, నగ్మా, సౌందర్య, రంభ వంటి కథానాయికల జోరు సాగుతున్న సమయంలోనే రాశీ సినిమాల్లోకి వచ్చింది. ప్రారంభంలో స్ట్రగుల్‌ అయినా ఆ తర్వాత పుంజుకుంది. స్టార్‌ హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది. అయితే చిరంజీవి, బాలయ్య, నాగ్‌, వెంకీలతో కంటే ఆ తర్వాత రేంజ్‌ హీరోలు జగపతిబాబు, శ్రీకాంత్‌ వంటి హీరోలతో ఆమె బాగా సినిమాలు చేసింది. పవన్‌ కళ్యాణ్‌తోనూ ఆమె సినిమా చేయడం విశేషం.

బాలనటిగా కెరీర్‌ని ప్రారంభించింది రాశీ. `పెళ్లిపందిరి` సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. `శుభాకాంక్షలు` మూవీ ఆమె బిగ్‌ బ్రేక్‌ ఇచ్చింది. ఇలా వరుసగా మూవీస్‌ చేసి. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే టీనేజ్‌లో రాశీ మ్యారేజ్‌ లైఫ్‌పై ఎంతో ఫాంటసీతో ఉండేదట. స్కూల్‌లో పెద్దయ్యాక ఏమవుతావంటే తాను హౌజ్‌ వైఫ్‌ అవుతానని చెప్పిందట. పెళ్లిపై అంతటి ఇంట్రెస్ట్‌ ఉండేదట.

అంతేకాదు పెద్దాయ్యక కూడా తాను అలానే ఉండేదట. స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే ఇంట్లో సంబంధాలు చూస్తుంటే తనకు నచ్చడం లేదట. తాను ఎలాంటి వాడిని చేసుకోవాలో తాను నిర్ణయించుకుందట. ఓ సీనియర్‌ దర్శకుడితోనూ ఈ విషయాలు డిస్కస్‌ చేసిందట. తనకు మ్యారేజ్‌ చేసుకోవాలనిపిస్తుందని, ఎవరైనా మంచి అబ్బాయిని చూడాలని చెప్పిందట రాశీ.

కానీ ఇంతలోనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌  శ్రీముని‌ కనెక్ట్ అయ్యాడు. ఆయన రాశీకి సీన్లు, డైలాగులు వివరించేవాడట. ఆమె అందానికి ఫిదా అయిన ఆయన కావాలనే ఆమెతో టైమ్‌ స్పెండ్‌ చేయడం కోసం డైలాగ్‌లు అంటూ వచ్చేవాడట. లిప్‌ మూమెంట్‌, డైలాగ్‌లు అంటూ ఆమెతో మాట్లాడేవాడట. ఈ క్రమంలో శ్రీ ముని మాటలకు ఆమె పడిపోయిందట. ఎప్పుడు పడిపోయానో తనకే తెలియదని, కానీ తానే పెళ్లి చేసుకుంటావా? అని ప్రపోజ్‌ చేసిందట.

అప్పటికే మనసులో ప్రేమని నింపుకున్న శ్రీముని మరో మాట లేకుండా ఓకే చేశాడట. అయితే వెంటనే ఓకే చేయకుండా కొంత గ్యాప్‌ ఇచ్చి చెప్పాడట. అలా 2005లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ని లీడ్‌ చేస్తూనే మళ్లీ నటిగా కొనసాగుతుంది రాశీ. ఇటు సినిమాలు, అటు సీనియల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. విభిన్నమైన పాత్రలు చేయాలనుకుంటున్నట్టు తెలిపింది. 

read more: రంభ అసలు పేరేంటో తెలుసా? ఎలా మారిందంటే? పాపం చిన్న పిల్లని చేసి ఆడుకున్నారట

also read: ప్రభాస్‌ బావ అని పిలిచే హీరో ఎవరో తెలుసా? ఆ స్టార్‌ హీరోయినే కారణమా?
 

Latest Videos

click me!