విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ.. పవన్‌కల్యాణ్‌ ఏమన్నారంటే..

First Published | Oct 28, 2024, 3:15 PM IST

నటుడు విజయ్ తమిళనాడులో తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK) తరపున తొలి బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు భారీగా జనం తరలిరావడం, విజయ్ రాజకీయ ఎంట్రీపై పవన్ కల్యాణ్ స్పందించడం వంటివి జరిగాయి.

Vijay, pawan kalyan, og, rrr

సొంత పార్టీ తమిళగ వెట్రి కజగం( TVK)ని తమిళ స్టార్ హీరో విజయ్ స్దాపించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో విజయ్ తొలిసారి రాష్ట్రస్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తమిళనాడు లోని విల్లుపురం జిల్లాలో జరిగిన ఈ సభకు జనం భారీఎత్తున తరలివచ్చారు.

దాదాపు 8 లక్షలకు పైగా జనం వచ్చి ఉంటారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సభకు తరలి వచ్చిన జనాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో విజయ్ రాజకీయ ఎంట్రీపై పవన్ కళ్యాణ్ స్పందించారు.

Vijay, pawan kalyan, og, rrr


విజయ్ మాట్లాడుతూ...‘‘నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు. కానీ, నేను పాలిటిక్స్‌ విషయంలో భయపడడం లేదు’’ అని నటుడు విజయ్‌ (Vijay) అన్నారు. సినీ రంగంతో పోలిస్తే రాజకీయ రంగం చాలా సీరియస్‌ అని పేర్కొన్నారు.

విల్లుపురం సమీపంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) పార్టీ మొదటి మహానాడులో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలతోపాటు వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సభకు వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. 
 


Vijay, pawan kalyan, og, rrr


  విజయ్‌ (Vijay) పొలిటికల్‌ ఎంట్రీపై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) స్పందించారు. అభినందనలు తెలుపుతూ తాజాగా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ‘‘ఎంతోమంది సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నటుడు విజయ్‌కు నా హృదయపూర్వక అభినందనలు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

pawan kalyan, martial arts, chiranjeevi, power star


 తన పొలిటికల్‌ ఎంట్రీని ఉద్దేశించి ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడిగా విజయ్‌ తమ పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాలను ప్రకటించారు. ‘‘ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తాం.  తమిళనాడు గడ్డకు ఇవి రెండు కళ్లులాంటివి. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా భావజాలం. వాటి ఆధారంగానే పని చేస్తాం.

పెరియార్‌ ఈవీ రామస్వామి, కె.కామరాజ్‌, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, వేలు నాచియార్‌, అంజలి అమ్మాళ్‌ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తాం. రాజకీయాల్లో ఫెయిల్యూర్స్‌, సక్సెస్‌ స్టోరీలు చదివాక.. నేను నా కెరీర్‌ని పీక్‌లో వదిలేసి మీ అందరిపై అచంచలమైన విశ్వాసాన్ని ఉంచి మీ విజయ్‌గా ఇక్కడ నిలబడ్డా. రాజకీయ అనుభవం లేదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ అమితమైన ఆత్మవిశ్వాసంతో మనం సర్పం (రాజకీయం)తో ఆడుకునే పిల్లల్లాంటివాళ్లం’’ అన్నారు.

Pawan Kalyan, Legal Complaint, Tamilnadu


అలాగే ‘సినిమా కెరీర్‌లో అత్యున్నత స్థాయిని వదిలేసి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చా. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా నన్ను అవమానించారు. అయినా, కఠోర శ్రమ, ధైర్యంతో ఈ స్థాయికి చేరుకున్నా. ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌ సైతం ఇదే విధమైన విమర్శలను ఎదుర్కొన్నారు.

కానీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వారు ప్రభంజనం సృష్టించారు. ప్రతి ఓటు ఎంతో శక్తిమంతమైనది.. మా పార్టీ తమిళనాడు రాజకీయాలపై బలమైన ప్రభావం చూపుతుంది’’ అన్నారు. పొత్తులపై మాట్లాడుతూ.. ‘‘రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని పూర్తిస్థాయి మెజార్టీతో గెలిపిస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఒకవేళ ఏవైనా పార్టీలు పొత్తు పెట్టుకోవాలనుకుంటే.. వారికి అధికారంలో భాగస్వాముల్ని చేస్తాం’’ అన్నారు.

Latest Videos

click me!