Bigg Boss Telugu 8: నోటి దురదతో వేణుస్వామి బంపర్‌ ఆఫర్‌ మిస్సింగ్‌.. లేదంటే హౌజ్‌లో రచ్చ వేరే లెవల్‌ ?

First Published | Aug 30, 2024, 10:59 PM IST

ప్రముఖ సెలబ్రిటీ  జ్యోతిష్యుడు వేణు స్వామి వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. నోటి  దురుసు కారణంగా బిగ్‌ ఆఫర్‌ని మిస్‌  చేసుకున్నాడు. 
 

Bigg Boss telugu season 8

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 8కి సంబంధించి  రంగం సిద్ధమైంది. రేపటి నుంచే కౌంట్‌ డౌన్‌ ప్రారంభమవుతుంది. నాగార్జున  వ్యాఖ్యాతగా చేస్తున్న ఈ షో ఆదివారం (సెప్టెంబర్‌ 1) సాయంత్రం 7 గంటల నుంచి ఈ గ్రాండ్‌ ఓపెనింగ్‌ కార్యక్రమం జరగబోతుంది. సెలబ్రిటీల డాన్స్ లు, కంటెస్టెంట్ల పరిచయాలు, గెస్ట్ సెలబ్రిటీల సందడితో ఈ బిగ్‌ బాస్‌ షో ప్రారంభం కాబోతుంది. దీంతో బిగ్‌ బాస్‌ ప్రియులు దీని కోసం వెయిట్‌ చేస్తున్నారు. వెయ్యి కళ్లతో ఆదివారం  సాయంత్రం  కోసం  వెయిట్‌ చేస్తుండటం విశేషం. 

Bigg boss telugu 8

సుమారు  20 మందితో ఈ సీజన్‌ ప్రారంభం కాబోతుందట. అయితే మొదట్లో దాదాపు 14 మందిని పరిచయం చేయబోతున్నారని సమాచారం. మధ్యలో మరోసారి మినీ ఈవెంట్‌ ఏర్పాటు చేసి మిగిలిన కంటెస్టెంట్లని పరిచయం చేస్తారని టాక్‌. ఇలా మొత్తం 20 నుంచి 22 వరకు కంటెస్టెంట్లని ఈ సారి హౌజ్‌లోకి తీసుకురాబోతున్నారట. ఈ సారి వస్తోన్న వారిలో రీతూ చౌదరి, విష్ణు ప్రియా, మై విలేజ్‌ షో అనిల్‌, కాకినాడ పిల్ల, యాదమ్మ రాజు, జబర్దస్త్ కమెడియన్ పవిత్ర, నటుడు ఆదిత్య ఓం, నటి సన, సీరియల్ హీరోయిన్స్ తేజస్విని గౌడ, యాష్మి గౌడ అలాగే ఇంద్రనీల్, నిఖిల్ ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట. 


అలాగే బెజవాడ బేబక్క, అంజలి పవన్, యాంకర్ సీత, సింగర్ సాకేత్, బంచిక్ బబ్లుతోపాటు పలువురి పేర్లు బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లో వినిపిస్తున్నాయి. వీరితోపాటు ఓటీటీ బిగ్‌ బాస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లు కూడా ఈ సారి షోలో పాల్గొంటారని తెలుస్తుంది. అయితే వీరితోపాటు ఆ మధ్య ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఈ సారి వేణు వేణుస్వామి వస్తాడనే ప్రచారం గట్టిగా జరిగింది. దీంతో ఓ స్పెషల్‌ ఇంట్రెస్ట్ అందరిలోనూ నెలకొంది. అందరి జాతకాలు చెప్పే వేణు స్వామి బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఎలా ఉంటాడు, ఎలా ఎంటర్‌టైన్‌ చేస్తాడనేది క్యూరియాసిటీ క్రియేట్‌ చేసింది. ఆయన రావడం కూడా పక్కా అన్నట్టుగానే సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. 
 

photo credit mana star

కానీ వేణు స్వామి ఓవరాక్షన్‌ ఇప్పుడు ఆయనకు అసలుకే మోసం వచ్చింది. ఆయన నోటి దురుసు కారణంగా ఆయనకు దారుణంగా దెబ్బ పడింది. తనని తాను ఎలివేట్‌ చేసుకునే మంచి వేదికని మిస్‌ చేసుకున్నాడు వేణుస్వామి. ఆయన నాగచైతన్య పెళ్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది. శోభితాతో పెళ్లి ఎక్కువ కాలం నిలవదు అని, విడిపోతారంటూ సంచలన వ్యాఖ్యలను చేశారు. దీంతో  ఆయన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అంతా ఆయన్ని వ్యతిరేకించారు. జర్నలిస్ట్ అసోసియేషన్‌ ఏకంగా మహిళా కమీషన్‌కి ఫిర్యాదు కూడా చేసింది. ఇది కాస్త  వివాదం మరింత  పీక్‌కి వెళ్లింది.
 

Bigg boss telugu 8

ఈ దెబ్బతో నాగ్‌కి మండింది. బిగ్‌ బాస్‌ టీమ్‌ సీరియస్‌గా తీసుకుంది. వేణు స్వామికి మంగళం పాడారు. ఆదిలోనే ఆయన్ని పక్కన పెట్టారని తెలుస్తుంది. ఇలా తన వరకు వచ్చిన మంచిఅవకాశాన్ని వేణుస్వామి మిస్‌ చేసుకున్నాడు. ఓ మంచి వేదికని కోల్పోయాడు. తనని తాను బాగా ప్రొజెక్ట్ చేసుకునే ఛాన్స్ ని మిస్‌ చేసుకున్నాడు. బిగ్‌ బాస్‌ షోకి వస్తే, రెండు తెలుగు రాష్ట్రాల ఫ్యామిలీ  ఆడియెన్స్ కి వేణుస్వామి రీచ్‌ అయ్యేవాడు. ఆయన గురించి ఇంకా బాగా తెలిసేది. ఆయన మరింతగా  పాపులర్‌  అయ్యేవాడు. కానీ ఇప్పుడు వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఆయన బిజినెస్‌ దెబ్బతిన్నది. ఆయన ప్రతిష్ట దెబ్బతిన్నది. మొదటికే మోసం వచ్చింది. ఈ దెబ్బతో వేణు స్వామి కెరీర్‌ పరంగా చాలా వరకు డౌన్‌ అయ్యే పరిస్థితి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం  ఆయన  నోటిదురుసు ఇప్పుడు  ఆయన కొంప ముంచిది. వివాదానికి కారణంగా మారింది. కెరీర్‌కే  దెబ్బ పడే  పరిస్థితి వచ్చింది. మరి దీన్ని ఆయన ఎలా డీల్‌ చేస్తాడో చూడాలి. 

Latest Videos

click me!