Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్లోకి ఆ కాంట్రవర్సీ లేడీ... మళ్ళీ రచ్చేనా!

బిగ్ బాస్ షోలోకి ఓ కాంట్రవర్సీ లేడీ ఎంట్రీ ఇస్తుందన్న వార్త కాక రేపుతోంది. గతంలో ఆమె హౌస్లో రచ్చ చేసింది. మరి ఆమె ఎవరో చూద్దాం.. 
 

Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ ని పరిచయం చేయనున్నాడు. ఇక హౌస్లోకి వెళ్ళేది వీరే అంటూ అనేక మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో నిజంగా ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు అనేది సస్పెన్స్. 

Bigg boss telugu 8

బిగ్ బాస్ నిబంధనల ప్రకారం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ముగిసే వరకు కంటెస్టెంట్స్ పేర్లు బయటకు రాకూడదు. ఫస్ట్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా పరిచయం చేస్తాడు. అయితే అధికారిక ప్రకటనకు ముందే కంటెస్టెంట్స్ పేర్లు లీక్ అవుతున్నాయి. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. యాదమ్మ రాజు, జబర్దస్త్ కమెడియన్ పవిత్ర, నటుడు ఆదిత్య ఓం, నటి సన, సీరియల్ హీరోయిన్స్ తేజస్విని గౌడ, యాష్మి గౌడ అలాగే ఇంద్రనీల్, నిఖిల్ ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట. 


బెజవాడ బేబక్క, అంజలి పవన్, యాంకర్ సీత, సింగర్ సాకేత్, బంచిక్ బబ్లు తో పాటు పలువురి పేర్లు బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లో వినిపిస్తున్నాయి. అనూహ్యంగా మాజీ కంటెస్టెంట్స్ సైతం ఎంట్రీ ఇస్తున్నారు అనేది తాజా న్యూస్. గత ఎనిమిది సీజన్స్లో(బిగ్ బాస్ ఓటీటీ కూడా కలుపుకుని) పాల్గొన్న మాజీ కంటెస్టెంట్స్ నుండి కొందరు బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేయనున్నారట. 

శోభా శెట్టి, హరితేజ, యాంకర్ శివ, పునర్నవి మరోసారి బిగ్ బాస్ హౌస్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది. వీరిలో శోభా శెట్టి పేరు ఆసక్తి రేపుతోంది. సీజన్ 7లో పాల్గొన్న శోభా శెట్టి ఎంత రచ్చ చేసిందో తెలిసిందే. ఆమె యాటిట్యూడ్, బిహేవియర్ వివాదాస్పదం అయ్యింది. శోభా శెట్టి ఓటమిని అంగీకరించేది కాదు. ఇతర కంటెస్టెంట్స్ పై తీవ్ర స్థాయిలో మాటల దాడి చేసేది. శోభా శెట్టి గేమ్ ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. ఆమెను ఎలిమినేట్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపించేవి. 
 

Bigg boss telugu 8

కాగా శోభా శెట్టి 14వ వారం వరకు హౌస్లో ఉంది. స్టార్ మా ఆమెను కాపాడింది. తక్కువ ఓట్లు పడినా ఎలిమినేట్ చేయలేదనే వాదన వినిపించింది. ఎలిమినేట్ అయ్యాక శోభ శెట్టి ర్యాలీ చేసింది. ఈ క్రమంలో ఆమెను నేరుగా కొందరు ట్రోల్ చేశారు. ఎప్పుడో బయటకు రావాల్సింది అంటూ కేకలు వేశారు. బయటకు వచ్చాక తనపై ఏ స్థాయిలో నెగిటివిటీ పెరిగిందో తెలుసుకున్న శోభ శెట్టి క్షమాపణలు చెప్పింది. అంతా గేమ్ లో భాగమే. ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించాలని ఆమె కోరారు. తనపై ఇంత వ్యతిరేకత రాగా శోభా శెట్టి మరోసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళతారని వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి. 

ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియదు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ వరకు ఆగాల్సిందే. ఇక వరుసగా ఆరోసారి నాగార్జున బిగ్ బాస్ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సీజన్ 3 నుండి నాగార్జున కొనసాగుతున్నారు. ఆయన సారథ్యంలో బిగ్ బాస్ తెలుగు సక్సెస్ఫుల్ గా సాగిపోతుంది. 2017లో బిగ్ బాస్ తెలుగులో ఆరంభమైంది. ఫస్ట్ సీజన్ కి హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు. తనదైన శైలిలో హోస్టింగ్ చేసి సీజన్ 1 సక్సెస్ చేశాడు. నటుడిగా బిజీ అయిన ఎన్టీఆర్ బిగ్ బాస్ నుండి తప్పుకున్నాడు. సీజన్ కి నాని హోస్టింగ్ చేశాడు. అతడి హోస్టింగ్ కి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది. దాంతో నాని తప్పుకున్నాడు. 

Latest Videos

click me!