`బిగ్‌బాస్‌` కంటెస్టెంట్లకి ఎంత రెమ్యూనరేషన్స్ ఇస్తారో తెలుసా?.. అత్యధికంగా ఎంతంటే?

First Published | Aug 30, 2024, 7:55 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. మరి కంటెస్టెంట్లకి ఎంత పారితోషికాలు ఇస్తారో తెలుసా? నిజంగా ఇది షాకింగ్‌  విషయమే.
 

Bigg Boss Telugu 8 Logo

 బిగ్‌బాస్‌ బాగా పాపులర్‌ అయిన రియాలిటీ షో. ఇండియాలో అత్యంత ప్రజాధరణ పొందుతున్న షో కూడా ఇదే. హిందీలో ప్రారంభమైన ఈ షో ఇప్పుడు దాదాపు నాలుగైదు భాషల్లో రన్‌ అవుతూ అత్యంత ఆదరణ పొందుతున్న షోగా నిలుస్తుంది. ప్రస్తుతం రియాలిటీ షోస్‌లో ఇదే టాప్‌ లో ఉంది. షో నడిచేది మూడు నెలలే అయినా, దీని గురించిన చర్చ కొన్ని రోజులపాటు జరుగుతుంది. అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు ఇండియాలో ఎక్కువగా ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే షోగా మారింది. అంతేకాదు వివాదంగానూ మారుతుంది. 

Bigg Boss House

దాదాపు ఏడాది మొత్తం ఈ షో గురించే సోషల్‌ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఏదో రకంగా ప్రతి రోజు బిగ్‌ బాస్‌ అనే పదం వినిపిస్తూనే ఉంటుంది. ఇదిలా ఉంటే గత ఎనిమిదేళ్లుగా ఈ షో రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. పలు వివాదాలు, పలు సెన్సేషన్స్ మధ్య ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ ప్రారంభం కాబోతుంది. మరో రెండు రోజులు అసలు రచ్చ షురూ కానుంది. ఇప్పటికే హంగామా ప్రారంభమైంది. టీజర్లతో రచ్చ చేస్తుంది బిగ్‌ బాస్‌ టీమ్‌. గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తుంది. 
 


Bigg Boss Telugu 8 Contestants list

ఈ సారి క్రేజీ కంటెస్టెంట్లు హౌజ్‌లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. యాదమ్మ రాజు, జబర్దస్త్ కమెడియన్ పవిత్ర, నటుడు ఆదిత్య ఓం, నటి సన, సీరియల్ హీరోయిన్స్ తేజస్విని గౌడ, యాష్మి గౌడ అలాగే ఇంద్రనీల్, నిఖిల్ ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట. అలాగే బెజవాడ బేబక్క, అంజలి పవన్, యాంకర్ సీత, సింగర్ సాకేత్, బంచిక్ బబ్లుతోపాటు పలువురి పేర్లు బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లో వినిపిస్తున్నాయి. వీరితోపాటు ఓటీటీ బిగ్‌ బాస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లు కూడా ఈ సారి షోలో పాల్గొంటారని తెలుస్తుంది. 

Bigg boss telugu 8

నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ బిగ్‌ బాస్‌ షోలో సినిమా, టీవీ, యూట్యూబ్‌, సోషల్‌ మీడియాలో పాపులర్‌  అయిన ఆర్టిస్ట్ లను కంటెస్టెంట్లుగా తీసుకువస్తుంటారు. ఇందులో కొందరు పెద్దగా క్రేజ్‌ లేని వాళ్లు కూడా ఉంటారు. కొంత మంది అంతో ఇంతో గుర్తింపు ఉన్న వాళ్లు ఉంటాయి. సింగర్లు, కొరియోగ్రాఫర్లు, యాంకర్లు, కమెడియన్లు ఇలా విభిన్న విభాగాల్లో పనిచేసే సెలబ్రిటీలను కంటెస్టెంట్లుగా తీసుకుంటారు. 
 

Bigg boss telugu 8

అయితే  వీరి పారితోషికాలు ఎలా ఉంటాయనేది  ఆసక్తికరం. ఒక్కో  కంటెస్టెంట్‌కి ఎంత ఇస్తారనేది అందరిలోనూ క్యూరియాసిటీ  ఉంటుంది. అయితే దీనికి సంబంధించి అన్నీ రహస్యంగానే ఉంటాయి. ఎవరూ బయటకు చెప్పడానికి లేదు. కానీ ఏదో రూపంలో లీక్‌ అవుతుంటాయి. సన్నిహితుల ద్వారా పంచుకున్న విషయాలను బట్టి  కొన్ని బయటకు వస్తుంటాయి.  ఈ క్రమంలో మరి ఒక్కో కంటెస్టెంట్‌కి ఎంత పారితోషికం ఇస్తారనేది ఎప్పుడూ పెద్ద హాట్‌  టాపిక్‌ అవుతుంటుంది. 

Bigg boss telugu 8

లీక్‌ సమాచారం మేరకు ఒక్కో కంటెస్టెంట్ కి తక్కువలో తక్కువ 15వేలు రోజుకి ఇస్తారు. ఎక్కువగా అంటే 40 వేల వరకు ఉంటాయి.  మహా అయితే, రేర్‌ కేసులో మాత్రమే 50వేలు ఇస్తారు.  చాలా మోస్ట్ క్రేజీ, పాపులర్‌  సెలబ్రిటీకి  మాత్రమే అంత అమౌంట్‌ని రోజువారి  పారితోషికంగా అందిస్తారు. యూట్యూబ్‌ ఉండేవారికి, పెద్దగా పాపులారిటీ లేని వారికి  15-20వేల వరకు ఇస్తారు. కొంత గుర్తింపు ఉన్న వారికి 20-25 వరకు ఇస్తారు. బాగా వార్తల్లో ఉండే వ్యక్తి, సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ ఉన్న వారికి 25-30 వేల వకు ఉంటుంది. ఇక ఈ కంటెస్టెంట్‌ ఉంటే  షోకి ఊపు వస్తుంది. జనాలు బాగా చూస్తారనుకునే వారికి 30-35 వరకు ఇస్తుంటారు. రేర్‌ సెలబ్రిటీలకు మాత్రమే 40వేల వరకు పారితోషికం అందిస్తారని తెలుస్తుంది. మరి ఇందులోనిజమెంతా  అనేది తెలియాల్సి  ఉంది. బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ ఈ ఆదివారం(సెప్టెంబర్‌ 1) సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. 
 

Latest Videos

click me!