చైతు, శోభిత విషయంలో ప్లేటు తిప్పేశాడుగా.. దుమ్మెత్తిపోస్తున్నారు 

First Published | Aug 12, 2024, 6:22 PM IST

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి తరచుగా ఏదో ఒక వివాదంలో వైరల్ అవుతూనే ఉంటారు. సెలెబ్రిటీల జాతకాలు, రాజకీయ నాయకుల జాతకాలు, ఎలక్షన్ రిజల్ట్స్ గురించి తనదైన శైలిలో వేణు స్వామి బోల్డ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు.

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి తరచుగా ఏదో ఒక వివాదంలో వైరల్ అవుతూనే ఉంటారు. సెలెబ్రిటీల జాతకాలు, రాజకీయ నాయకుల జాతకాలు, ఎలక్షన్ రిజల్ట్స్ గురించి తనదైన శైలిలో వేణు స్వామి బోల్డ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో వేణు స్వామి చెప్పిన జాతకం బెడిసికొట్టింది. 

2024 ఏపీ ఎన్నికల్లో వైసిపి గెలుస్తుందని వేణు స్వామి చెప్పగా.. ఆ పార్టీ కేవలం 11 సీట్లకి మాత్రమే పరిమితం అయింది. దీనితో వేణు స్వామి తాను ఇక సెలెబ్రిటీ జాతకాలకు దూరంగా ఉంటానని చెప్పారు. అయితే ఇటీవ నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం చేసుకున్నారు. 


వెంటనే వేణు స్వామి వీరిద్దరి జాతకంపై విశ్లేషణ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య, శోభిత 2027లో విడిపోతారు అంటూ వేణు స్వామి తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది కూడా వీళ్ళిద్దరూ ఒక అమ్మాయి వల్ల విడిపోతారని పేర్కొన్నారు. 

శోభిత, నాగ చైతన్య జాతకం కంటే.. సమంత, నాగ చైతన్య జాతకమే బెటర్ గా ఉందని అన్నారు. అలాంటి చైతు, సమంతనే విడిపోయారు. ఇప్పుడు శోభిత, చైతు జాతకం అంతకంటే దారుణంగా ఉంది. వీళ్ళిద్దరూ విడిపోవడం ఖాయం అని చెప్పారు. దీనితో వేణు స్వామిపై ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చెలరేగింది. శుభమా అని పెళ్లి కి రెడీ అవుతుంటే.. ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు ఏంటి అంటూ అంతా వేణు స్వామిని దుమ్మెత్తిపోస్తున్నారు. 

వేణు స్వామి చేసిన వ్యాఖ్యలపై వివాదం మరింతగా ఎక్కువ అవుతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వేణుస్వామిని ఉతికేస్తున్నారు. ఇక మా అధ్యక్షుడు మంచు విష్ణు రంగంలోకి దిగారు. వేణు స్వామితో అయన మాట్లాడారు. ఈ విషయాన్ని వేణు స్వామి స్వయంగా తెలిపారు. వివాదం ఎక్కువ అవుతుండడంతో వేణు స్వామి ప్లేటు తిప్పేశారు. 

వేణు స్వామి సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ. శోభిత, నాగ చైతన్య జాతకం పై నేను చేసిన వ్యాఖ్యలకు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. నేను ఆ జాతకం చెప్పడానికి కారణం.. అంతకు ముందు సమంత, చైతు జాతకం చెప్పాను. అది నిజమైంది. దానికి కొనసాగింపుగానే ఈ జాతకం చెప్పాను. సెలెబ్రిటీల జాతకాల జోలికి ఇక పోనని నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. కేవలం కొనసాగింపుగానే ఈ జాతకం చెప్పాను. ఇకపై ఏ సెలెబ్రిటీ జాతకం కూడా చెప్పను. మంచు విష్ణు నాతో మాట్లాడారు అని వేణు స్వామి తెలిపారు. 

Latest Videos

click me!