కల్కి తర్వాత ఇప్పుడు అందరి దృష్టీ దేవరపైనే ఉంది. 'దేవర' మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుండటంతో బిజినెస్ కూడా క్లోజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రమోషన్ మెటీరియల్ జనాల్లోకి బాగా వెళ్లటంతో అదిరిపోయే రేంజిలో బిజినెస్ జరుగుతోంది. కోపంతో చూస్తూ ఉన్న ఎన్టీఆర్ లుక్ బిజినెస్ కు కారణమవుతోంది. యాక్షన్ మామూలుగా ఉండదని , అరాచకం అని కొరటాల ఎలాగైనా ఇండస్ట్రీ మారుమ్రోగే స్దాయిలో హిట్ కొట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ భారీగా జరిగింది.