వేణు స్వామి కి మంచు విష్ణు ఫోన్, చైతూ జాతకం ఎందుకు చెప్పారో వివరణ

First Published | Aug 12, 2024, 5:24 PM IST

. సమంత, నాగచైతన్యలు వివాహిక జీవితం అంత సాఫీగా సాగదని .. మెగా డాటర్ నిహారిక కూడా విడాకులు తీసుకుంటుందని ముందే చెప్పి సంచలనం సృష్టించిన ఆయన రీసెంట్ గా చైతూ నిశ్చితార్దం పైనా కామెంట్స్ చేసారు.
 

Naga Chaitanya and Sobhita Dhulipala Venu swamy


 అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ విషయం అంతటా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వారి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అభిమానులు వీరి వైవాహిక జీవితం బాగుండాలని శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. మరోవైపు.. నాగ చైతన్య, సమంతల జాతకం చెప్పిన వివాదాస్పద సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ కొత్త జంటపైనా సంచలన కామెంట్స్ చేశారు. నాగచైతన్, శోభిత వైవాహిక జీవితం ఎలా ఉండనుంది అనే అంశంపై ఓ వీడియో రిలీజ్ చేశారు. అయితే దీనిపై తీవ్రమైన వ్యతిరేకత రావటంతో ఆయన మరో వీడియో రిలీజ్ చేసారు. 


సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులారిటీ ఉంది.  ఆయన గతంలో చెప్పినవి  కొన్ని  చెప్పినట్టుగా జరగడం కలిసొచ్చింది. అయితే కొన్ని ప్రిడక్షన్స్ బాగా బండ్లర్ అని తేలాయి. ఈ క్రమంలో  వేణు స్వామిని ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగిపోయింది. సమంత, నాగచైతన్యలు వివాహిక జీవితం అంత సాఫీగా సాగదని .. మెగా డాటర్ నిహారిక కూడా విడాకులు తీసుకుంటుందని ముందే చెప్పి సంచలనం సృష్టించిన ఆయన రీసెంట్ గా చైతూ నిశ్చితార్దం పైనా కామెంట్స్ చేసారు.
 



మూడేళ్ల తర్వాత అంటే 2027లో చై, శోభితలు  విడిపోతారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వేణు స్వామి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. . ఓ మహిళ కారణంగా వీరు విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని వేణు స్వామి తెలిపారు. వీరు పెట్టుకున్న ఎంగేజ్మెంట్‌కు ముహూర్తం బలం, అలాగే జాతకం వీళ్లకు అనుకూలంగా లేవని వేణు స్వామి తేల్చేశారు. అయితే అందరూ వేణు స్వామిని తిట్టిపోస్తూండటంతో పోలీస్ స్టేషన్ లో కూడా ఆయనపై  కంప్లైంట్ ఫైల్ అయ్యింది.  
 

Inaya Sulthana


ఈ క్రమంలో  వేణు స్వామి తాజాగా ఓ వీడియోని షేర్ చేశాడు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ జాతకాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో అనే విషయం మీద వివరణ ఇచ్చాడు. సమంత నాగ చైతన్య జాతకం చెప్పానని, దానికి కంటిన్యూగానే ఇది చెప్పానని అంతే గానీ వేరే ఉద్దేశం లేదని అన్నాడు. తాను ఇది వరకు చెప్పినట్టుగా సెలెబ్రిటీలు, పొలిటికల్ వ్యక్తుల జాతకాలు చెప్పనని అన్నాడు. ఈ విషయం మీద మంచు విష్ణు కూడా ఫోన్ చేశారని, ఆయనకు కూడా అదే విషయం చెప్పానని అన్నాడు. 
 

Venu Swamy


 అక్కినేని నాగచైతన్య రెండో వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటి శోభిత ధూళిపాళతో  నాగార్జున నివాసంలో ఈ జంటకు సింపుల్​గా ఎంగేజ్​మెంట్ జరిగింది. ఈ విషయాన్ని చైతన్య  తండ్రి, హీరో అక్కినేని నాగార్జున ధ్రువీకరిస్తూ, శోభితను ఎంతో సంతోషంగా తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. "చైతన్య, శోభితలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రోజు అనంతమైన ప్రేమకు ఆరంభం" అంటూ చైతన్య, శోభిత నిశ్చితార్థం ఫొటోలను ఎక్స్ లో పంచుకున్న నాగార్జున వారిద్దరు జీవితాంతం ప్రేమగా, సంతోషంగా కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
  

photo credit mana star

నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం విషయంలో తాము సంతోషంగా ఉన్నామని హీరో నాగార్జున తెలిపారు. విడాకుల అనంతరం చైతన్య చాలా బాధపడ్డారని వివరించారు. తన బాధను ఎవరితోనూ పంచుకోలేదని వెల్లడించారు. చైతూ సంతోషంగా ఉండటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పారు. పెళ్లికి కాస్త సమయం తీసుకుంటామని నాగార్జున వెల్లడించారు.
 

 జ్యోతిష్యుడు వేణు స్వామి ఇటీవల వార్తల్లో నిలుస్తున్నారు. సినీ ప్రముఖుల జీవితాలు, మ్యారేజ్‌ లైఫ్‌, సినీ కెరీర్‌కి సంబంధించి జ్యోతిష్యం చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. సమంత మ్యారేజ్‌ విషయంలో ఆయన ముందు చెప్పినట్టుగానే జరగడంతో ఇప్పుడు ఆయన చెప్పే విషయాలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన సమంత, పూజా హెగ్డే, రష్మిక మందన్నా, నయనతార, అనుష్క జీవితాలకు సంబంధించి ఆయన చెప్పిన జ్యోస్యం ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. చర్చనీయాంశంగా మారింది. కొత్తగా నాగచైతన్య, శోభిత మ్యాటర్ ద్వారా మరోసారి పాపులర్ అయ్యారు. 

Latest Videos

click me!