నాగ చైతన్య చేసిన అన్యాయానికి సమంత వేయబోయే జీవితకాల శిక్ష ఏమిటో తెలుసా! అనూహ్య నిర్ణయం!

First Published | Aug 12, 2024, 4:42 PM IST

నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. నాగ చైతన్య చేసిన పనికి అతడు జీవితాంతం పశ్చాత్తాప పడేలా సమంత ఓ శిక్ష వేయనుందట. 
 


నాగ చైతన్య-సమంత విడిపోవడం ఒకెత్తు అయితే... దాని చుట్టూ జరిగిన ప్రచారం మరో ఎత్తు. 2017లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట మధ్య 2021లో మనస్పర్థలు తలెత్తాయి. అదే ఏడాది అక్టోబర్ నెలలో విడాకుల ప్రకటన చేశారు. పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా సందేశంలో పేర్కొన్నారు. 

విడాకుల తర్వాత సమంత అందరి టార్గెట్ అయ్యింది. ఆమెపై అనేక ఆరోపణలు చేశారు. సమంతకు పిల్లల్ని కనడం ఇష్టం లేదు. అబార్షన్ చేయించుకుంది. పెళ్లయ్యాక కూడా బోల్డ్ సీన్స్ చేస్తుంది. కుటుంబ విలువలు పాటించడం లేదు. తన పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతం జుకల్కర్ తో ఎఫైర్ పెట్టుకుంది... అనేవి సమంత మీద వచ్చిన ప్రధాన ఆరోపణలు. 


నాగ చైతన్యను ఉద్దేశించి ఒక్క నెగిటివ్ కథనం రాకపోవడం విశేషం. విడాకుల బాధ ఒకవైపు నిరాధార ఆరోపణలు మరొకవైపు సమంతను కృంగదీశాయి. కొన్ని మీడియా ఛానల్స్ మీద ఆమె చర్యలు తీసుకున్నారు. వేదన నుండి బయటపడేందుకు ఆధ్యాత్మిక మార్గం ఎంచుకున్నారు. సమంత అనేక పుణ్యక్షేత్రాలు సందర్శించింది.

కట్ చేస్తే విడాకులైన మూడేళ్లలో నాగ చైతన్య మరొక హీరోయిన్ తో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇది సమంతతో పాటు ఆమె అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తుంది. అసలు విడాకుల విషయంలో నాగ చైతన్యదే తప్పు. సమంత విడాకులు ఇవ్వడానికి శోభిత ధూళిపాళ్లతో ఎఫైర్ నే కారణం అనే వాదన కూడా తెరపైకి వచ్చింది. విడాకులు ప్రకటించిన ఏడాదిలోపే నాగ చైతన్య-శోభిత రిలేషన్ లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. 
 


సమంత గతంలో కూడా నాగ చైతన్య మీద తన అసహనాన్ని ప్రదర్శించింది. తమ రిలేషన్ లో ఆమె ఏ తప్పు చేయలేదని నేరుగా చెప్పింది. శోభిత కారణంగా సమంత-నాగ చైతన్య విడిపోయారా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనేది పక్కన పెడితే... సమంత మాత్రం నాగ చైతన్య మీద కోపంగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. 

Samantha

నాగ చైతన్య తనకు అన్యాయం చేశాడని భావిస్తున్న సమంత ఓ నిర్ణయం తీసుకున్నారట. తాను జీవితంలో పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయ్యారట. అలా చేస్తే నాగ చైతన్యకు వచ్చిన నష్టం ఏమిటని మీరు భావించవచ్చు. సమంత పెళ్లి చేసుకోలేదని గుర్తుకు వచ్చిన ప్రతిసారి నాగ చైతన్య తాను చేసిన తప్పు గుర్తు చేసుకుని బాధపడాలి అట. అలాగే ఇంకా కష్టపడి కెరీర్లో మరింత ముందుకు వెళ్లాలని, నాగ చైతన్య ఈర్ష్య పడేలా ఎదగాలని ఆమె భావిస్తున్నారని సోషల్ మీడియా టాక్.. 
 

Latest Videos

click me!