Venu Madhav: నా కాలు నా ఇష్టం.. స్టార్ హీరోని ఎదురు ప్రశ్నించిన వేణు మాధవ్, నెక్ట్స్ ఏంజరిగిందంటే?

Published : Sep 19, 2026, 12:02 PM IST

Venu Madhav: ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలంటే ఓ భయం ఉంటుంది. వారితో మాట్లాడటానికి ఎంత పెద్దవారైనా సంకోచిస్తుంటారు. అటువంటిది కాస్త కోపం ఎక్కువగా ఉన్న ఓ సీనియర్ హీరోకి దివంగత కమెడియన్ వేణుమాధవ్ ఎదురు ప్రశ్నం వేశాడన్న సంగతి మీకు తెలుసా?

PREV
14
చిన్నవయసులోనే కన్ను మూసిన స్టార్ కమెడియన్

టాలీవుడ్ లో కమెడియన్ గా చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ డమ్ సంపాదించిన వారిలో వేణు మాధవ్ కూడా ఒకరు. బ్రహ్మానందం, బాబుమోహన్ లాంటి కమెడియన్స్ రాజ్యమేలుతున్న టైమ్ లో.. తనమార్క్ కామెడీతో ఇండస్ట్రీకి తన ట్యాలెంట్ చూపించాడు వేణుమాధవ్. తక్కువటైమ్ లోనే స్టార్ కమెడియన్స్ లో ఒకడిగా సెటిల్ అయ్యాడు. చిన్నా పెద్ద హీరోలందరితో కలిసి నటించిన వేణు.. టీవీ షోస్ కు కూడా యాంకర్ గా అలరించాడు. స్టార్ డమ్ తో పాటు ఆస్తులు కూడా భారీగా కూడబెట్టిన వేణు మాధవ్... ఎంతో కెరీర్ ఉండగానే.. చిన్నవయసులోనే కన్ను మూశాడు.

24
కామెడీతో పాటు కాంట్రవర్సీలు..

వేణుమాధవ్ కామెడీతో పాటు కాంట్రవర్సీలు కూడా ఎక్కువగానే చేసేవారు. ఈ విషయాలపై గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు వేణు. సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వేణుమాధవ్ ఒకసారి సినిమా షూటింగ్‌కు వెళ్లినప్పుడు ఒక పెద్ద స్టార్ హీరో నుంచిర చిన్న హెచ్చరికను ఫేస్ చేశాడట. ఆ హీరో ఆ సినిమా షూటింగ్ లో వేణుమధవ్ దగ్గరకి వచ్చి.. "ఏమయ్యా.. నువ్వు సెట్‌లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావట కదా?" అని ప్రశ్నించారు. ఎవరైనా చెప్పుడు మాటలు చెప్పి ఉంటారని భావించి, క్లారిటీ ఇవ్వడానికి వేణుమాధవ్ ప్రయత్నించాడట.

34
నా కాలు నా ఇష్టం అంటూ ఎదురు ప్రశ్న..

స్టార్ హీరో వేసిన ఆ ప్రశ్న వినగానే వేణుమాధవ్ ఏమాత్రం భయపడకుండా తనదైన శైలిలో స్పందించారు. "సార్! నేను ఎదుటివారి కాలు మీద కాలు వేస్తే అది తప్పు లేదా మర్యాద కాదనుకోవచ్చు.. కానీ నా కాలు మీద నా కాలు వేసుకుంటే అందులో తప్పేముంది సార్?" అని ఎదురు ప్రశ్నించారు. ఆ సమాధానం విన్న ఆ స్టార్ హీరో కొద్దిసేపు ఏమీ మాట్లాడలేక నోరెళ్లబెట్టారని, ఆ తర్వాత సైలెంట్‌గా ఉండిపోయి అదే సినిమాలో తనతో కలిసి నటించారని వేణుమాధవ్ గుర్తుచేసుకున్నారు. కాలు మీద కాలు వేసుకోవడం అనేది తమ ఇంట్లో తండ్రిగారి నుంచి వచ్చిన అలవాటని అది తెలియకుండానే జరిపోతుందన్నారు వేణుమాధవ్.

44
వివాదాలపై గతంలోనే క్లారిటీ ఇచ్చిన వేణుమాధవ్

సినీ పరిశ్రమలో కమెడియన్ల పరిస్థితుల గురించి వేణు మాధవ్ మాట్లాడుతూ, ప్రస్తుతం పరిశ్రమలో నటుల సంఖ్య బాగా పెరిగిపోయింది. వేణుమాధవ్‌ లాంటి నటుడికి ఒక రూపాయి ఇస్తే, పావురూపాయికే నటించేందుకు సిద్ధపడే వారు వస్తున్నారు. అయితే ఎంతమంది వచ్చినా కామెడీలో 'టైమింగ్' అనేది అత్యంత కీలకం, కొందరికే ఆ అద్భుతమైన టైమింగ్ సాధ్యమవుతుంది. అది అందరి వల్ల కాదు అని వేణుమాధవ్ అన్నారు. తనకు టైమింగ్ ఉందనే పేరున్నా, 'టైమ్ సెన్స్' ఉండదనే విమర్శలపై వేణుమాధవ్ స్పష్టత ఇచ్చారు.

హౌసింగ్ బోర్డ్ నుంచి ఫిలింనగర్‌కు రావడం, ఆనాటి ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా అగ్రీమెంట్ సమయంలోనే షూటింగ్ సమయాలపై క్లారిటీ ఇచ్చేవాడినని తెలిపారు. ఒకే రోజు వరుసగా వేర్వేరు హీరోల సినిమాల షూటింగ్స్ ఉండటం వల్ల, ఒక సెట్ నుంచి ఇంకో సెట్‌కు వెళ్లే క్రమంలో కొంత సమయం పట్టేదే తప్ప కావాలని ఏ హీరోనూ తాను వెయిట్ చేయించలేదని ఆయన క్లారిటీ ఇచ్చాడు.

Read more Photos on
click me!

Recommended Stories