రెబల్‌స్టార్ కృష్ణంరాజు రాజుల ఫ్యామిలీ నుంచి వచ్చారు. తన ప్రవర్తన మొత్తం అలానే ఉండేదట. అయితే ఓ దశలో ఆయన ఇండస్ట్రీకే రూల్ పెట్టాడట. నెల రోజులు మాత్రం తనని ఎవరూ టచ్ చేసేవారు కాదట.
రెబల్‌స్టార్ కృష్ణంరాజు మాస్, యాక్షన్, రెబల్ సినిమాలతో నటించి మెప్పించారు. ఆయన తిరుగుబాటు నేపథ్యంలోని సినిమాలే కాదు, మహిళా ప్రధానమైన చిత్రాలు కూడా చేసి ఆకట్టుకున్నారు. తిరుగులేని రెబల్ స్టార్‌గా ఎదిగిన కృష్ణంరాజు తన లైఫ్‌లో ఒక నియమం పెట్టుకున్నారు. ఇండస్ట్రీకి కూడా అదే రూల్‌ని పెట్టాడు. ఒక నెల రోజులు మాత్రం ఆయన్ని టచ్ చేయడానికి లేదు. ఆ నెల రోజులు షూటింగ్‌లు బంద్. మరి ఇంతకి ఆ నియమం ఏంటి? ఎందుకు పెట్టుకున్నారనేది చూస్తే.
24
నెల రోజులు షూటింగ్‌లు బంద్
కృష్ణంరాజు తనకు, ఇండస్ట్రీకి పెట్టిన నియమం నెల రోజులు షూటింగ్‌లు బంద్ పెట్టడం. ప్రతి ఏడాది ఆ నెల రోజులు షూటింగ్‌లకు దూరంగా ఉంటాడట. అది సమ్మర్‌లో కావడం విశేషం. సమ్మర్‌లో మే నెలలో రెబల్ స్టార్ సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉండేవారట. ఆయా సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. దీంతో షూటింగ్‌లకు వెళ్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. తన గ్లామర్ దెబ్బతింటుందనే ఉద్దేశ్యంతో ఆయన సినిమాలకు దూరంగా ఉండేవారట. ఆయనతో ఎవరు సినిమాలు చేసినా ఆ సమయంలో మాత్రం షూటింగ్‌లు బంద్ పెట్టుకోవాల్సిందేనట. కొత్తవి అయితే మే తర్వాత ప్రారంభించడం, ఆల్‌రెడీ షూటింగ్ జరుగుతున్నవి అయితే నెల రోజులు గ్యాప్ ఇవ్వడం చేసేవారట.
34
మైసూర్‌లో గుమ్మడితో కృష్ణంరాజు గొడవ
కృష్ణంరాజు ఒక స్టేజ్‌కి వచ్చాక ఈ నియమాన్ని పెట్టుకున్నారని, చివరి వరకు దాన్ని ఫాలో అయ్యారని ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. నెల రోజులపాటు సినిమాలకు దూరంగా ఉండేవారట. కూల్‌గా ఉండే గెస్ట్ హౌజ్‌లోనే ఉండి రెస్ట్ తీసుకునేవారని తెలిపారు. అయితే దాన్ని బ్రేక్ చేసి తాము ఒకసారి సినిమా తీసినట్టు తెలిపారు. తప్పదని రిక్వెస్ట్ చేయగా, మైసూర్‌లో షూటింగ్ పెట్టుకోమని చెప్పారట. అక్కడ అయితే కూల్‌గా ఉంటుంది, షూటింగ్ చేస్తానని చెప్పారట. దీంతో అక్కడే షూటింగ్ చేశారట. కానీ అందులో గుమ్మడి కీలక పాత్రలో నటించారు. కృష్ణంరాజు, గుమ్మడి మధ్య సన్నివేశాలున్నాయి. ఓ సీన్‌లో గుమ్మడికి కృష్ణంరాజు ఇలా నటించాలని సలహా ఇచ్చారట. దీంతో ఆయనకు మండిందట. నాకు చెప్పేంత నటుడివా అంటూ మండి పడ్డారట.
దీంతో ఇద్దరి మధ్య గొడవ అయ్యిందని, షూటింగ్ ఆగిపోయిందని తెలిపారు. తమ్మారెడ్డి భరద్వాజ అన్నయ్య దీనికి దర్శకుడు. ఆయన సాల్వ్ చేయాలని చూసినా వర్కౌట్ కాలేదు. దీంతో బయట కూర్చున్నాడట. అదే సమయంలో తాను వచ్చాడట. ఏం చేయాలని తాను కూడా ఆలోచిస్తున్న సమయంలోనే నటుడు కేవీ చలం వచ్చాడట. ఆయనకు జరిగిన విషయం చెప్పారట. ఓసి ఇంతేనా.. అని తాను సాల్వ్ చేస్తానని చెప్పి గుమ్మడి వద్దకు వెళ్లాడట. ఏమైందని అడగ్గా, ఆయన జరిగింది చెప్పాడు. ఓసీ ఇంతేనా.. వాడు నాకు రోజూ యాక్టింగ్ నేర్పిస్తాడని పంచ్ వేశాడట. దెబ్బకి గుమ్మడితోపాటు కృష్ణంరాజు నవ్వులు చిందించారు. సెట్ మొత్తం నవ్వింది, గొడవ సాల్వ్ అయ్యిందట. అలా ఆ ఒక్కసారి మాత్రమే కృష్ణంరాజు మేలో షూటింగ్ చేసినట్టు తెలిపారు తమ్మారెడ్డి భరద్వాజ. కృష్ణంరాజు రాజుల ఫ్యామిలీ కదా, ఆయన వ్యవహారం మొత్తం అలానే ఉంటుందని, రాజులానే ఉండేవారని తెలిపారు.