Atlee: గాడిద కథతో అట్లీ ఏం చెప్పాలనుకున్నాడు, విజయ్ సేతుపతికి అల్లు అర్జున్ దర్శకుడు స్ట్రాంగ్ కౌంటర్

Published : Sep 19, 2026, 11:02 AM IST

Atlee: విజయ్ సేతుపతి హీరోగా నటించిన 'బత్తా' సినిమా ఆడియో లాంచ్ లో నిర్మాత అట్లీ ఏం మాట్లాడారో, విజయ్ సేతుపతికి ఎలా కౌంటర్ ఇచ్చారో తెలుసా? ఇందులో నిజం ఎంత? ఏం అన్నారు.

PREV
14
విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం..

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన సినిమా 'బత్తా'. అట్లీ నిర్మించిన ఈ సినిమాకు బాలాజీ తరణీధరన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆడియో లాంచ్ చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. విజయ్ సేతుపతి, అట్లీతో పాటు చిత్రబృందం అంతా ఇందులో పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ పై అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. ఎందుకంటే, గత వారం బిగ్ బాస్ షోలో విజయ్ సేతుపతి ఒక కామెంట్ చేశారు. సమస్య వస్తే ఎదుటివారిపై నెపం వేసి పారిపోవడం నాయకుడి లక్షణం కాదని ఆయన అన్నారు. ఇది సీఎం విజయ్ ని ఉద్దేశించే అన్నారని విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సేతుపతిని ఓ రేంజ్ లో ఆడుకున్నారు.

24
విజయ్ సేతుపతికి కౌంటర్ ఇచ్చిన అట్లీ

ఈ వివాదం పెద్దది కావడంతో విజయ్ సేతుపతి సైలెంట్ గా ఉండిపోయారు. బత్తా ఆడియో లాంచ్ లో దీనిపై ఆయన క్లారిటీ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ నిర్మాత అట్లీ సడెన్ గా స్టేజ్ ఎక్కి అవుట్ ఆఫ్ సిలబస్ మాట్లాడారు. ఒక విజయ్ అభిమానిగా కుట్టి స్టోరీ చెప్పి విజయ్ సేతుపతికి గట్టి కౌంటర్ ఇచ్చారు. అట్లీ మాటలు వినగానే విజయ్ సేతుపతి ముఖం మారిపోయింది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది.

34
అట్లీ ఏమన్నాడంటే?

అట్లీ మాట్లాడుతూ.. "ఈరోజు నేను వేసుకున్న ప్యాంట్, షర్ట్ నా కష్టార్జితం అనుకున్నా, నా అన్న దళపతి లేకపోతే ఇదంతా సాధ్యం కాదు. రాజా రాణి సినిమాతో నేను ఫేమస్ అయ్యాను. కానీ విజయ్ అన్నే నాకు లైఫ్ ఇచ్చారు. వరుస అవకాశాలు ఇచ్చి నా జీవితాన్ని మార్చేశారు. షారుఖ్ సార్ నుంచి అవకాశం వచ్చినప్పుడు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఆ సినిమా చెయ్ నీ లైఫ్ మారిపోతుంది అని విజయ్ అన్న చెప్పారు. ఆయన చెప్పినట్లే జరిగింది. అందుకే విజయ్ అన్నకు చాలా థాంక్స్" అని అట్లీ అన్నారు.

44
అట్లీ చెప్పిన గాడిద స్టోరీ

ఆ తర్వాత వివాదానికి కౌంటర్ గా అట్లీ ఒక కుట్టి స్టోరీ చెప్పారు. "ఊరి వాగుడును మనం ఆపలేం. వాళ్ల మాటలు నమ్మి బతకడం మూర్ఖత్వం. ఊరు వంద అంటుంది. నేను ఒక చిన్న కథ చెబుతాను. ఒక చాకలి రెండు ఊర్లు దాటి బట్టలు ఉతకడానికి వెళ్లాలి. అందుకోసం గాడిద మీద బట్టలు వేసుకుని వెళ్తున్నాడు. మొదటి ఊరు దాటుతుంటే, నీకు బుద్ధుందా, గాడిద మీద ఇన్ని బట్టలు వేసుకుని వెళ్తున్నావ్ అని అన్నారట. దాంతో ఆ మూటను తీసి తన తల మీద పెట్టుకుని నడిచాడు. అప్పుడు పక్క ఊరివాడు, నీకు బుర్ర ఉందా, గాడిదను పక్కన పెట్టుకుని మురికి మూటను తల మీద మోస్తున్నావ్ అని తిట్టాడట.

అందుకే ఎవడో ఏదో అంటున్నాడని పట్టించుకోకండి. మీరు ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్తూనే ఉండండి. ఎవరి మాటలు వినకండి, చిన్న చిన్న ఉచ్చుల్లో పడకండి. ఎందుకంటే మనమే తర్వాతి తరం. ఈ సోషల్ మీడియాలో ఆయన ఈయన్ని అంటున్నాడు, ఈయన ఆయన్ని అంటున్నాడు అని వస్తుంటాయి. అవన్నీ పట్టించుకోవద్దు. చెప్పాలనుకుంటే నేరుగా చెప్పొచ్చు. తర్వాతి తరం రాజకీయాలపై ఆసక్తి చూపించడానికి ఒకే ఒక్క కారణం విజయ్ అన్న. గతంలో అసెంబ్లీని నేను ఎప్పుడూ చూడలేదు. కానీ ఈరోజు అసెంబ్లీలో ఏం జరుగుతుందో 5 ఏళ్ల పిల్లాడు కూడా చూస్తున్నాడు" అని అట్లీ మాట్లాడారు. ఈ స్పీచ్ విన్న విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం అట్లీ.. అల్లు అర్జున్ తో దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో రాకా సినిమా చేస్తున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories