SVP Movie: 'వెన్నెల కిషోర్ సెంటిమెంట్' మహేష్ కి మరో దూకుడు అవుతుందనుకుంటే బ్రహ్మోత్సవం పడింది! 

First Published | May 12, 2022, 10:54 AM IST

చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్స్ చాలా కామన్. హీరో హీరోయిన్స్ నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్, కమెడియన్స్ వరకు సెంటిమెంట్ కోసం నటులను రిపీట్ చేస్తూ ఉంటారు. ఒకసారి హిట్టైన కాంబినేషన్ పలు చిత్రాల్లో కనిపిస్తూ ఉంటారు. అలాంటి కాంబినేషన్స్ లో మహేష్-వెన్నెల కిషోర్ ఒకటి.

Sarkaru Vaari Paata - Mahesh babu

మహేష్ (Mahesh Babu)కెరీర్ లో దూకుడు భారీ బ్లాక్ బస్టర్ గా ఉంది. 2011లో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మహేష్ కి కమ్ బ్యాక్ ఇచ్చిన మూవీ. వరుస పరాజయాల్లో ఉన్న మహేష్ దూకుడు చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కాడు. దూకుడు విజయంలో కామెడీదే అగ్రస్థానం. దర్శకుడు శ్రీను వైట్ల, గోపి మోహన్, కోనా వెంకట్ కామెడీ ట్రాక్స్ అద్భుతంగా పేలాయి. 
 

Sarkaru Vaari Paata - Mahesh babu

సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం, ఎం ఎస్ నారాయణ హైలెట్ కాగా.. ఫస్ట్ హాఫ్ లో మహేష్-వెన్నెల కిశోర్ (Vennela Kishore) కామెడీ ట్రాక్ అలరిస్తుంది. మహేష్ అండర్ కవర్ టీమ్ లోని పోలీస్ ఆఫీసర్ శాస్త్రిగా వెన్నెల కిషోర్ కామెడీ నవ్వులు పూయించింది. వెన్నెల కిషోర్ తో మహేష్ కామెడీ టైమింగ్, పంచెస్ బాగా పేలాయి. ఫస్ట్ హాఫ్ కి వీరి కామెడీ ప్రధాన బలంగా నిలిచింది. 
 


Sarkaru Vaari Paata - Mahesh babu

కామెడీ ట్రాక్స్ లో మహేష్-వెన్నెల కిషోర్ సూపర్ సక్సెస్ అంటూ దూకుడు (Dukudu) మూవీతో నిరూపించుకున్నారు.ఈ క్రమంలో మహేష్ తన చిత్రాలలో ఆ తరహా క్యారెక్టర్ ఉంటే వెన్నెల కిశోర్ నే ప్రిఫర్ చేస్తున్నారు. అదే సెంటిమెంట్ తో మహేష్ తన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట చిత్రంలో వెన్నెల కిశోర్ ని రిపీట్ చేశారు. 
 


అయితే సినిమా ఫలితం మాత్రం దెబ్బేసిందన్న మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది. సర్కారు వారి పాట (Sarkaru vaari Paata) మూవీలో వీరిద్దరి కామెడీ ట్రాక్ పండిందా లేదా అనేది పక్కన పెడితే.. దూకుడు సక్సెస్ సెంటిమెంట్ మాత్రం పునరావృతం కాలేదు. సర్కారు వారి పాట మిక్స్డ్ రివ్యూస్ సొంతం చేసుకుంటుండగా దూకుడు బదులు బ్రహ్మోత్సవం సెంటిమెంట్ రిపీట్ అయ్యిందంటున్నారు. 
 

Sarkaru Vaari Paata - Mahesh babu

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ నటించిన బ్రహ్మోత్సవం (Brahmotsavam) చిత్రంలో కూడా మహేష్-వెన్నెల కిశోర్ కామెడీ ట్రాక్ ఉంది. అయితే బ్రహ్మోత్సవం ఫలితం మనందరికీ తెలిసిందే. మహేష్ కెరీర్ లో ఆల్ టైం డిజాస్టర్స్ లో అది ఒకటి. ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్న నెటిజెన్స్.. వెన్నెల కిశోర్ తో దూకుడు సెంటిమెంట్ రిపీట్ చేద్దామనుకుంటే బ్రహ్మోత్సవం సెంటిమెంట్ తగులుకుంది అంటున్నారు. 
 

Sarkaru Vaari Paata Twitter Talk

ఇప్పుడిదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తుంది. సర్కారు వారి పాట చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ ఆయనకు జంటగా నటించారు. థమన్ సంగీతం అందించగా... మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించాయి. 

Latest Videos

click me!