సూపర్ స్టార్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట థియేటర్స్ లో సందడి షురూ చేసింది. తెల్లవారు జాము నుంచే యుఎస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. దీనితో థియేటర్స్ వద్ద మహేష్ అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.