Janaki Kalaganaledu: గోవిందరాజుని చూసి కన్నీళ్లు పెట్టుకున్న వెన్నెల.. రామచంద్రకు ధైర్యం చెప్పిన జానకి?

First Published Jan 20, 2023, 11:35 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 20వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ లో జెస్సీ అఖిల్ వాళ్ల కోసం ఎదురుచూస్తూ ఉండగా ఇంతలోనే అఖిల్ వెన్నెలను పిలుచుకొని ఇంటికి వస్తాడు. అప్పుడు వెన్నెల గోవిందరాజులు పరిస్థితి చూసి ఏడుస్తూ ఉంటుంది. దాంతో అందరూ బాధపడుతూ ఉంటారు. ఏంటి నాన్న ఇలా జరిగింది మిమ్మల్ని ఇలా చూస్తానని నేను కలలో కూడా అనుకోలేదు అని అంటుంది. అమ్మ వెన్నెల ఊరుకో అని అనగా ఎలా ఊరుకుంటుంది లేండి మామయ్య గారు సింహంలా ఊరంతా తిరిగే మిమ్మల్ని అలా వీల్ చైర్ లో చూసేసరికి వెన్నెల బాధపడుతుంది అంటుంది మల్లిక. అప్పుడు వెన్నెల ఎందుకమ్మా ఇంత జరిగిన నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అసలు ఏం జరిగిందమ్మా అని జ్ఞానాంబని అడుగుతుంది. ఆరోగ్యంగా ఉండే నాన్న ఇలా అయిపోయాడు.
 

ఏంటి మన ఇంట్లో కాకుండా మీరందరూ ఇంట్లో ఉన్నారు ఏంటి అని అడుగుతుంది. అప్పుడు మల్లిక అత్తయ్య గారిని అడిగితే అత్తయ్య గారు ఏం చెప్తారు. దీనికి అంతటికీ కారణం నేనే అని బావ గారు ఎలా చెప్తారు అంటూ రామచంద్రని ఇరికిస్తుంది మల్లిక. ఇక దీనికి అంతటికి కారణం మీ అన్నయ్య రామచంద్ర నే అంటూ జరిగింది మొత్తం వివరించడంతో వెన్నెల బాధపడుతూ ఉంటుంది. అప్పుడు మల్లిక, ఇంకా లేనిపోనివ్వని చెప్పి వెన్నెలను ఇంకా బాధ పెడుతూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర వెన్నెల దగ్గరికి వచ్చి కొద్ది రోజులు ఓపిక పట్టమ్మా కష్టాలన్నీ తీరిపోయి మనం పాత ఇంటికి వెళ్లి పోదాము అప్పులన్నీ నేను తీర్చేస్తాను అంటాడు. అప్పుడు జ్ఞానాంబ సీరియస్ అవుతూ చందమామల కథలు చెబితే వినడానికి అది చిన్న పిల్ల కాదు తీర్చడానికి అది చిన్న అప్పు కూడా కాదు అంటుంది.
 

 కొన్ని కొన్ని సార్లు తప్పులు మన జీవితాంతం కూడా బాధను భరించవచ్చు అంటుంది జ్ఞానంబ. అమ్మాయి ప్రయాణం చేసి వచ్చింది తర్వాత మాట్లాడుకుందాం అమ్మ జానకి వెన్నెలను లోపలికి పిలుచుకొని వెళ్లమంటాడు గోవిందరాజులు. మరొకవైపు రూంలోకి వెళ్లిన మల్లిక ఇక్కడ ఉన్నోళ్లకి గతి లేదనుకుంటుంటే మళ్ళీ ఈవిడ గారు ఊడిపడ్డారు మాకే తినడానికి లేదు మళ్ళీ వెన్నెల ఎందుకు వచ్చింది అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మల్లిక లీలావతి కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేద్దామంటే సమయం దొరకడం లేదు ఈ ఇరుకు కొంపలో సమయం గడపడానికి లేదు కనీసం ఫోన్ మాట్లాడడానికి కూడా లేదు అంటుంది. గుడిలో నీ పర్ఫామెన్స్ ఇరగదీసావు అని మల్లిక నవ్వుతూ మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు అన్ని విష్ణు వింటాడు.
 

అప్పుడు వెన్నెల గురించి కూడా నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఈ ఆడపడుచులు ఉన్నారే పెళ్ళికి ముందు పెళ్లికి తర్వాత పిక్కు తింటూ ఉంటారు అని అంటుంది. అప్పుడు విష్ణుని చూసి ఫోన్ కట్ చేస్తుంది మల్లిక. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నా చెల్లెలు గురించి తప్పుగా మాట్లాడుతున్నావు మనల్ని చూసి వెళ్దాం అని వస్తే ఇలా మాట్లాడుతున్నావు అంటాడు విష్ణు. నేను ఆవేశపడి మాట అన్నా కరెక్ట్ గానే మాట్లాడాను అంటుంది మల్లిక. మీ చెల్లెలు ఇక్కడే ఉంటే తన బాధ్యత అన్ని నీ మీద మీ ముగ్గురు అన్నదమ్ముల మీదే పడుతుంది అని అంటుంది. మీరు పంచుకోడానికి అప్పులు తప్ప ఆస్తులు ఏమి మిగిలాయి అని అంటుంది. నేను అన్న మాట తప్పేమో ఆలోచించండి మరి అని విష్ణుని కన్ఫ్యూజ్ చేస్తుంది మల్లిక.
 

ఆ తర్వాత జ్ఞానాంబ వెన్నెలకు భోజనం వడ్డించి తిను అనగా ఇంతలోనే కరెంటు పోవడంతో జానకి అక్కడికి కొవ్వొత్తి తీసుకొని వస్తుంది. అప్పుడు నాతోపాటు కలిసి తిను వదిన తర్వాత తింటానులే వెన్నెల నువ్వు తిను అనడంతో అమ్మ నువ్వు వడ్డించు అని అనగా వస్తున్నానండి అని అబద్ధం చెప్పి జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు తిను వెన్నెల నేను మీ అన్నయ్య వచ్చాక తింటాను అని అంటుంది. ఆ తర్వాత రామచంద్ర ఇంటికి రావడంతో జానకి అక్కడికి వెళుతుంది. వచ్చేసారా  మీరు ఇంకా ఇంటికి రాలేదు అని నేను ఎదురు చూస్తుంటే మీరేంటి రామచంద్ర గారు ఇక్కడ కూర్చున్నారు అని అంటుంది జానకి. అప్పుడు రామచంద్ర బాధపడుతూ జానకి గారిని బాధ పెట్టడం కంటే చెప్పకపోవడమే మంచిది అనుకొని నవ్వుతూ మాట్లాడతాడు.
 

ఆ తర్వాత జానకి రామచంద్ర ఇంట్లోకి వెళ్ళగా అప్పుడు జ్ఞానాంబ,వెన్నెల కింద పడుకోవడంతో అది చూసి రామచంద్ర బాధపడుతూ ఉంటాడు. నేను ఇంట్లో కూడా బయటనే ఎందుకు కూర్చున్నానో అర్ధమైందా జానకి గారు వయసుకు వచ్చిన ఆడపిల్లని అలా కింద పడుకోబెట్టాను అంటూ రామచంద్ర తనపై తానే కోపగించుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. నా చెల్లెల్ని అలా కింద పడుకోబెట్టాను నాకు చాలా బాధగా ఉంది. ఎప్పుడూ అలా కింద పడుకోలేదు అంటాడు రామచంద్ర. అప్పుడు రామచంద్రకు ధైర్యం చెబుతుంది జానకి. రెండు రోజుల్లో పండగ రాబోతోంది ప్రతి సంవత్సరం పండక్కి బట్టలు ఉనేవాడిని ఇప్పుడు చేతులో చిల్లి గవ్వ కూడా లేదు అని బాధపడుతూ ఉంటాడు రామచంద్ర.
 

జానకి ధైర్యం చెప్పి రామచంద్ర కు భోజనం వడ్డిస్తుంది. ఆ తర్వాత దోమలు కుట్టడంతో వెన్నెల నిద్రలేవగా ఏంటి వెన్నెల నిద్ర లేచావు అని జ్ఞానాంబ అడగడంతో మంచినీళ్ల కోసం లేచాను అని అబద్ధం చెబుతుంది. అది చూసి జ్ఞానాంబ బాధపడుతూ ఉంటుంది. అఖిల్ గేమ్స్ ఆడుతూ కూర్చుండగా జెస్సి ఫోన్ లాక్కొని బయటికి వెళ్లి పని చూసుకో ఇలా గేమ్స్ ఆడటం కాదు అని అంటుంది. అప్పుడు అఖిల్ జెస్సి మీద సీరియస్ అవుతాడు.

click me!