వైజాగ్ లో పుష్పరాజ్.. అల్లు అర్జున్ పై పూల వర్షం కురిపించిన ఫ్యాన్స్.. వైరల్ పిక్స్.!

First Published | Jan 20, 2023, 11:17 AM IST

పుష్ఫ2 షూటింగ్ కోసం వైజాగ్ చేరుకున్న అల్లు అర్జున్ మరియు చిత్ర యూనిట్ కు బన్నీ ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఐకాన్ స్టార్ పై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో ’పుష్ప : దిరైజ్‘ వచ్చి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. వరల్డ్ వైడ్ పుష్పరాజ్ మ్యానరిజం, డైలాగ్స్, పాటలు, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
 

ముందుగానే దీనికి సీక్వెల్ ను కూడా ప్లాన్ చేశారు. దీనిపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ’పుష్ప‘తో దేశ వ్యాప్తంగా బన్నీకి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. దీంతో Pushpa 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలను రీచ్ అయ్యేలానే సుకుమార్ స్క్రిప్ట్ ను కూడా రెడీ చేసినట్టు తెలుస్తోంది.
 


ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకొని షూటింగ్ ను ప్రారంభించుకుంది ’ఫుష్ప : ది రూల్‘. ఈ క్రమంలో తాజా షెడ్యూల్ కోసం నిన్న రాత్రి పుష్ప టీమ్ వైజాగ్ కు చేరుకుంది. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్ వారికి ఘన స్వాగతం పలికారు. 

ముఖ్యంగా విశాఖపట్నంలో ఐకాన్ స్టార్ క్రేజే వేరు. ’పుష్ప‘ తర్వాత పాన్ ఇండియా స్థాయిని దక్కించుకున్న ఐకాన్ స్టార్ తొలిసారిగా వైజాగ్ లో అడుగుపెట్టడంతో అభిమానులు గ్రాండ్ గా వెల్కమ్ పలికారు. ఎయిర్ పోర్టు నుంచి హోటల్ వరకు బన్నీని ర్యాలీగా తీసుకెళ్లారు. 
 

మరోవైపు బన్నీపై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ గోలకు వైజాగ్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇక వైజాగ్ లో పదిరోజుల పాటు షూటింగ్ కొనసాగునున్నట్టు తెలుస్తోంది.
 

అయితే, బన్నీ హెయిర్ స్టైల్, కటౌట్ తో స్టైలిష్ గా దర్శనమివ్వడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. పార్ట్ 2 పుష్పరాజ్ స్టైలిష్ గా కనిపించబోతున్నాడని అంటున్నారు. ఏదేమైనా ’పుష్ప : దిరూల్‘పై అంతటా ఆసక్తి పెరుగుతోంది. చిత్రంలో రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

click me!