
విక్టరీ వెంకటేష్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి వివాదాలు లేని హీరో. క్లీన్ ఇమేజ్‌తో రాణిస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఆడియెన్స్ ని అలరిస్తున్నారు. ప్రేమ కథలు, కుటుంబ కథా చిత్రాలతో ఆకట్టుకున్నారు. అనేక విజయాలు అందుకున్నారు. అదే సమయంలో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సోగ్గాడు శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కి, ముఖ్యంగా మహిళా ఆడియెన్స్ కి దగ్గరైన హీరో వెంకటేష్ అని చెప్పాలి. తన సినిమాలు కుటుంబంతో కలిసి చూసేలా ఉంటే వాటి రేంజ్ ఎలా ఉంటుందో, ఏ రేంజ్‌లో సక్సెస్ అవుతాయో ఈ సంక్రాంతికి వచ్చిన `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంతో నిరూపించారు. ఈ చిత్రం మూడు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టడం విశేషం.
అంతకు ముందు పలు యాక్షన్ చిత్రాలు, ఇతర విభిన్నమైన సినిమాలు చేసి చేదు అనుభవాలు ఫేస్ చేశారు. కానీ ఇప్పుడు సరైన ట్రాక్‌లో పడ్డారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నారు వెంకటేష్. ఇటీవలే ఇది ప్రారంభమైంది. ఇలా తనకు బలంగా నిలిచే కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో వెంకటేష్‌కి సంబంధించిన ఒక వార్త ఎవర్ గ్రీన్‌గా వినిపిస్తుంటుంది. అది ఎప్పుడు విన్నా క్రేజీగా అనిపిస్తుంది. అదే సౌందర్యతో పెళ్లి వరకు వెళ్లారనే వార్త.
వెంకటేష్ హీరోయిన్ సౌందర్యతోనే ఎక్కువగా సినిమాలు చేశారు.. వీరిద్దరి పెయిర్‌కి అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. వెండితెరపై వీరు ఎంతో చూడముచ్చటగానూ ఉండేవాళ్లు. ఇద్దరు కలిసి ఐదారు సినిమాలు చేశారు. `రాజా`, `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు`, `దేవిపుత్రుడు`, `జయం మనదేరా`, `పవిత్ర బంధం`, `పెళ్లి చేసుకుందాం`, `సూపర్ పోలీస్` వంటి సినిమాల్లో నటించారు. ఈ ఇద్దరు కలిసి నటించారంటే సినిమా హిట్టే అనేట్టుగా వాటి ఫలితాలుండేవి. ఒకటి రెండు తప్పితే ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. దీంతో ఈ జంట నటించిన సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ వార్తలు బయటకు వచ్చాయి. ఇద్దరు క్లోజ్‌గా ఉండటంతో, సినిమాల్లో వారి మధ్య కెమిస్ట్రీ అంతే బాగా వర్కౌట్ కావడంతో కొన్ని వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొట్టాయి. వెంకీని సౌందర్య ప్రేమించిందట. అంతేకాదు ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. సౌందర్య సోదరుడి వివాహానికి కేవలం టాలీవుడ్ నుంచి వెంకటేష్ మాత్రమే గెస్ట్ గా హాజరయ్యారు. దీంతో వీరి మధ్య లవ్ ట్రాక్ ఉందనే రూమర్లు వచ్చాయి. అప్పటికే వెంకటేష్‌కి మ్యారేజ్ అయ్యింది. అయినా మరో పెళ్లికి రెడీ అయ్యారనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. వెంకీ, సౌందర్య కలిసి తిరిగే విషయం, పెళ్లికి కూడా రెడీ అయ్యారనే వార్త కాస్త వెంకీ ఫాదర్, నిర్మాత రామానాయుడు వరకు చేరింది. ఆయన ఇన్ వాల్వ్ అయి ఇద్దరిని మందలించాడట. ఆ తర్వాత నుంచి ఈ ఇద్దరు దూరమయ్యారనే వార్తలున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికీ ఈ రూమర్స్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. అయితే వెంకీ అలాంటి వారు కాదని, ఆయన ఫ్యామిలీ పర్సన్ అని ఆయన సన్నిహితులు చెప్పేమాట.
ఏదేమైనా సినిమాల్లో ఇలాంటి రూమర్స్ కామనే. కలిసి సినిమాలు చేస్తే, కాస్త క్లోజ్‌గా ఉంటే ఇలాంటి రూమర్స్ వ్యాపిస్తూనే ఉంటాయి. పైగా ఒకే జంట రెండు మూడు సినిమాలు చేసిందంటే ఆ వార్తలు మరింత బలంగా విస్తరిస్తాయి. వెంకటేష్, సౌందర్య విషయంలోనూ అదే జరిగి ఉండొచ్చు. ఇందులో ఏది నిజమనేది వారికి మాత్రమే తెలుసు. వెంకటేష్‌కి 1985లో నీరజతో వివాహం జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరికి ముగ్గురుకూతుళ్లు. ఒక కొడుకు అర్జున్ ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు కూతుళ్ల వివాహం చేశారు వెంకీ. కొడుకు అర్జున్ స్టడీస్ చేస్తున్నాడు. భవిష్యత్‌లో అర్జున్‌ని హీరో చేసే అవకాశం ఉంది.