ఒకేసారి 5 సమోసాలు
తాను ఒకేసారి 5 సమోసాలు తింటానని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది తమన్నా. అంతే కాదు ఆలుతో చేసే ప్లెయిన్ సమోసాలే తనకు ఇష్టమని, పన్నీర్, ఇతర మిశ్రమాలతో చేసిన సమోసాలు తనకు నచ్చవన్నారు. ఇంట్లో సమోసా చేయనప్పటికీ, థియేటర్లలో దొరికే 'ఏ-వన్' సమోసాలు తరచుగా తింటుందట తమన్నా. ముంబైలోని 'ఏ-వన్' సమోసాలంటే తమన్నాకి చాలా ఇష్టమట. బంగాళాదుంప, బఠానీ కలిపిన సమోసాలే ఇష్టమని, పన్నీర్, ఎండుద్రాక్ష వంటివి వద్దన్నారు. సమోసా కేవలం ఆహారం కాదని, అదొక అభిరుచి అని ఆమె అన్నారు.