ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికెట్ ఇచ్చింది. హెచ్. వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'జన నాయగన్'లో బాబీ డియోల్, పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నరైన్, ప్రియమణి, మమితా బైజు వంటి పెద్ద తారాగణం నటించింది. నిర్మాత వెంకట్ కె. నారాయణ, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. దళపతి విజయ్‌కి ఇష్టమైన ముగ్గురు దర్శకులు లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్‌లను ముద్దుగా 'దళపతి బాయ్స్' అని పిలుస్తారు. ఈ ముగ్గురూ 'జన నాయగన్' క్లైమాక్స్‌లో గెస్ట్ రోల్స్‌లో కనిపించడం విశేషం.