సినిమాలు, నిర్మాణ సంస్థ, వాణిజ్య ప్రకటనలు, మ్యూజిక్ రాయల్టీ వంటి వివిధ మార్గాల ద్వారా ధనుష్ సంపాదిస్తున్నాడు. అతని మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 250 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో సుమారు 19,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన భారీ ఇంట్లో ప్రస్తుతం నివసిస్తున్నాడు. ఈ ఇంటి విలువ సుమారు రూ. 150 కోట్లు అని చెబుతారు. ఈ ఇల్లు సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటికి సమీపంలో ఉంది.
కార్లంటే ఇష్టపడే ధనుష్ వద్ద రోల్స్ రాయిస్, బెంట్లీ, ఫోర్డ్ మస్టాంగ్ వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఒక్కో సినిమాకు రూ. 50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు రూపం కోసం ఎగతాళి చేయబడిన యువకుడు, ఈరోజు ప్రపంచ సినిమాలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే నటుడిగా ఎదగడం ధనుష్ కఠోర శ్రమ, పట్టుదలకు నిదర్శనం.